St. Maarten
-
ఇర్మా సృష్టించిన పెనువిపత్తు!
-
ఇర్మా సృష్టించిన పెనువిపత్తు!
సాక్షి, వాషింగ్టన్: ఇర్మా తుఫాన్ కరేబియన్ దీవుల్లో పెను విపత్తును సృష్టించింది. ప్రచండమైన గాడ్పులు, వర్షాలతో బుధవారం రాత్రి ఇర్మా తుఫాన్.. అంటిగ్వా, బార్బుడా, ప్యూర్టోరికా, సెయింట్ మార్టిన్ దీవులపై విరుచుకుపడింది. దీంతో ప్రభుత్వ భవనాలు కుప్పకూలాయి. అనేక నివాసాల పైకప్పులు ఎగిరిపోయాయి. విద్యుత్, సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. మరోవైపు, 5 కేటగిరి తుఫాన్ తీవ్రతతో దూసుకుపోతున్న దక్షిణ ఫ్లోరిడా దిశగా సాగుతుండటంతో అమెరికా అప్రమత్తమైంది. హరికేన్ ఇర్మా ధాటికి బార్బుడా ఛిన్నాభిన్నమైంది. 'బార్బుడా శిథిలమయంగా కనిపిస్తోంది. గృహసముదాయాలన్నీ ధ్వంసమయ్యాయి. బార్బుడా దీవి పూర్తిగా నేటమట్టమైంది' అని అంటిగ్వా, బార్బుడా ప్రధాని గాస్టన్ బ్రౌన్ మీడియాతో తెలిపారు. ఇర్మా తుఫాన్ ధాటికి బార్బుడా దీవిలో కనీసం ముగ్గురు చనిపోయినట్టు తెలుస్తోంది. ఇందులో ఒక చిన్నారి ఉంది. ఇక సెయింట్ మార్టిన్ దీవుల్లో ఈ తుఫాన్ ధాటికి ఐదుగురు ప్రాణాలు విడిచారు. వైబ్రంట్ నైట్‌లైఫ్‌కు వేదిక అయిన సెయింట్ మార్టిన్ దీవిలో ఇర్మా పెనువిపత్తును సృష్టించిందని, 95శాతం ఆస్తులు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. 1800 మంది జనాభా గల బార్బుడా దీవి ఏమాత్రం నివాసయోగ్యం కాకుండా సమూలంగా ధ్వంసమైందని, ఇక్కడి ప్రజలంతా నిరాశ్రయులయ్యే పరిస్థితి నెలకొందని ప్రధాని బ్రౌన్ పేర్కొన్నారు. ఇక్కడ ధ్వంసమైన నివాసాలు పునర్నిర్మించేందుకు ఎంతలేదన్న 150మిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసినట్టు చెప్పారు. -
జెట్ ఇంజిన్ బ్లాస్ట్.. బీచ్‌లో మహిళ మృతి
సెయింట్ మార్టిన్ : సముద్రతీరంలో సేదతీరుతూ, దగ్గరి నుంచి విమానాన్ని చూస్తూ జెట్ ఇంజిన్ బ్లాస్ట్ అనుభూతిని ఆస్వాధించాలని వేల కిలో మీటర్లు ప్రయాణించి వచ్చిన ఓ పర్యాటకురాలు మృతిచెందింది. న్యూజిలాండ్‌కు చెందిన ఓ 57 ఏళ్ల పర్యాటకురాలు సెయింట్ మార్టిన్‌లోని డచ్ కరేబియన్ దీవిలో మృతిచెందారు. విమానం ల్యాండ్ అయ్యే సమయంలో కంచెను పట్టుకొని విమానం నుంచి వచ్చే శబ్ధం, గాలులను దగ్గర నుంచి చూస్తూ థ్రిల్ ఫీలవ్వాలనుకుంది. అయితే విమానం నుంచి ఒక్కసారిగా పెద్ద మొత్తంలో గాలి ఓ పేలుడులా బయటకు రావడంతో సదరు మహిళ ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరైంది. జెట్ ఇంజిన్ బ్లాస్ట్ దాటికి గోడకు ఢీకొని కిందపడిపోయింది. దీంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆమె మృతిచెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటనపై సెయింట్ మార్టిన్ దీవి టూరిజం డైరెక్టర్ రొనాల్డో బ్రిసన్ సంతాపం వ్యక్తం చేశారు. ప్రిన్సెస్ జూలియానా అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి సమీపంలోనే బీచ్ ఉంది. విమానాలు టేకాఫ్, ల్యాండ్ అయ్యే సమయాల్లో అటువైపు వెల్లకూడదు అంటూ హెచ్చరిక బోర్డులు ఉన్నా టూరిస్టులు వాటిని పట్టించుకోవడం లేదని అధికారులు తెలిపారు. థ్రిల్ కోసం ఇక్కడకు వస్తుంటారని ప్రమాదవశాత్తూ ఓ మహిళ మృతిచెందడం బాధకరమన్నారు. జెట్ బ్లాస్ట్ వల్ల గత కొన్నేళ్లుగా పలువురు గాయాలపాలైనా, ఓ వ్యక్తి ప్రాణాలు పోవడం ఇదే ప్రథమమని పేర్కొన్నారు. విమానం గాల్లో ఉండగానే దానికి అతి సమీపం నుంచి ఫోటోలు, వీడియోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని పర్యాటకులు భావిస్తుంటారని స్థానికులు తెలిపారు.