starike
-
25 నుంచి రేషన్ డీలర్ల నిరవధిక సమ్మె
గాంధీనగర్: తమ డిమాండ్లు పరిష్కరించకుంటే ఈ నెల 25 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్టు రేషన్ డీలర్లు ప్రకటించారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు విజయవాడ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం నుంచి ఇక్కడ రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 24 వరకు ఇవి కొనసాగనున్నాయి. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా ఇక్కడ కూడా తమకు వేతనాలు ఇవ్వాలని, డిపోల నుంచి చౌక దుకాణాల వరకు సరుకులను చేరవేయాలని, తూకం ప్రకారం అందివ్వాలని వారు డిమాండ్ చేశారు. -
ఓయూలో ఉద్రిక్తత
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. ఆంద్రప్రదేశ్ మఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ పట్ల వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఓయూ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ఓయూ విద్యార్థులు యూనివర్సటీ నుంచి బృందంగా బయలు దేరారు. అయితే మధ్యలోనే వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆందోళన చేస్తున్న 30 మంది విద్యార్థులను అరెస్ట్ చేసి ఓయూ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
కొనసాగుతున్న కార్మికుల ఆందోళన
ఆదిలాబాద్ : జిల్లాలోని జైపూర్ మండల కేంద్రంలో సింగరేణి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు కార్మికులు చేస్తున్న ఆందోళన రెండో రోజుకు చేరుకుంది. బుధవారం జరిగిన ఆందోళనలో రెండు వేల మంది కార్మికులు పాల్గొన్నారు. వివరాలు.. సింగరేణి థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న అనిత్‌కుమార్ ఇటీవల ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో మృతిచెందాడు. ఈ క్రమంలో ప్లాంట్ అధికారులు అతడి కుటుంబానికి రూ. ఐదు లక్షల ఆర్థిక సాయం అందజేశారు. ఇందులో లక్ష రూపాయల నగదు ఇవ్వగా, మిగతా నాలుగు లక్షలకు చెక్ అందజేశారు. అయితే చెక్ డ్రా చేసేందుకు మృతుడి బంధువులు బ్యాంక్‌కు వెళ్లగా చెక్ బౌన్స్ అయింది. దీంతో ఆగ్రహించిన విద్యుత్ కార్మికులు బాధిత కుటుంబానికి నాలుగు లక్షల రూపాయలు అందజేయాలని రెండు రోజులుగా ఆందోళనకు దిగారు. (జైపూర్)