St joseph school
-
ప్రముఖ విద్యావేత్త గ్రేగరి రెడ్డి కన్నుమూత
హిమాయత్‌నగర్ (హైదరాబాద్): సెయింట్ ఆంథోనీస్, సెయింట్ జోసెఫ్ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు, ప్రముఖ విద్యావేత్త ఉడుముల గ్రేగరి రెడ్డి(88) కన్నుమూశారు. అనారోగ్యానికి గురై కొంతకాలంగా చికిత్స పొందుతూ దోమలగూడలోని ఆయన నివాసంలో బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. గ్రేగరి రెడ్డికి భార్య, 9 మంది పిల్లలు ఉన్నారు. భార్య ఇటీవలే చనిపోయారు. గ్రేగరి రెడ్డి 1971వ సంవత్సరంలో సెయింట్ ఆంథోనీస్ పేరుతో కింగ్‌కోఠిలో స్కూల్‌ను స్థాపించారు. ఆ తర్వాత పదేళ్లకు 1981లో ఇదే ప్రాంతంలో సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్‌ను ప్రారంభించారు. 2000వ సంవత్సరంలో హబ్సిగూడ, అస్మన్‌ఘట్ ప్రాంతాల్లో సెయిం ట్ జోసెఫ్ పేరుతో మరో రెండు స్కూల్స్‌ను ప్రారంభించారు. ఐసీఎస్సీ బోర్డు మెంబర్‌గా గత నాలుగు దశాబ్దాలుగా విద్యారంగానికి సేవలందిస్తూ ఇంగ్లిష్ మీడియంలో సమూలమైన మార్పుల కోసం ఆయన కృషి చేశారు. గ్రేగరి రెడ్డి భౌతిక కాయాన్ని బంధువులు, స్నేహితుల సందర్శన కోసం గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కింగ్‌కోఠి సెయింట్ జోసెఫ్ స్కూల్లో ఉంచనున్నారు. అనంతరం 3 గంటలకు నారాయణగూడ సిమెంట్రీలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబీకులు తెలిపారు. -
ఎన్‌ఆర్‌ఐలచే నిత్యావసరాల పంపిణీ
సాక్షి, ఖమ్మం: సెయింట్ జోసెఫ్ హైస్కూల్‌కు చెందిన పూర్వ విద్యార్థులు (1993) ఆధ్వర్యంలో వితరణ చేసిన నిత్యావసర సరుకులను త్రీటౌన్ సీఐ సీహెచ్.శ్రీధర్ ఆదివారం పంపిణీ చేశారు. 400 మందికి పైగా పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందజేశారు. కార్యక్రమంలో పీవీఆర్ స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు, జిల్లా నెట్‌బాల్ అసోసియేషన్, సెయింట్ జోసెఫ్ హైస్కూల్ పూర్వ విద్యార్థులు, ఎన్ఆర్ఐలు రోహిత్, తాటికొండ కిరణ్, వైవీ.సునీల్, సీహెచ్.శ్రీలత, కృష్ణమోహన్, డాక్టర్. సీవీవిశ్వేస్వర్, డాక్టర్. పి.సతీష్, హరిప్రసాద్, పీవీరమణ పాల్గొన్నారు. -
చాంప్ సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏపీ రీజియన్ ఐసీఎస్ఈ, ఐఎస్సీ స్కూల్స్ అథ్లెటిక్స్ మీట్లో సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్, కింగ్ కోఠి జట్టు సత్తా చాటింది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన ఈ చాంపియన్‌షిప్ సీనియర్ బాలికల టీమ్ విభాగంలో ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. సీనియర్ బాలికల కేటగిరీలో సెయింట్ జోసెఫ్ జట్టు 40 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. జూనియర్ బాలికల టీమ్ విభాగంలో 63 పాయింట్లు స్కోర్ చేసిన శ్రీసాయి పబ్లిక్ స్కూల్ జట్టు ఓవరాల్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను దక్కించుకుంది. సీనియర్ బాలుర విభాగంలో జాన్సన్ గ్రామర్ స్కూల్ (51 పాయింట్లు), జూనియర్ బాలుర విభాగంలో శ్రీసాయి పబ్లిక్ స్కూల్ (54 పాయింట్లు) తమ విభాగాల్లో ఓవరాల్ చాంపియన్లుగా నిలిచాయి. వ్యక్తిగత విభాగాల్లో కె. హర్షిత (సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్), జి. తేజస్విని, నిఖితా రెడ్డి (శ్రీసాయి పబ్లిక్ స్కూల్), హృషి అగస్త్య (జాన్సన్ గ్రామర్ స్కూల్), సాకేత్‌రెడ్డి, విభాస్కర్ (శ్రీ సాయి పబ్లిక్ స్కూల్) తమ తమ విభాగాల్లో ఓవరాల్ చాంపియన్లుగా నిలిచారు. ఇతర ఈవెంట్ల విజేతల వివరాలు 5కి.మీ రేస్ వాక్ జూనియర్ బాలురు: 1. ఆర్. సాకేత్‌రెడ్డి, 2. విజయ్ ప్రతాప్ సింగ్, 3. భువనేశ్‌రెడ్డి. 8 సీనియర్ బాలురు: 1. హృషికేశ్, 2. రవికిరణ్, 3. పృథ్వీ నాయక్. 8 3కి.మీ రేస్ వాక్ సీనియర్ బాలికలు: 1. రక్ష నంద, 2. హంపి వర్ధిని, 3. జియా. 8 జూనియర్ బాలికలు: 1. వాసవి, 2. వైష్ణవి, 3. శ్రీయ రెడ్డి. 8 200మీ. పరుగు జూనియర్ బాలికలు: 1. టి. నిఖితా రెడ్డి, 2. శ్రీ వర్షిణి, 3. ఎ. కృతి. 8 సీనియర్ బాలికలు: 1. కె. హర్షిత, 2. టి. ప్రణల్లిక, 3. విన్నీ మాథ్యూ. సీనియర్ బాలురు: 1. హృషి అగస్త్య, 2. రుత్విక్ రెడ్డి, 3. రూపేశ్. 8 హైజంప్ జూనియర్ బాలికలు: 1. కె. బేబిశ్రీ, 2. మాధురి, 3. సూర్య చంద్ర ప్రభ లేఖ. సీనియర్ బాలికలు: 1. కసక్ విజయ్‌వర్గీ, 2. టి. ప్రణల్లిక, 3. హనియా అహ్మద్. జూనియర్ బాలురు: 1. కె. యశ్వంత్, 2. విష్ణు రేవంత్ రెడ్డి, 3. భీమ్ భరత్. 8 సీనియర్ బాలురు: 1. ఆర్యన్, 2. హృషికేశ్, 3. రవి వేద్య. 8 ట్రిపుల్ జంప్ సీనియర్ బాలురు: 1. హృషి అగస్త్య, 2. కార్తీక్ సింగ్, 3. బి. రోహిత్. 8 జూనియర్ బాలురు: 1. బి. భీమ్ భరత్, 2. ఉజ్వల్ ప్రకాశ్, 3. నితిన్ కుమార్. 8 సీనియ్ బాలికలు: 1. టి. ప్రణల్లిక, 2. కె. హర్షిత, 3. మూవికా రెడ్డి. 80మీ. హర్డిల్స్ జూనియర్ బాలికలు: 1. సూర్యచంద్ర ప్రభలేఖ, 2. కె. దివ్య, 3. పి. లీనా మార్గరేట్. 8 సీనియర్ బాలికలు: 1. కసక్ విజయ్‌వర్గీ, 2. హనియా అహ్మద్, 3. మడీహున్నిసా బేగం. 8 100మీ. హర్డిల్స్ జూనియర్ బాలికలు: 1. బాలాజీ కృష్ణ, 2. ఆర్. శ్రేయాంక్రెడ్డి, 3. శ్రౌనక్ రెడ్డి. 8 110మీ. హర్డిల్స్ సీనియర్ బాలురు: 1. కార్తీక్‌సింగ్, 2. పి. వంశీ, 3. రుత్విక్ రెడ్డి. 8 జావెలిన్ త్రో సీనియర్ బాలురు: 1. పి. వంశీ, 2. పి. రోహిత్, 3. సత్య వర్ధన్ రెడ్డి. 8 జూనియర్ బాలురు: 1. సందీప్ రెడ్డి, 2. నితిన్ కుమార్, 3. రాకీ కుమార్. 8 జూనియర్ బాలికలు: 1. జి. తేజస్విని, 2. నందిని, 3. అనన్య. 8 సీనియర్ బాలికలు: 1. హనా రెహమాన్, 2. బి. నిహారిక, 3. శ్రీనిత్య. 8 400మీ. పరుగు సీనియర్ బాలికలు: 1. వింధ్య, 2. టి. ప్రణల్లిక, 3. అలీనా సఫి. 8 సీనియర్ బాలురు: 1. హృషి అగస్త్య, 2. రూపేశ్, 3. శ్రీనివాస్. 8 జూనియర్ బాలురు: 1. విభాస్కర్ కుమార్, 2. వంశీధర్‌రెడ్డి, 3. విష్ణు రేవంత్. 8 జూనియర్ బాలికలు: 1. టి. నిఖితా రెడ్డి, 2. సుమయ్యా ఫాతిమా, 3. ప్రేరణ లక్ష్మి. -
విజేత సెయింట్ జోసెఫ్ స్కూల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రీజియన్ ఐసీఎస్ఈ, ఐఎస్సీ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్లో సెయింట్ జోసెఫ్ స్కూల్ (మలక్‌పేట్) జట్టు సత్తా చాటింది. గుంటూర్లోని లయోలా పబ్లిక్ స్కూల్ వేదికగా జరిగిన ఈటోర్నీ వాలీబాల్ చాంపియన్‌షిప్‌లో సెయింట్ జోసెఫ్ జూనియర్ బాలుర జట్టు విజేతగా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన జూనియర్ బాలుర ఫైనల్లో సెయింట్ జోసెఫ్ 23–25, 25–23, 15–13తో సెయింట్ ఆన్స్ (పేట్ బషీరాబాద్)పై గెలుపొందింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో సెయింట్ జోసెఫ్ (హబ్సిగూడ) 25–21, 25–20తో లయోలా జట్టును ఓడించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో సెయింట్ ఆన్స్ 25–23, 25–23తో సెయింట్ జోసెఫ్స్ హబ్సిగూడపై, సెయింట్ జోసెఫ్స్ మలక్‌పేట్ 23–25, 25–23, 15–13తో లయోలా జట్టుపై విజయం సాధించాయి. హెరిటేజ్ వ్యాలీ జట్టుకు మూడో స్థానం ఈ టోర్నీ సీనియర్ బాలుర విభాగంలో తెలంగాణకు చెందిన హెరిటేజ్ వ్యాలీ స్కూల్ మూడో స్థానంలో నిలిచింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో హెరిటేజ్ స్కూల్ జట్టు 25–20, 25–22తో అభ్యాస స్కూల్‌పై గెలుపొందింది. సీనియర్ బాలుర కేటగిరీలో నూజివీడు స్కూల్ జట్టు విజేతగా, ఎఫ్‌కేఎస్ రాజమండ్రి జట్టు రన్నరప్‌గా నిలిచాయి. ఫైనల్లో నూజివీడు 25–20, 25–18తో ఎఫ్‌కేఎస్ జట్టును ఓడించింది.