గెలుపోటములు సమానం
– ప్రారంభమైన ఎస్కేయూ అంతర్ కళాశాలల మహిళా ఆటల పోటీలు
హిందూపురం టౌన్ : క్రీడల్లో గెలుపోటములు సమానమని వక్తలు పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎన్‌ఎస్‌పీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ శంకరయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శి పీడీ ముస్తఫా కమల్ బాషా శ్రీ కష్ణదేవరాయ విశ్వవిద్యాలయ అంతర్ కళాశాలల మహిⶠల ఆటల పోటీలను స్థానిక ఎంజీఎం మైదానంలో నిర్వహించారు. ఎన్‌ఎస్‌పీఆర్ ప్రిన్సిపల్ శంకరయ్య కార్యక్రమానికి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా బీసీ కార్పొరేషన్ చైర్మన్ రంగనాయకులు, ఎస్కేయూ స్పోర్ట్స్ డైరెక్టర్ జెస్సీ, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, మాజీ మున్సిపల్ చైర్మన్ విద్యాసాగర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్‌ఎస్‌పీఆర్ కళాశాల ఆధ్వర్యంలో 4 ఏళ్లుగా ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఆటల్లో క్రీడా స్ఫూర్తితో మెలిగినప్పుడే ఉన్నత స్థాయికి చేరుకోగలుతారని చెప్పారు. పీవీ సింధు, సాక్షి మాలిక్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఆటల్లో రాణించాలన్నారు. అనంతరం నిర్వహించిన పోటీల్లో పలు జట్లు విజయం సాధించాయి. పోటీల్లో శ్రీకష్ణ దేవరాయ విశ్వవిద్యాలయ పరిధిలోని 16 కళాశాలల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. ఆటల పోటీలు ఆదివారం వరకు కొనసాగనున్నాయి.
అనంతరం ఎస్కేయూ జట్టును ఎంపిక చేస్తామన్నారు. కార్యక్రమంలో వివిధ కళాశాలల ప్రిన్సిపళ్లు శ్రీనివాసులు, ఈశ్వర్‌రెడ్డి, ఆనంద్‌నాయక్, వాణి కళాశాల కరస్పాండెంట్ ప్రభుకుమార్, మదానీ డిఫెన్స్ అకాడమీ సభ్యులు ఫకద్దీన్, ఎస్కేయూ ఫిజికల్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జబీవుల్లా, కార్యదర్శి కెనడీ, ఎంజీఎం పీడీ లోక్‌నాథ్, కళాశాల వైస్ ప్రిన్సిపల్ అంజలీదేవి పాల్గొన్నారు.