star hotel
-
‘స్టార్’ హోటల్‌కు తెలంగాణ భవన్ బాధ్యతలు!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నిర్మించనున్న తెలంగాణ భవన్ నిర్మాణ బాధ్యతలను పేరు గాంచిన స్టార్ హోటల్‌కు అప్పగించే ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నట్లు సమాచారం. నిర్మాణంతో పాటు నిర్వహణను సైతం స్టార్ హోటల్ యాజమాన్యమే చూసుకునేలా చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. వాస్తవానికి ఇటీవల మీడియాతో జరిపిన చిట్‌చాట్‌లోనే సీఎం ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు.దాదాపు రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల బడ్జెట్‌తో నిర్మించే ఈ ఐకానిక్ భవనాన్ని దేశానికి రోల్‌మోడల్‌గా ఉండేలా నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే రెండు కంపెనీలు ఇచి్చన ప్రెజెంటేషన్‌ను రోడ్లు, భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పరిశీలించారు. వీటిలో కొన్ని మార్పులు చేర్పులు చేసి మరో డిజైన్‌తో రావాలని సూచించారు. అయితే ఇప్పటికే డిజైన్లను ప్రెజెంట్ చేసింది ‘స్టార్ హోటల్’కు సంబంధించిన వారా? లేక ఇతర ప్రైవేటు సంస్థలా? అనేది తేలాల్సి ఉంది. రెండుచోట్ల భవనాలు ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ విభజన గత మార్చి నెలలో పూర్తి అయ్యింది. ఏపీ భవన్ మొత్తం 19.781 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా ఏపీకి 11.536 ఎకరాలు, తెలంగాణకు 8.245 ఎకరాలను కేటాయిస్తూ మార్చి 15న కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఏపీ భవన్ మొత్తం విలువ రూ.9,913.505 కోట్లు అని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. తెలంగాణకు 8.245 ఎకరాలు కేటాయించగా.. ఇందులో 3 ఎకరాల విస్తీర్ణంలో శబరి బ్లాక్, 5.245 ఎకరాల విస్తీర్ణంలో పటౌడీ హౌస్ ఉన్నాయి.శబరి బ్లాక్ ఏరియా అంతా హైదరాబాద్ హౌస్ పక్కకు ఉంటుంది. ఈ ఏరియాలోనే గవర్నర్ బ్లాక్, ముఖ్యమంత్రి బ్లాక్, రాష్ట్ర కేబినెట్ మంత్రుల బ్లాక్.. మూడూ కలిపి 5.245 ఎకరాల స్థలంలో ఒక భవనం నిర్మించనున్నారు. ఇక 3 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పటౌడీ హౌస్ స్థలంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉండేందుకు సౌకర్యవంతమైన భవనాన్ని నిర్మించనున్నారు. ప్రతిరోజూ 100 రూమ్‌లు తెలంగాణ వారికే.. దేశానికే రోల్ మోడల్‌గా నిలిచేలా తెలంగాణ భవన్‌ను తీర్చిదిద్దాలని భావిస్తున్న నేపథ్యంలోనే స్టార్ హోటల్‌కు నిర్మాణ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు తెలిసింది. తాజ్ గ్రూప్ లేదా ఇతర స్టార్ హోటల్ గ్రూప్‌కు అప్పగించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం. ప్రతిరోజూ ఒక వంద రూమ్‌లు తెలంగాణ నుంచి వచి్చన వారికి కేటాయించేలా చర్యలు తీసుకోనున్నారు. -
ప్రపంచంలో ఏకైక 10 స్టార్ హోటల్ ఎక్కడుంది?
బుర్జ్ అల్ అరబ్ ప్రపంచంలోనే ఏకైక టెన్ స్టార్ హోటల్. ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లో ఉంది. ఇది ఒక కృత్రిమ ద్వీపంలో ఉంది. బుర్జ్ అల్ అరబ్ ప్రపంచంలోని అత్యంత ఎత్తయిన హోటళ్లలో ఒకటి. అయితే దాని ఎత్తులో 39 శాతం నివాసయోగ్యం కాదు. బుర్జ్ అల్ అరబ్ 1999 సంవత్సరంలో నిర్మితమయ్యింది. దీని నిర్మాణానికి ఒక బిలియన్ డాలర్లు (రూ. 8330 కోట్లు)కు మించి ఖర్చయింది. ఈ కృత్రిమ ద్వీపం జుమేరా బీచ్‌కు 280 మీటర్లు (920 అడుగులు) దూరంలో ఉంది. బుర్జ్ అల్ అరబ్ ఒక ప్రైవేట్ వంతెన ద్వారా ప్రధాన భూభాగానికి అనుసంధానమై ఉంది. దీనిని ఓడకు గల తెరచాపను పోలివుండేలా నిర్మించారు. దీని పైకప్పుపై హెలిప్యాడ్ కూడా ఉంది. ఇది భూమి నుండి 210 మీటర్లు (689 అడుగులు) ఎత్తులో ఉంది.బుర్జ్ అల్ అరబ్ జుమేరాలో రోజువారీ గది ధర రూ. రూ. 2,58,679 నుండి రూ. 1,055,372 వరకు ఉంది. సందర్శకులు ప్రత్యేక హెలికాప్టర్ సర్వీస్ లేదా రోల్స్ రాయిస్ ద్వారా హోటల్‌కు చేరుకోవచ్చు. దీనిలోని అన్ని సూట్లలో అరేబియా గల్ఫ్ అందాలు కనిపించేలా కిటికీలు ఉంటాయి. ఈ సూట్లలో ఉచిత వైఫై, వైడ్ స్క్రీన్ ఇంటరాక్టివ్ హెచ్డీ టీవీ, రియాక్టర్ స్పీకర్, ఇతర ఆధునిక సౌకర్యాలు ఉంటాయి. బుర్జ్ అల్ అరబ్ జుమేరాలో ఎనిమిది రెస్టారెంట్లు, ఒక స్పా, పలు సీ వ్యూ గదులు ఉన్నాయి. అలాగే రూఫ్‌టాప్ బార్, రెండు స్విమ్మింగ్ పూల్స్, 32 గ్రాండ్ కాబానాస్, ఒక రెస్టారెంట్ ఉన్నాయి. -
అప్పటి వరకు ఒక స్టార్ హోటల్లోనే బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు: హైకమాండ్ ఆదేశం
శివాజీనగర(బెంగళూరు): రాష్ట్రపతి ఎన్నికలు ముగిసేవరకు (జులై 18) తన 122 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలు నగరంలో ఒక స్టార్ హోటల్లో బస చేయాలని బీజేపీ హైకమాండ్ ఆదేశించింది. ఈ మేరకు విప్ల చేత సమాచారం పంపింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఏ విధంగా ఓటు చేయాలనేది హోటల్లోనే బోధిస్తారు. ఇందుకోసం ఢిల్లీలో ముగ్గురు నాయకులను శిక్షణనివ్వడానికి పంపించారని బీజేపీ వర్గాలు తెలిపాయి. అత్యవసర కారణాలతో మినహాయింపు కోరిన కొందరు మంత్రులు మినహాయించి మిగతా వారంతా హోటల్లో ఉండే అవకాశముంది. ఓటింగ్ రోజున హోటల్ నుంచి నేరుగా విధానసౌధకు చేరుకుంటారు. చదవండి: ఒక్కసారిగా రోడ్డు మధ్యలో భారీ గొయ్యి.. నెల క్రితమే నిర్మించారటా! -
'ఫోన్ నెంబర్ ఇవ్వు.. లేకపోతే లైంగికదాడి చేస్తాం'
గచ్చిబౌలి (హైదరాబాద్): ఫోన్ నెంబర్ ఇవ్వకపోవడంతో కొందరు యువకులు బెదిరింపులకు పాల్పడ్డట్లు ఓ యువతి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. యువతి వెంట వచ్చిన బాక్సర్ దాడి చేయడంతో గాయాలయ్యాయని మరో యువకుడు ఫిర్యాదు చేయడంతో ఇరు వర్గాలపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ తిరుపతి, బాధితులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఐటీ కారిడార్‌లోని నాలెడ్జ్ సిటీలో ఐటీసీ కోహినూర్ స్టార్ హోటల్లో 24 గంటలు తెరిచి ఉండే ఒటినో రూఫ్ టాప్ హ్యాంగింగ్ బార్‌కు శనివారం రాత్రి 11.30 గంటలకు యూఎస్‌లో రీసెర్చ్ స్కాలర్, న్యూట్రీషియన్‌గా పనిచేస్తూ నగరంలో ఉండే రాజస్తాన్‌కు చెందిన ఓ యువతి (25)తో కలిసి విష్ణు, విక్రమ్‌లు వెళ్లారు. యువతికి పరిచయస్తుడైన మయాంక్ అగర్వాల్, అబ్రార్, సాదత్, అరీఫుద్ధీన్లతో పాటు మరో ఇద్దరు స్నేహితులు కలిసి అదే బార్‌కు వచ్చారు. చదవండి: (నాగదోషం ఉన్నట్లు నమ్మించి.. పలుమార్లు అత్యాచారం) అర్థరాత్రి దాటిన తరువాత మయాంక్, సాదత్లు యువతిని పక్కకు పిలిచి ఫోన్ నెంబర్ ఇవ్వాలని అడిగారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో బాక్సర్ విక్రమ్ దాడిలో అబ్రార్ గాయపడ్డాడు. వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం అబ్రార్ శనివారం తెల్లవారు జామున రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఫోన్ నెంబర్ ఇవ్వక పోవడంతో తనపై లైంగిక దాడి చేస్తామని బెదిరించారని బాధిత యువతి సోమవారం రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు సీఐ తెలిపారు. విక్రమ్ దాడిలో అబ్రార్, మయాంక్ వర్గం దాడిలో విష్ణు గాయపడ్డారని చెప్పారు. ఇరు వర్గాలపై కేసు నమోదు చేశామని, సీసీ పుటేజీలు పరిశీలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. బాధితురాలితో పాటు విష్ణు, విక్రమ్‌లు మంగళవారం సాయంత్రం రాయదుర్గం పీఎస్‌కు వచ్చారు. యువతి నుంచి పోలీసులు మరిన్ని వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా యువతి మీడియాతో మాట్లాడుతూ తన కుటుంబీకులను కూడా బెదిరిస్తున్నారని ఆరోపించారు. తగిన చర్యలు తీసుకోకుంటే మహిళా కమిషన్‌ను ఆశ్రయిస్తామని తెలిపారు. -
బడా వ్యాపారవేత్తకు షాక్: అటు కుమార్తె పెళ్లి, ఇటు స్టార్ హోటల్లో భారీ చోరీ
జైపూర్: ఒకవైపు అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతోంటే మరోవైపు కేటుగాళ్లు రెచ్చి పోయారు. అదను చూసి తమ పని కానిచ్చేశారు. ముంబై వ్యాపారవేత్తకు చెందిన ఏకంగా రెండు కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు, నగదును దోచు కొనిపోయారు. ఈ భారీ చోరీ ఫైవ్‌స్టార్ హోటల్లో గురువారం జరిగింది. విషయం తెలిసి వ్యాపారవేత్త కుటుంబం ఒక్కసారిగా షాక్ అయింది. (ఎప్పుడంటే అప్పుడు బరువు తగ్గిపోవచ్చా? నిజంగానే ఇదొక సవాలా?) వివరాలను పరిశీలిస్తే ముంబైకి చెందిన వ్యాపారవేత్త రాహుల్ భాటియా కుమార్తె వివాహ వేడుక జైపూర్‌లోని ఫైవ్‌స్టార్ హోటల్ క్లార్క్స్ అమెర్‌లో ఘనంగా జరిపేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా భాటియా, ఇతర కుటుంబ సభ్యులు ఏడో అంతస్తులో బస చేశారు. కింద లాన్లో సంగీత్ వేడుక జరుగుతోంది. అంతా ఆ హడావిడిలో ఉండగా అదును చూసిన దుండగులు రూ. 2 కోట్లకు పైగా విలువైన డైమండ్, బంగారు నగలతోపాటు 95 వేల నగదు చోరీకి పాల్పడ్డారు. విషయాన్ని గమనించిన బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరుపుతున్నామని, సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని పోలీసు అధికారి అపహరించినట్లు పోలీసులు రాధారామన్ గుప్తా శుక్రవారం తెలిపారు. (World Anti Obesity Day: ఈ ఏడు సూత్రాలు పాటించండి చాలు!) హోటల్ సిబ్బంది సహకారంతోనే దొంగతనం జరిగిందని రాహుల్ భాటియా తన ఫిర్యాదులో ఆరోపించారు. దీంతో హోటల్ మేనేజ్ మెంట్, ఇతర సిబ్బందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు వధువు తరపు బంధువులే ఈ పనిచేసి ఉంటారని హోటల్ యాజమాన్యం చెబుతోంది. -
బర్త్ డేకు యువకుడి సర్ప్రైజ్.. నమ్మిన యువతి.. మత్తులో
ముంబై: ప్రస్తుతం యువతీయువకుల మధ్య సరికొత్త బంధాలకు డేటింగ్ యాప్‌లు వేదికవుతున్నాయి. కొత్త వ్యక్తులతో పరిచయం కావడం.. వారితో స్నేహం దారుణ సంఘటనలకు దారి తీస్తోంది. యువతీయువకులతో పాటు గే డేటింగ్ యాప్‌లు కూడా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఆ యాప్‌లను ఉపయోగించుకున్న వారు పలు మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలో ఓ యువతిని తన పుట్టినరోజుకు పిలిచి స్టార్ హోటల్లో అత్యాచారం చేశాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ముంబైకి చెందిన ఓ యువతికి డేటింగ్ యాప్‌లో ఓ యువకుడు నెల కిందట పరిచయమయ్యాడు. అతడితో చాటింగ్ కొనసాగుతోంది. ఇక సోమవారం (జూలై 26వ తేదీ)న ఆమె పుట్టినరోజు ఉండడంతో అతడు ముంబైలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా ఉన్న వర్లీలోని ఓ స్టార్ హోటల్లో బర్త్ డే ఏర్పాట్లు చేశాడు. నీ కోసం ఈ ఏర్పాట్లు చేశానని చెప్పి ఆమెను హోటల్‌కు ఆహ్వానించాడు. అక్కడకు చేరుకున్న యువతికి అతడు మందు గ్లాస్ ఇచ్చాడు. ఆ తర్వాత నెమ్మదిగా మత్తులోకి జారుకుంది. అనంతరం అతడు హోటల్ గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. తేరుకున్న అనంతరం తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని గుర్తించి షాక్‌కు గురయ్యింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
హైటెక్ సిటీ: విదేశీ యువతులతో వ్యభిచారం
మాదాపూర్: హైటెక్ సిటీలోని ఓ స్టార్ హోటల్‌పై యాంటీ హ్యూమన్ ట్రాకింగ్ టీమ్ దాడి చేసి విదేశీ యువతులు, మోడళ్లతో నిర్వహిస్తున్న ఓ వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేసింది. నిర్వాహకుడు పరారీ కాగా, ఐదుగురు యువతులను, ఒక విటుడిని అదుపులోకి తీసుకొని మాదాపూర్ పోలీసులకు అప్పగించింది. మాదాపూర్ సీఐ రవీంద్ర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం... మాదాపూర్‌లోని ఓ స్టార్ హోటల్లో ఉజబెకిస్తాన్‌కు చెందిన ముగ్గురు యువతులు, ఢిల్లీకి చెందిన ఇద్దరు యువతుల పేరిట ఐదు రూమ్‌లు బుక్ చేశారు. నిర్వాహకులు అర్నవ్, ప్రిన్స్‌లు ఫోన్లో విటులతో మాట్లాడి హోటల్‌కు రప్పించి యువతులతో వ్యభిచారం చేయిస్తున్నారు. ఇదిలా ఉండగా, సోమవారం సాయంత్రం 5 గంటలకు సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాకింగ్ టీమ్ సదరు హోటల్‌పై దాడి చేసింది. వ్యభిచార కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉజబెకిస్తాన్‌కు చెందిన ముగ్గురు యువతులు, ఢిల్లీకి చెందిన ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకుంది. విటుడు షేక్‌పేట్‌కు చెందిన జ్ఞాన శేఖర్ మణికంఠన్(44)ను పోలీసులు అరెస్టు చేశారు. హోటల్ గదులలో రూ.29,560 నగదు, కండోమ్ ప్యాకెట్లు, సెల్‌ఫోన్ స్వా«దీనం చేసుకున్నారు. కాగా, యువతులను రెస్క్యూ హోంకు తరలిస్తామని సీఐ తెలిపారు. పరారీలో ఉన్న నిర్వాహకుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
స్టార్ హోటల్ నుంచి వీధి బండికి..
ముంబై: కరోనా మనుషులనే కాదు వారి జీవనోపాధిని కూడా కాటేసింది. దీంతో ఎంతోమంది జనాల బతుకులు రోడ్డు పాలయ్యాయి. ఆ బాధితుల్లో ఒకరే అక్షయ్ పార్కర్. ఈయన చేయి తిరిగిన వంటగాడు. ఇంటర్నేషనల్ స్టార్ హోటల్లో ఆయన కింద ఎందరో వంటగాళ్లు ఉండేవారు. తాజ్ ఫ్లైట్ సర్వీస్‌తో పాటు ప్రిన్సెస్ క్రూయిజ్‌లోనూ పని చేసేవాడు. కానీ కరోనా విపత్తు వల్ల ఎనిమిదేళ్లుగా పని చేస్తున్న ఉద్యోగం ఊడిపోయింది. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఇలాగైతే బతుకు బండి ముందుకు సాగదని తెలసుకున్న అక్షయ్ ముంబై వీధిలో చిన్న స్టాల్ పెట్టుకుని బిర్యానీ వండుతూ నాలుగు పైసలు సంపాదిస్తున్నాడు. (వైరల్ వీడియో.. నిజం తెలిస్తే షాకవుతారు) ఆయన చేసే బిర్యానీ ఘుమఘుమలు మిమ్మల్ని తిననివ్వకుండా వదిలిపెట్టవు. ప్రస్తుతం ఆయన స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్టార్ హోటల్ నుంచి దిగి వచ్చి వీధిలో బండి పెట్టుకోవడం మామూలు విషయం కాదని నెటిజన్లు అతడిని కీర్తిస్తున్నారు. అతడి బిర్యానీ బండి వృద్ధిలోకి రావాలని ఆకాంక్షిస్తున్నారు. ఇక ఎంతైనా స్టార్ హోటల్ చెఫ్ కాబట్టి బిర్యానీ ధర కూడా కాస్త ఎక్కువగానే ఉంది. కిలో వెజ్ బిర్యానీ రూ.800 కాగా కిలో నాన్ వెజ్ బిర్యానీ రూ.900కు అమ్ముతున్నాడు. మీరూ ఆ బిర్యానీ రుచి చూడాలంటే ముంబైలోని దాదర్‌లో జేకే సావంత్ మార్గ్ ప్రాంతానికి వెళ్లి తీరాల్సిందే. (వైరల్: యువతి తలను కోసుకుని తినొచ్చు!!) -
కరోనా ఆస్పత్రిగా మారిన స్టార్ హోటల్
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులతో ఢిల్లీలోని ఫైవ్‌స్టార్ తాజ్ మాన్సింగ్ హోటల్ సర్ గంగారాం ఆస్పత్రికి అనుబంధంగా సేవలందించనుంది. రోగులకు ఆహారం, గదులను ఈ హోటల్ సమకూర్చే బాధ్యత చేపడుతుందని ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రోగులు వైద్య సేవలు పొందినందుకు ఆస్పత్రికి చెల్లించే డబ్బును హోటల్‌కు రీఎంబర్స్ చేస్తారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఫైవ్‌స్టార్ హోటల్లో రోజుకు 5000 రూపాయలతో పాటు వైద్యసేవలకు మరో 5000 రూపాయలు వసూలు చేస్తారు. ఇక ఆక్సిజన్ సిలిండర్ కేటాయించినందుకు రోజుకు 2000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తాజ్ మాన్సింగ్ హోటల్ సిబ్బందికి వ్యక్తిగత రక్షణ పరికరాలు అందచేయడంతో పాటు మౌలిక అంశాల్లో శిక్షణ కల్పిస్తారు. ఆస్పత్రికి చెందిన వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది హోటల్లోనే ఉండే వెసులుబాటు ఉండగా ఈ వ్యయాన్ని ఆస్పత్రి నిర్వాహకులు భరించాలి. కరోనా కేసులు పెరిగిపోవడంతో ఢిల్లీ ఆస్పత్రుల్లో చాలినన్ని బెడ్స్ లేకపోవడంతో హోటల్స్‌ను ఆస్పత్రులకు అటాచ్ చేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. చదవండి : తిండి, నీళ్లు లేవు.. చుట్టూ శవాలే.. వామ్మో! -
బాలుడి మృతికి ఇదే కారణం..
సనత్‌నగర్: అమెరికా వెళ్లేందుకు వీసా కోసం నగరానికి వచ్చి బేగంపేటలోని స్టార్ హోటల్లో బస చేసిన సాఫ్ట్వేర్ దంపతులు రవి నారాయణరావు, శ్రీవిద్య దంపతుల చిన్నకుమారుడు విహాన్ మృతిపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కలుషితాహరం తిని చిన్న కుమారుడు మృతి చెందాడు. దంపతులతో పాటు వారి పెద్ద కొడుకు అస్వస్థతకు గురయ్యారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రవి నారాయణరావు, ఆయన భార్య శ్రీవిద్య నుంచి సేకరించిన వాంగ్మూలం ఆధారంగా బాలుడు విహాన్‌ది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు బేగంపేట ఏసీపీ నరేష్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావులు తెలిపారు. వారు చెబుతున్నట్లు కుటుంబసభ్యులు విషాహారం కారణంగానే అస్వస్థతకు గురయ్యారా..? బాలుడు ఈ కారణంగానే మృతి చెందాడా? లేక మరేమైన కారణాలు ఉన్నాయా అనే కోణాల్లో విచారణ చేస్తున్నామని చెప్పారు. సోమవారం రాత్రి వీరు తీసుకున్న ఆహారంలోని కడాయ్ పన్నీరును హోటల్లో బస చేసిన మరో ఇద్దరు కూడా తీసుకున్నారని, వారు ఆరోగ్యంగానే ఉన్నామనే సమాచారం తమకు అందిందన్నారు. ఈ నేపథ్యంలో రవి నారాయణ కుటుంబసభ్యులు బయటకు ఏమైనా వెళ్లారా, మరేమైనా ఆహారం తీసుకున్నారా? లేదా హోటల్లో తీసుకున్న ఆహారం కారణంగానే అస్వస్థతకు గురయ్యారా అనే కోణంలో అన్ని ఆధారాలు సేకరిస్తున్నామని చెప్పారు. మంగళవారం తెల్లవారుజామున హోటల్‌కు వచ్చిన రవి నారాయణరావు మామ ప్రసాదరావును కూడా విచారించి వివరాలు సేకరించామన్నారు. ఆహార నమూనాల సేకరణ చిన్నారి మృతి చెందడం, కుటుంబసభ్యులు అస్వస్థతకు గురి కావడంతో జీహెచ్ఎంసీ ఆహార తనిఖీ విభాగం అధికారులు బేగంపేటలోని మానస సరోవర్ హోటల్లో బుధవారం సందర్శించి కిచెన్‌ను తనిఖీ చేశారు. అక్కడి వంటకాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ సుదర్శన్‌రెడ్డి నేతృత్వంలో ఏహెచ్ఎంసీ డాక్టర్ రవీందర్‌గౌడ్, వెటర్నరీ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, ఇతర అధికారులు ఆహార శాంపిళ్లను సేకరించారు. బాధితులు తీసుకున్నట్లుగా చెబుతున్న రోటి, కడాయ్ పన్నీర్‌కు సంబంధించిన నమూనాలతో పాటు వారు బస చేసిన గదిలో పడకలపై చేసుకున్న వాంతులకు సంబంధించిన నమూనాలను కూడా అధికారులు సేకరించారు. వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించగా, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఫుడ్ ఇన్స్పెక్టర్ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. బాలుణ్ని కాపాడడానికి 45 నిమిషాలు శ్రమించాం: కిమ్స్ వైద్యులు రవి నారాయణ కుమారుడు నిహాన్ మృతి, సభ్యులంతా అస్వస్థకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా కిమ్స్ వైద్యులు ఒక ప్రకటనను విడుదల చేశారు. ఈ నెల 10న 5.30 గంటల సమయంలో కిమ్స్ హాస్పిటల్‌కు రవినారాయణ, శ్రీవిద్య, ఇద్దరు పిల్లలను తీసుకుచ్చారు. అప్పటికే వారు 8– 10 సార్లు వాంతులు చేసుకున్నారు. వారి పరిస్థితిని దర్యాప్తు చేసిన డాక్టర్లు వారిని మెడికల్ స్టెప్‌డౌన్ యూనిట్‌కు తరలించారు. ఆ ఇద్దరు పిల్లల్లో రెండేళ్ల నిహాన్ పరిస్థితి విషమంగా ఉంది. 45 నిమిషాల పాటు సీపీఆర్ అతనికి అందించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో నిహాన్‌ను కాపాడలేకపోయాయమని వైద్యులు తెలిపారు. మరో బాలుడిని ఐసీయూకు పంపించాం. అతనితో పాటు తల్లిదండ్రులకు ఫ్లూయిడ్స్, యాంటీబయోటిక్స్‌తో చికిత్స అందించాం. ప్రస్తుతం ఈ ముగ్గురి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. డీహైడ్రేషన్‌కు గల కారణం ఇంకా తెలియరాలేదు. ఫుడ్పాయిజనింగ్గా అనుమానిస్తున్నాం. పరీక్షల కోసం రక్త నమూనాలను పంపించాం. వాటి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నామని కిమ్స్ ఆస్పత్రి వైద్యులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. వీరికి కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్ ప్రవీణ్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ డాక్టర్ సంధ్య చికిత్స అందిస్తున్నారు. -
ఫైవ్‌స్టార్ జైలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై పుళల్ సెంట్రల్ జైలు ప్రజల దృష్టిలో నేరస్థులు శిక్షను అనుభవించే కారాగారం. అయితే లోపలున్న కొందరు ఖైదీలకు మాత్రం అదో స్టార్ హోటల్. డబ్బులుపడేస్తే చాలు జీ హుజూర్ అంటూ సర్వం సరఫరా చేసే అధికారులు ఉన్నంతవరకు మాకేం కొదవలేదని ఖైదీలు పదేపదే సవాళ్లు విసురుతూనే ఉన్నారు. ‘అడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపూ సొలుపే మున్నది’ అన్నట్టుగా కొందరు ఖైదీలు బిరియానీ వండుకుంటున్న వీడియో దృశ్యాలు శుక్రవారం బాహ్య ప్రపంచంలోకి వచ్చాయి. సహజంగానే అధికారుల్లో ‘సం’చలనం కలిగించాయి. ఖైదీలు స్టార్ హోటల్ సౌకర్యాలను అనుభవిస్తున్నట్టు, జల్సా జీవితం గడుపుతున్నట్లు ఇటీవల వాట్సాప్‌లో వెలువడిన వందలాది ఫొటోలు హల్చల్ చేశాయి. ఆ తరువాత సహజంగానే ఉన్నతాధికారులు రావడం, తనిఖీల పేరుతో జైల్లో హడావుడి చేయడం, 23 టీవీలను, 3 ఎఫ్ఎం రేడియోలను, 50కి పైగా సెల్ఫోన్లు, సిమ్‌కార్డులు, వంటసామగ్రి, సరుకులు స్వాధీనం చేసుకోవడం, కొందరిని సస్పెండ్, మరికొందరిని బదిలీచేయడం షరామాములుగా జరిగిపోయింది. అయితే అధికారుల హడావుడికి ఖైదీలెవ్వరూ బెదరలేదు, అధికారులు సైతం అదరిపోలేదు. ఎందుకంటే జైలు ఖైదీలు కమ్మనైన బిరియానీ స్వయంగా వండుకుంటున్న దృశ్యాలు శుక్రవారం మరోసారి బైటకువచ్చాయి. జైల్లో శిక్షపడిన ఖైదీల బ్యారెక్స్‌కు సమీపంలోని తోటలో కొందరు ఖైదీలు కాయగూరలు, పప్పుధాన్యాలు, బిరియానీ బియ్యం, వండేందుకు ఎలక్ట్రానిక్ సామగ్రి చుట్టూరా పెట్టుకుని, ఎఫ్ఎం రేడియోలో పాటలు వింటూ వంటపనిలో నిమగ్నమై ఉన్న వీడియో దృశ్యాలు చూసి అధికారులు బిత్తరపోయారు. పుళల్‌జైల్లో ఐదుమార్లు తనిఖీ చేసినా ఎఫ్ఎం రేడియోలు, సెల్ఫోన్లు, గంజాయి ఎలా చేరింది. తనిఖీల సమయంలో దాచిపెట్టారా లేక కొత్తగా సరఫరా అయ్యాయా అని తలలు పట్టుకుంటున్నారు. లగ్జరీ ఖైదీలకు అవసరమైన వస్తువులు యథాప్రకారం చేరిపోతున్నట్లు తెలుసుకున్నారు. ఎన్నిసార్లు తనిఖీలు చేసినా పైస్థాయిలో మాకు పలుకుబడి ఉన్నంతవరకు ఏమీ చేయలేరని ఖైదీలు సవాలు విసురుతున్నారు. జైల్లో పెరిగిన ధరలు: తనిఖీల తరువాత జైల్లో ఖైదీల నిత్యావసర వస్తువుల ధరలు రెట్టింపుగా పెరిగిపోయాయి. బీడీ కట్ట రూ.250 నుంచి రూ.500, సిగరెట్ ప్యాకెట్ రూ.600 నుంచి రూ.1200, గంజాయి 20 గ్రాముల ప్యాకెట్ రూ.6 వేల నుంచి రూ.10వేలుగా నిర్ణయించారు. అలాగే చికెన్‌బిర్యానీ రూ.350 నుంచి రూ.700, మటన్ కూర రూ.700 నుంచి రూ.1500, మటన్ చిక్కా రూ.600 నుంచి రూ.1,200, చికెన్ 65 రూ.1000, ఆమ్లేట్ రూ.100, కోడిగుడ్డు రూ.40 గా అమ్ముతున్నారు. జైల్లో ఒకరు లేదా ఇద్దరు ఖైదీలు మాత్రమే ఉండే వసతికలిగిన గదులకు పెద్ద గిరాకీ ఉంది. వీటిని అధికారికంగా కేటాయించాలంటే అనేక నియమ నిబంధనలు ఉన్నాయి. అయితే అధికారుల చేతులు తడిపితే అన్నీ జరిగిపోతాయని సమాచారం. రూ.2లక్షలు అడ్వాన్సు, నెలకు రూ.40 వేలు అద్దె చెల్లిస్తే లగ్జరీ గది కేటాయించేస్తారు. అధికారికి బెదిరింపు: పుళల్ జైల్లో తనిఖీలు నిర్వహించిన ఏసీబీ ఇన్స్పెక్టర్ సుబ్బయ్య ఆ తరువాత హత్యాబెదిరింపులను ఎదుర్కొన్నారు. మదురైలోని తన కిరాయిముఠాకు చెందిన వారు సుబ్బయ్యను బెదిరించడంతో ఆయనతోపాటు మరికొందరికి బందోబస్తు పెట్టారు. -
మళ్లీ సొంత గూటికి నయన్
నటి నయనతార మళ్లీ సొంతగూటికి చేరారు అనగానే తనేదో మలయాళ చిత్రం చేస్తున్నారని అనుకునేరు.ఈ అమ్మడి వ్యక్తిగత జీవితం ఎప్పుడూ ఆసక్తికరం, ప్రశ్నార్థకమే అని చెప్పాలి. నటిగా లేడీసూపర్‌స్టార్‌గా రాణిస్తున్న నయనతార చాలా కాలం నక్షత్ర హోటళ్లలోనే బస చేస్తూ నిర్మాతలకు అదనపు భారాన్ని మోపుతూవచ్చారు. అలాంటిది ఆ మధ్య స్థానిక ఎగ్మూర్‌లో అధునాతన వసతులతో కూడిన ఒక అపార్టుమెంట్‌ను సొంతంగా కొనేసి అందులో నివసిస్తున్నారు. ఆ అపార్టుమెంట్లోనే తన తాజా ప్రేమికుడు, దర్శకుడు విఘ్నేశ్‌శివతో కలిసి సహజీవనం చేస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. అలాంటిది సడన్‌గా ఏమైందో ఏమోగానీ కొన్ని రోజుల నుంచి ఒక నక్షత్ర హోటల్లో రూమ్‌ను అద్దెకు తీసుకుని అందులో ఉంటున్నారు. దీంతో తాజా ప్రేమికుడితో ప్రేమ కథ అడ్డం తిరిగింది. తాను నటిస్తున్న వేలక్కారన్ చిత్ర షూటింగ్లో గాయాల పాలైన నయనతార చికిత్స పొందుతున్నారు లాంటి ప్రచారాలు హల్చల్ చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సంచలన నటి నయనతార మళ్లీ ఎగ్మూర్‌లోని తన సొంత గూటికి మకాం మార్చారట. ఎందుకు హోటల్లో అద్దెకు రూమ్ తీసుకున్నారో, మళ్లీ ఎందుకు సొంత ప్లాట్‌కు చేరుకున్నారో తెలియని పరిస్థితి. దీంతో పోయెస్ గార్డెన్లో, అపోలో ఆస్పత్రిలో ఏం జరిగిందో తెలుసుకోవచ్చు గాని, నయనతార శింబు, ప్రభుదేవా, ఆర్యల నుంచి ఎందుకు దూరం అయ్యారో ఆ మర్మమేమిటో, అసలు ఆమె జీవితంలో రహస్యాలను తెలుసుకోవడం కష్టం అని కోలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. అన్నట్టు ఆ మధ్య విజయ్‌సేతుపతికి జంటగా నానూమ్ రౌడీదాన్ చిత్రంలో నటించి ఆ చిత్ర మంచి విజయానికి ప్రధాన కారణంగా నిలిచి ఈ అమ్మడు తాజాగా అదే కథానాయకుడి 25వ చిత్రం సీతక్కాదిలో అతిథి పాత్రలో మెరిసే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం. -
‘అందుకే కేశినేని ట్రావెల్స్ మూసివేశారు’
తిరుపతి : టీడీపీ ఎంపీ కేశినేని నానికి చెందిన కేశినేని ట్రావెల్స్ మూసివేత వెనుక పెద్ద మతలబే జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ బ్యాంకుల వద్ద నుంచి వందలకోట్ల అప్పు చేసిన టీడీపీ ఎంపీ కేశినేని నాని ఆ నిధులను ఇతర అవసరాలకు మళ్లించారని అన్నారు. బ్యాంకులకు అప్పులు చెల్లించకుండా ఎగనామం పెట్టారని, కేశినేని నాని మరో విజయ్ మాల్యా అవతారం ఎత్తారని చెవిరెడ్డి విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకే ఆయన ట్రావెల్స్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించారన్నారు. బస్సుల పేరుతో బ్యాంకుల నుంచి తీసుకున్న డబ్బులతో విజయవాడలో స్టార్ హోటల్ కడుతున్నారని, కేశినేని బస్సులను ఆర్టీసీ స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా శుక్రవారం అర్ధరాత్రి నుంచి దేశ వ్యాప్తంగా కేశినేని ట్రావెల్స్ బస్ సర్వీసులను ఆపివేశారు. ఇటీవల రవాణ శాఖ కార్యాలయం వద్ద కమీషనర్ బాలసుబ్రహ్మణ్యం పట్ల నాని, టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు దౌర్జన్యంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో జోక్యం చేసుకుని నానితో క్షమాపణలు చెప్పించారు. చంద్రబాబు తనతో బలవంతంగా క్షమాపణలు చెప్పించడంతో అసంతృప్తిగా ఉన్న నాని అలకబూనారు. కాగా ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర సందర్భంగా కేశినేని నాని నిధులు సమకూర్చారు. అంతేకాకుండా టీడీపీ తరఫున ఎంపీకా ఎన్నిక కావడానికి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టారు. ఈ నేపథ్యంలో నిర్వహణ భారంతో పాటు పోటీ పెరగడంతో నష్టాలు పెరిగాయి. దీంతో సుమారు 80 ఏళ్లుగా నిర్వహిస్తున్న కేశినేని ట్రావెల్స్‌ను మూసివేయాలని నిర్ణయించారు. 170 కేశినేని ట్రావెల్స్ బస్సులను ఇతర ట్రావెల్స్ కు అమ్మేశారు. మరోవైపు కేశినేని నాని కార్గో వ్యాపారం వైపు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. -
తవ్వే కొద్ది కట్టలు!
మరో 40 కేజీల బంగారం పట్టివేత కొనసాగుతున్న సోదాలు బ్యాంకుల అధికారులకు ముచ్చెమటలు సాక్షి, చెన్నై , వేలూరు : నల్లధన కుబేరుడు శేఖర్‌రెడ్డి ఇంటా, బయట తవ్వే కొద్ది నోట్ల కట్టలే కాదు, బంగారం బయటపడుతోంది. ఆదివారం చెన్నైలోని ఓ స్టార్ హోటల్లో శేఖర్‌రెడ్డికి చెందిన 40 కేజీల బంగారం పట్టుబడ్డట్టు సంకేతలు వెలువడ్డాయి. వేలూరులో సాగిన తనిఖీల్లో ఆరు బ్యాగుల్లో నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తమిళనాడులోని అధికార రాజకీయ వర్గాలకు సన్నిహితుడిగా చెన్నైలో స్థిరపడిన శేఖర్‌రెడ్డి ఆస్తులపై ఇంటా, బయట సాగుతున్న ఐటీ దాడుల్లో ‘కట్టల నాగులు’ బుసలు కొడుతున్న విషయం తెలిసిందే. ఆదివారం కూడా ఆయన, అతని సన్నిహితుల ఇళ్లల్లోనూ ఐటీ దాడులు సాగారుు. టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా ఆంధ్రప్రదేశ్‌లో, ఇసుక క్వారీల కింగ్‌గా తమిళనాట రాజకీయ పలుకుబడితో శేఖర్‌రెడ్డి మూట గట్టుకున్న అక్రమార్జన వందల కోట్లలో పట్టుబడుతూ వస్తోంది. ఈనెల ఎనిమిదో తేదీ నుంచి సాగుతున్న ఈ తనిఖీల్లో శనివారం నాటికి సుమారు రూ. 170 కోట్ల నగదు, 130 కేజీల బంగారం పట్టుబడింది. ఆదివారం సాగిన తనిఖీల్లో మరో 40 కేజీల బంగారం బయటపడినట్టు సంకేతాలు వెలువడ్డాయి. టీ.నగర్ సాంబశివం వీధిలోని ఇంట్లో, ఓ స్టార్ హోటల్లో శేఖర్‌రెడ్డి ఉపయోగించే ఓ గదిలో ఈ బంగారం బయటపడ్డట్టు సమాచారం. అలాగే, శనివారం సాయంత్రం ఆరు గంటల నుంచి శేఖర్‌రెడ్డి సతీమణి జయశ్రీ నివాసం ఉంటున్న కాట్పాడి గాంధీనగర్‌లోని ఇంట్లో రాత్రంతా విచారణ సాగింది. ఉదయం ఏడున్నర గంటల సమయంలో ఐటీ వర్గాలు ఆరు ట్రావెల్ బ్యాగుల్లో నోట్లకట్టల్ని, రెండు సూట్‌కేసుల్లో బంగారాన్ని తమ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఈ బంగారు నగలు, నోట్ల కట్టలు గోడలో రహస్యంగా ఉంచిన అరలో గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించేందు కు నిరాకరించిన అధికారులు ఆగమేఘాలపై చెన్నై చేరుకున్నారు. సోమవారం మరికొన్ని చోట్ల దాడులకు తగ్గ వ్యూహంతో ఐటీ వర్గాలు ఉన్న ట్టు సంకేతాలు వెలువడ్డాయి. శేఖర్‌రెడ్డి సన్నిహితులు మరికొందరు ఉన్నట్టు, వారిని ఐటీ అధికారులు లక్ష్యంగా చేసుకున్నట్టు సమాచారం. ముచ్చెమటలు : సామన్య జనం చిల్లర కోసం, కొత్త నోట్ల కోసం నానా పాట్లు పడుతుంటే, శేఖర్‌రెడ్డి చేతికి కోట్లాది రూపాయల కొత్త నోట్లు ఎలా వచ్చాయో అన్న విషయంపై ఐటీ వర్గాలు దృష్టి సారించాయి. కొందరు బ్యాంకు అధికారులు, ఫైనాన్షియర్ల ద్వారా ఈ నోట్ల మార్పిడి సాగినట్టుగా విచారణలో తేలింది. చెన్నై ప్యారిస్, షావుకారు పేటల్లోని కొన్ని ఫైనాన్స సంస్థలు, చెన్నైలోని కొన్ని ప్రైవేటు బ్యాంకులకు చెందిన అధికారుల సహకారంతోనే కొత్త నోట్లు శేఖర్‌రెడ్డి ఇంటి రహస్య అరల్లో కి చేరినట్టు సంకేతాలు వెలువడుతున్నారుు. ఇందుకు తగ్గట్టుగా ఐటీ అధికారులు శేఖర్‌రెడ్డి సతీమణి జయశ్రీని విచారించి, సమాచారాన్ని రా బట్టినట్టు తెలిసింది. ఆయా ఫైనాన్షియర్లు, బ్యాంకుల అధికారుల భర తం పట్టే రీతిలో ఐటీ దష్టి కేంద్రీకరించింది. దీంతో నల్లధనాన్ని తెల్లధనంగా కొత్తనోట్లతో మార్పిడి చేయించిన ఫైనాన్షియర్లు, బ్యాంకు అధికారుల్లో ఆందోళన నెలకొంది. కాగా, ఆదివారం నాటికి శేఖర్‌రెడ్డి, అతని అనుచరుల వద్ద రూ. 200 కోట్ల మేరకు నగదు, 170 కేజీల బంగారం పట్టుబడ్డట్టు సమాచారం. అయితే, ఈ వివరాలను అధికార వర్గాలు ధ్రువీకరించాల్సి ఉంది. శేఖర్‌రెడ్డితో సన్నిహితంగా ఉన్న మరి కొందరిని లక్ష్యంగా చేసుకొని దాడులు సాగనున్నాయి. ఈ దాడుల్లో మరెన్ని వందల కోట్లు చిక్కుతాయో? వేచి చూడాల్సిందేనని ఐటీ వర్గాలు పేర్కొనడం గమనార్హం. -
సీఎం స్టార్‌హోటల్ లో ఉంటే తప్పేంటి?: ఏపీ మంత్రి
విజయవాడ: ముఖ్యమంత్రి కుటుంబం స్టార్ హోటల్లో ఉంటే తప్పేంటని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మీడియాను ఎదురు ప్రశ్నించారు. ఓ ముఖ్యమంత్రి రూ. 2 లక్షల అద్దె చెల్లించకూడదా అన్నారు. ఈ విషయంపై మీడియా, ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సరికాదన్నారు. చంద్రబాబు ఫాంహౌస్ కు ప్రభుత్వమే నిధులు ఖర్చుచేసిన మాట వాస్తవమే అని ఆయన మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఇక రకరకాల అభియోగాలు ఎదుర్కొంటున్న సుజనా చౌదరిని కేంద్రమంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా ఎలా కొనసాగిస్తున్నారని మీడియా ప్రశ్నించగా.. సుజానా చౌదరి విషయం పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఏపీ మంత్రులు అచ్చెన్ననాయుడు, ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. -
లిటీల్ స్టార్స్@Five Stars
స్టార్ హోటల్‌కు వెళ్లాలని.. పసందైన విందు లాంగించాలనుకునే మధ్య తరగతి మందభాగ్యులెందరో ఉంటారు. కానీ తిన్నాక చుక్కలు కనిపిస్తాయని ఆ సాహసానికి పూనుకోరు. కాస్తో కూస్తో ఉన్నవాళ్లకే ఈ పరిస్థితి ఉంటే..దిక్కూమొక్కూ లేని అనాథల పరిస్థతి ఏమిటి?.. ఐదుతారల హోటల్లో వంటకాలెలా ఉంటాయో కూడా ఊహించలేని అనాథలకు ఫైవ్‌స్టార్ రుచులను పరిచయం చేశాయి కొన్ని స్వచ్ఛంద సంస్థలు. చవులూరించే భోజనమే కాదు రోజంతా ఆటపాటల తో ఎంగేజ్ చేసి చిన్నారుల మోముల్లో సంతోషం నింపాయి. ..:: దుగ్గింపూడి శ్రీధర్‌రెడ్డి, జూబ్లీహిల్స్ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటూ, హాస్టల్స్‌లో, అనాథ శరణాలయాల్లో తలదాచుకుంటున్న చిన్నారులకు సరికొత్త ఆనందం పంచాలనుకున్నాయి కొన్ని స్వచ్ఛంద సంస్థలు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లోని నలాస్ అప్పాకడాయ్ రెస్టారెంట్ నిర్వాహకులతో కలసి 50 మంది అనాథ పిల్లలను రెస్టారెంట్‌కు ఆహ్వానించి వారికి పసందైన విందు ఇచ్చాయి. అంతేకాదు వినోద కార్యక్రమాలు, సామాజిక చైతన్య కార్యక్రమాలు ఏర్పాటు చేశాయి. ఈ కార్యక్రమంలో ఆసరా అనాథాశ్రమం, లాడ్జ్ కీస్ నంబర్ 297, ఈ మర్చంట్ డిజిటల్, స్టార్ ఎన్జీవో తదితర సంస్థలు పాల్గొన్నాయి. సందడే సందడి.. పిల్లలందరూ స్టార్ హోటల్లోకి అడుగుపెట్టగానే ఘజల్ గాయకుడు ఖాన్ అలీఖాన్ తన పాటలతో అలరించారు. కేక్ కట్ చేసి పిల్లలకు పంచి పెట్టారు. ‘ఈ మర్చంట్’ పేరుతో కంప్యూటర్ వ్యర్థాలతో ఆకర్షణీయంగా పలు ఆకృతుల్లో చేసిన బొమ్మలను పిల్లల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. భోజనం తర్వాత కొనసాగిన ఆటపాటలు చిన్నారుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. మూడుగంటల పాటు సాగిన ఈ కార్యక్రమంలో చిన్నారులంతా సందడిగా గడిపారు. ఎంతో తృప్తినిచ్చింది.. సాధారణంగా రెస్టారెంట్లలో మిగిలిన పదార్థాలను పార్సిల్ చేసి పేదలకు పంచుతాం. కానీ, నేరుగా పిల్లలను ఇక్కడికి పిలిచి విందు ఇవ్వడం ఎంతో సంతృప్తినిచ్చింది. చెన్నైలోని మా బ్రాంచ్‌లో ఈ పద్ధతిని కొన్నేళ్లుగా అమలు చేస్తున్నాం. ఇప్పుడు హైదరాబాద్‌లో ప్రారంభించాం. నగరంలోని ఇతర రెస్టారెంట్ల నిర్వాహకులు కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే సంతోషం. - గురు, డెరైక్టర్ (సేల్స్) , నలాస్ అప్పాకడాయ్ రెస్టారెంట్ ఫొటోల కోసం క్లిక్ చేయిండి -
12 ప్రాంతాల పై గురి!
జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు రెండురోజుల క్రితం అరెస్ట్ చేసిన తీవ్రవాది అరుణ సెల్వరాజ్ సాదాసీదా నేరస్తుడుకాదని తేలిపోయింది. తమిళనాడుతోపాటు పొరుగు రాష్ట్రాల్లో సైతం దారుణ విధ్వంసాలకు కుట్రలు పన్నినట్లు తేటతెల్లమైంది. ఒక్క చెన్నై నగరంలోనే 12 ప్రాంతాలను ఎంచుకున్నట్లు వెల్లడైంది. చెన్నై, సాక్షి ప్రతినిధి: విధ్వంసాలకు చెన్నై నగరంలోని 12 ప్రాంతాలను ఎంచుకున్నట్టు తీవ్రవాది అరుణ్‌సెల్వరాజ్ వెల్లడించడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. విచారణలో అనేక విషయాలు వెలుగుచూశాయి. ఇందులో ప్రధానంగా.. శ్రీలంకలో ఒక స్టార్ హోటల్ యజమానిగా అరుణ్ సెల్వరాజ్ 2009 వరకు ఆడంబర జీవితాన్ని అనుభవించాడు. ఆ తరువాత వ్యాపారంలో నష్టం రావడంతో రోడ్డున పడ్డాడు. తన పాత, కొత్త జీవితం తలుచుకుని దుఃఖించేవాడు. దీనిని అవకాశంగా తీసుకున్న ఐఎస్ఐతో సంబంధాలు ఉన్న ఒక ఆటో డ్రైవర్ తన సహచరుడిని పరిచయం చేశాడు. అరుణ్ చేతిలో అతను సహాయంగా రూ.10వేలు పెట్టాడు. దీనికి ఆనందపరవశుడైన అరుణ్‌ను క్రమేణా తీవ్రవాద ఉచ్చులోకి దింపారు. తాము చెప్పిన పనులుచేస్తే మళ్లీ కోట్ల రూపాయాలు కళ్లచూడవచ్చని నూరిపోశారు. డబ్బుకు దాసోహమైన అరుణ్ కేవలం 28 ఏళ్ల వయస్సులోనే తీవ్రవాదిగా మారిపోయాడు. శ్రీలంక, భారత్‌లో స్వేచ్ఛగా సంచరించేలా పాకిస్తాన్ అతనికి పాస్‌పోర్టు సమకూర్చింది. 2009లో విద్యార్థి వీసాపై చెన్నై చేరుకుని సాలిగ్రామంలో నివాసం ఉంటూ ఈవెంట్ మేనేజర్‌గా అవతారం ఎత్తాడు. ఆకాశంలో ఎగిరే బెలూన్‌లో పెళ్లి నిర్వహించి ప్రముఖునిగా మారిపోయాడు. ఈపేరు ప్రతిష్టలను అడ్డంపెట్టుకుని హార్బర్లలో, షిప్పులలో పెళ్లికి ప్రత్యేక అనుమతులు సంపాదించాడు. అదేసమయంలో హార్బర్ నలుమూలలా ఫొటోలుతీసి పాకిస్తాన్‌కు పంపేవాడు. ముంబయి తాజ్‌హోటల్ దాడులవలే అవకాశాలను తెలుపుతూ సముద్రతీరాలను అధ్యయనంచేసి ఫొటోలు పంపాడు. ఐఎస్ఐ ఆదేశాల మేరకు విమానం నడిపే శిక్షణకు దరఖాస్తు చేసుకున్నాడు. అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవనాలను విమాన హైజాక్‌తో బిల్లాడెన్ కూల్చివేసేందుకు అరుణ్‌ను ఉపయోగించుకోవాలని ఐఎస్ఐ భావించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. విమాన శిక్షణకు అరుణ్ సమర్పించిన సర్టిఫికెట్లన్నీ నకిలీవిగా తేలడంతో వారి అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి. పాకిస్తాన్లో కుట్ర, శ్రీలంకలో వ్యూహరచన, తమిళనాడులో అమలుగా ఇతని కార్యకలాపాలు సాగుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు. 12 ప్రాంతాలపై దృష్టి నాలుగేళ్లుగా చెన్నైలో ఉంటూ నగరంలోని 12 ప్రాంతాలలో విధ్వంసాలు సృష్టించేందుకు అనుకూలమని అరుణ్ పాకిస్తాన్‌కు సమాచారం చేరవేసినట్లు పోలీసులు కనుగొన్నారు. మెరీనా తీరంలోని సముద్రతీర గస్తీదళ కేంద్రం, కల్పాక్కం అణువిద్యుత్ కేంద్రం, పోలీస్ డీజీపీ కార్యాలయం, కోయంబేడులోని బస్‌స్టేషన్, మార్కెట్, సెంట్రల్ స్టేషన్, సెంట్రల్ ఎదురుగా ఉన్న జీహెచ్, తరమణిలోని టైడల్‌పార్క్, పరంగిమలైలోని ఆఫీసర్స్ శిక్షణ కేంద్రం, వండలూరులోని జాతీయ ప్రత్యేక భద్రతా దళం కేంద్రాల ఫొటోలను అరుణ్ సేకరించినట్లు సమాచారం. అరుణ్ నుంచి స్వాధీనం చేసుకున్న లాప్టాప్లో అనేక మెయిళ్లు బయటపడ్డాయి. నగరంలో రద్దీ కూడళ్లు, వాటికి దారితీసే మార్గాలతో సహా పాకిస్తాన్‌కు చేరవేసినట్లు అధికారులు తెలుసుకున్నారు. భారత ప్రభుత్వం కొత్తగా సిద్ధం చేస్తున్న హరిహంత్ అనే సబ్మెరీన్ వివరాలను సైతం ఐఎస్ఐ ఆదేశాల మేరకు సేకరిస్తున్నాడు. ఇప్పటి వరకు వెల్లడైన వివరాలను బట్టి అరుణ్ సెల్వరాజ్ సాధారణ తీవ్రవాది కాదని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కోర్టు అనుమతితో పోలీస్ కస్టడీకి తీసుకుంటే మరిన్ని నిజాలు, కుట్రలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. -
సమంత.. ఇప్పుడో వ్యాపారవేత్త!