ఎస్టీ ఫస్ట్ ర్యాంకర్‌కు దక్కని సీటు | st first ranked candidate doesn't have a seat | Sakshi
Sakshi News home page

ఎస్టీ ఫస్ట్ ర్యాంకర్‌కు దక్కని సీటు

Published Wed, Jul 2 2014 2:25 AM | Last Updated on Sat, Sep 2 2017 9:39 AM

ఎస్టీ ఫస్ట్ ర్యాంకర్‌కు దక్కని సీటు

ఎస్టీ ఫస్ట్ ర్యాంకర్‌కు దక్కని సీటు

సీమాంధ్రకు చెందిన మూడో ర్యాంకర్‌కు ఉస్మానియాలో సీటు
ఎండీఎస్ కౌన్సెలింగ్‌లో వివాదం

 
 విజయవాడ/హైదరాబాద్: డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన ఎండీఎస్ కౌన్సెలింగ్‌పై ఆరోపణలు మొదలయ్యాయి. ఎస్టీ కేటగిరీలో తొలి ర్యాంక్ సాధించిన విద్యార్థినికి సీటు రాకపోవడం వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే మెడికల్ పీజీ పరీక్ష, కౌన్సెలింగ్ విషయంలో అనేక అపవాదులు మూటగట్టుకున్న వర్సిటీ అధికారులు.. తాజాగా ఎండీఎస్ కౌన్సెలింగ్ విషయంలోనూ నిర్లక్ష్యం వహించినట్లు ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. గత నెల 27, 28 తేదీల్లో విజయవాడలోని సిద్ధార్థ వైద్య కళాశాలలో ఎండీఎస్ కౌన్సెలింగ్ జరిగింది. ఎస్టీ రిజర్వేషన్ కేటగిరీలో మొదటి స్థానంలో ఉన్న డాక్టర్ ప్రవీణ నాయక్ ప్యూరో డాంటిస్ట్రీ కోర్సులో సీటును ఆశించారు. అయితే అప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఆ సీటును మరొకరితో భర్తీ చేయడంతో.. ఆంధ్రా వర్సిటీ పరిధిలో ప్రవీణకు సీటు ఇవ్వడానికి కౌన్సెలింగ్ అధికారులు నిరాకరించారు.

ఆంధ్రావర్సిటీ పరిధిలో ఎస్టీ కేటగిరీలో సీటు ఉన్నప్పుటికీ దాన్ని ఇప్పటికే స్థానిక విద్యార్థికి కేటయించామని.. నాన్‌లోకల్ అయిన ప్రవీణకు సీటు ఇవ్వడం కుదరదని వారు తేల్చిచెప్పారు. మరోవైపు ఉస్మానియా పరిధిలోనూ ఎస్టీ కేటగిరీలో మూడో ర్యాంకర్‌కు, అదీ సీమాంధ్ర విద్యార్థికి సీటు కేటాయించారని, తన కన్నా తక్కువ ర్యాంకు వచ్చిన వారికి ఎలా అడ్మిషన్ ఇస్తారంటూ ప్రవీణ అభ్యంతరం తెలిపారు. తనకు న్యాయం చేయాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని  మంగళవారం కలిసి వేడుకున్నారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement