ST Welfare Residential students
-
మా టీచర్ మాకే కావాలి..
ఇల్లెందు: మా టీచర్ మాకే కావాలి... టీచర్లు లేకుంటే టీసీలు ఇవ్వండి.. వేరే బడికి వెళ్లిపోతాం.. అంటూ తరగతి గదిలోకి వెళ్లకుండా విద్యార్థినులు బైఠాయించారు. పట్టణంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 9, 10 తరగతుల విద్యార్థినులు తమ ఉపాధ్యాయుల డిప్యుటేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం పాఠశాల ఆవరణలో బైఠాయించిన విద్యార్థినులు ఉపాధ్యాయుడు శ్రీనివాస్‌ను పాల్వంచకు డిప్యుటేషన్ మీద పంపుతున్నారని, తమకు బోధించే వారు ఉండరని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినులు ఆందోళన చేస్తున్న సమాచారం తెలుసుకున్న ఏటీడీఓ సత్యనారాయణ పాఠశాలకు చేరుకుని విద్యార్థినులతో చర్చించారు. అనంతరం డీడీ జహీరుద్ధీన్‌తో మాట్లాడారు. డిప్యూటేషన్‌పై ఎవరినీ పంపించమని చెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ రాష్ట్ర, జిల్లా నాయకులు పృధ్వీ, సీతారామారాజు మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలలో ఆరంభం నుంచి అన్నీ సమస్యలే ఉన్నాయన్నారు. ఇదే విషయమై ఐటీడీఏ డీడీ జహీరుద్ధీన్‌ను వివరణ కోరగా పాల్వంచలో విద్యార్థినులు ఎక్కువ ఉండి ఉపాధ్యాయులు లేకపోవటంతో అక్కడికి డిప్యుటేషన్ ఇచ్చామని తెలిపారు. -
నాసిరకం సరుకులు సరఫరా చేశారు
హుస్నాబాద్‌రూరల్: మీర్జాపూర్ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులకు టెండర్లో చూపిన కంపెనీ సరుకులు కాకుండా తక్కువ ధరలకు వచ్చే నాసిరకం సరుకులను సరఫరా చేసినా వార్డెలు పట్టించుకోవడం లేదని తెలంగాణ రాష్ట్ర గిరిజన సంఘం ఉపాధ్యక్షుడు బీమా సాహెబ్ ఆరోపించారు. శనివారం హుస్నాబాద్ మండలం మీర్జాపూర్ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పెట్టె భోజన సామగ్రిని పరిశీలించారు. పిల్లలకు పోషకాలు లభించే కోడి గుడ్లలో కూడ తక్కువ ధరలకు వచ్చే చిన్న కోడి గుడ్లను సరఫరా చేస్తున్నారని అన్నారు. టీచర్లు పాఠశాలకు రావడం లేదు.. పాఠశాల సమయంలో తరగతి గదుల్లో ఉండాల్సిన టీచర్లు వారికి ఇష్టం వచ్చినట్లు బయట తిరుగుతున్నారని అన్నారు. కొందరు టీచర్లు పాఠశాలకు రావడం హాజరు రిజిష్టర్‌లో సంతకాలు చేసి మళ్లీ రోడ్లపైకి వస్తున్న ప్రిన్సిపాల్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పాఠశాలలో జీవశాస్త్రం టీచరు లేరని, విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేసే ఏఎన్ఎం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. వెంటనే విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీరి వెంట డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు జి.శివరాజ్,రమేశ్‌లు ఉన్నారు. -
ఈ అన్నం ఎలా తినాలి సార్..?
భోజనం ప్లేట్లతో ఎస్టీ హాస్టల్ విద్యార్థుల నిరసన పెనుకొండ: భోజన పదార్థాలు సరిగ్గా వండడం లేదని, అడ్డ పేర్లతో పిలుస్తూ చేయిచేసుకుంటున్నారని స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట పట్టణంలోని ఎస్టీ సంక్షేమ వసతి గృహ విద్యార్థులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థులు భోజనం ఉన్న ప్లేట్లను వెంట తీసుకొని వచ్చి అధికారులకు చూపుతూ హాస్టల్ సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. ఉడికీఉడకని అన్నం పెడ్తున్నారని, భోజనం నాణ్యంగా లేదని ఆరోపించారు. అడ్డ పేర్లతో తమను అవమానపరుస్తున్నారని, తాము హాస్టల్లో ఉండలేకపోతున్నామన్నారు. అనంత రం ఏఓ అబ్దుల్ హమీద్‌కు వినతి పత్రం అందజేశారు. ఏఓ స్పందిస్తూ వసతి గృహానికి వెళ్లి విచారించాల్సిందిగా తమ సిబ్బందిని పంపారు. కార్యక్రమం లో సీఐటీయు నాయకులు రమేష్, చిరంజీవి, విద్యార్థులు పాల్గొన్నారు.