State Bank of Patiala
-
కేసుల రాజీలో కోర్టులు సంయమనం పాటించాలి
న్యూఢిల్లీ: క్రిమినల్ కేసుల్లో ఇరు పార్టీలు పరస్పరం రాజీ చేసుకునేందుకు అనుమతించే సందర్భంలో కోర్టులు న్యాయ పరమైన సంయమనాన్ని పాటించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సీఆర్పీసీ ప్రకారం కక్షిదారులు తమంతట తాము రాజీ చేసుకునేందుకు వీలులేని కేసుల్లో హైకోర్టు, సుప్రీంకోర్టుతో సహా అన్ని కోర్టులు ఇరు వర్గాల రాజీకి అనుమతించవచ్చంది. ఈ మేరకు పంజాబ్, హరియాణా హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. భటిండాకు చెందిన ఒక సంస్థపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా... మోసం, ఫోర్జరీ కింద కేసు పెట్టింది. తర్వాత బ్యాంకుతో అది రాజీ పడింది. దీంతో క్రిమినల్ కేసును కొట్టేయాలని కోర్టును కోరింది. సెక్షన్ల ప్రకారం రాజీ కుదరదని చెబుతూ ట్రయల్ కోర్టు ఆ విజ్ఞప్తిని తిరస్కరించింది. తర్వాత హైకోర్టును ఆశ్రయించగా... ఇరు పార్టీల మధ్య రాజీ కుదిరిన నేపథ్యంలో క్రిమినల్ కేసును కొట్టేస్తూ తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పుపై సీబీఐ సుప్రీంను ఆశ్రయించింది. -
ఎస్బీఐతో విలీన బాటలో ఎస్బీహెచ్ చివరిది!
చెన్నై: మాతృ సంస్థ- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)తో రాబోయే రోజుల్లో విలీనమయ్యే మొదటి అనుబంధ బ్యాంక్- ఎస్బీహెచ్ కాబోదన్న అంచనాలు వెలువడుతున్నాయి. సోమవారం ఇక్కడ ఎస్బీహెచ్ మేనేజింగ్ డెరైక్టర్ ఎం. భగవంతరావు విలేకరుల వద్ద మాట్లాడుతూ, ఈ అంచనాలను వెలువరించారు. తెలంగాణ ఏర్పాటు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, ఇప్పట్లో ఎస్బీహెచ్ విలీనం జరిగే అవకాశం లేదన్నది తన అభిప్రాయమని తెలిపారు. బహుశా విలీన బాటలో ఎస్బీహెచ్ చివరన నిలుస్తుందని ఆయన అంచనావేశారు. ఎస్బీహెచ్ త్వరలో ఐదు మహిళా బ్యాంక్ బ్రాంచీలను ఏర్పాటు చేయనుందని తెలిపారు. అక్టోబర్ 2న హైదరాబాద్, విశాఖ సహా బెంగళూరు, పుణే, సేలమ్లలో ఈ బ్రాంచీలు ఏర్పాటవుతున్నట్లు వెల్లడించారు. దక్షిణాదిలో మరింత విస్తరణకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఎస్బీహెచ్ జోనల్ ఆఫీస్ ప్రారంభోత్సవానికి ఆయన ఇక్కడకు వచ్చారు