కొనసాగుతున్న కార్మికుల ఆందోళన | employees starike contunues on second day in adilabad distirict | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న కార్మికుల ఆందోళన

Published Wed, Feb 4 2015 4:10 PM | Last Updated on Sun, Sep 2 2018 4:23 PM

employees starike contunues on second day in adilabad distirict

ఆదిలాబాద్ : జిల్లాలోని జైపూర్ మండల కేంద్రంలో సింగరేణి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు కార్మికులు చేస్తున్న ఆందోళన రెండో రోజుకు చేరుకుంది. బుధవారం జరిగిన ఆందోళనలో రెండు వేల మంది కార్మికులు పాల్గొన్నారు. వివరాలు.. సింగరేణి థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న అనిత్‌కుమార్ ఇటీవల ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో మృతిచెందాడు.

ఈ క్రమంలో ప్లాంట్ అధికారులు అతడి కుటుంబానికి రూ. ఐదు లక్షల ఆర్థిక సాయం అందజేశారు. ఇందులో లక్ష రూపాయల నగదు ఇవ్వగా, మిగతా నాలుగు లక్షలకు చెక్ అందజేశారు. అయితే చెక్ డ్రా చేసేందుకు మృతుడి బంధువులు బ్యాంక్‌కు వెళ్లగా చెక్ బౌన్స్ అయింది. దీంతో ఆగ్రహించిన విద్యుత్ కార్మికులు బాధిత కుటుంబానికి నాలుగు లక్షల రూపాయలు అందజేయాలని రెండు రోజులుగా ఆందోళనకు దిగారు.
(జైపూర్)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement