state divistion
-
కోర్టులకు అవసరమైన కేసులే చూస్తున్నారు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ప్రజలకు అవసరమైన అంశాలను న్యాయస్థానాలు టేబుల్ మీదకు తీసుకోవడంలేదని.. తమకు అవసరమైన వాటినే అవి పరిగణనలోకి తీసుకుంటున్నాయని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి వ్యాఖ్యానించారు. అవి ఇచ్చే తీర్పులు ప్రజల్లో న్యాయస్థానాలపై గౌరవం పెరిగేలా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డా రు. రాజధాని విషయంలో హైకోర్టు గురువారం ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆయన పలు కీలక వ్యా ఖ్యలు చేశారు. మోదుగుల గుంటూరులోని ఐబీ గెస్ట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. ‘ 2014లో విభజనవల్ల రాష్ట్రానికి అన్యాయం జరిగితే సుప్రీం కోర్టు దానిపై ఇంకా తీర్పు ఎందుకు ఇవ్వడంలేదు? దీనిపైనా ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు కదా.. అలాగే, రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంది.. ఆదాయంలేదు, కష్టపడి నిర్మించిన హైదరాబాద్ లేదు.. దీని పై తీర్పు ఇవ్వకుండా మొన్న జరిగిన మూడు రాజ ధానులపై తీర్పు ఇవ్వడమేంటి? న్యాయ వ్యవస్థపై కామెంట్ చేయడంలేదు.. కానీ, వాటిపై తీర్పు ఎం దుకు రాలేదు. న్యాయ వ్యవస్థ నిద్రపోతోందా? ఈ తీర్పును పునఃసమీక్ష చేయాల్సిందే. అలాగే, మూ డు రాజధానుల బిల్లు అసెంబ్లీలో పాసైన బిల్లు. న్యాయవ్యవస్థ, శాసన వ్యవస్థల మధ్య పరస్పర విరుద్ధ భావనలు తలెత్తినప్పుడు రెండింటిలో ఏది గొప్ప? అన్నదానిపైనా పూర్తిస్థాయి చర్చ జరగాలి. ‘గల్లా’ ఎన్నిక కేసు ఏమైంది? ఇక ఎన్నికలకు సంబంధించిన కేసులు ఆర్నెళ్లలో ముగించమని చట్టంలోనే చెప్పారు.. మరి 2019 ఎన్నికల కౌంటింగ్ సమయంలో నేను నాలుగువేల ఓట్లతో వెనుకబడినప్పుడు పదివేల పోస్టల్ బ్యాలెట్లు లెక్కపెట్టలేదు. ఎంపీ గల్లా జయదేవ్ ఎన్నిక చెల్లదని కేసు వేశాం, అది ఏమైంది? దీనిపై ఇంతవరకూ ఎందుకు చర్యలు తీసుకోలేదు. జడ్జికి నచ్చి నవి టేబుల్‌పై పెట్టడం, నచ్చనివి పక్కన పెట్టడం సరికాదు. దీన్ని అంగీకరించం. మరోవైపు.. అసెంబ్లీ తీర్మానం చేసింది ఆరు నెలల్లో పూర్తిచేయమని చెబుతున్నారు, ఇది చట్టంలో ఎక్కడ ఉంది? మూడు రాజధానుల బిల్లుపై అసెంబ్లీ తీర్మానం చేస్తే మీరు శాసన వ్యవస్థపై గౌరవం లేకుండా జడ్జిమెంట్ ఇస్తుంటే ఏమవుతుంది ఈ వ్యవస్థ? జడ్జిమెంట్ మీ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటుందా? లైక్స్, డిస్‌లైక్స్ ఉండవా? అంబేడ్కర్‌ను అవమానిస్తున్నారా!?.. అని వేణుగోపాలరెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. అందుకే రాష్ట్ర విభజనపై తీర్పు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. -
భద్రాచలం బంద్ విజయవంతం
భద్రాచలం: రాష్ట్ర విభజన సమయాన ఏపీలో కలిపిన అయిదు గ్రామ పంచాయితీలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలనే డిమాండ్‌తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో అఖిలపక్షం ఆధ్వర్యాన చేపట్టిన నిరసనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం చేపట్టిన బంద్ విజయవంతమైంది. భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో బంద్‌కు పిలుపునివ్వగా వ్యాపారులు, వర్తకులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు మూతపడ్డాయి. పెట్రోల్ బంకులు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు నడవలేదు. ఉదయం నుంచే ఇతర ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులు తిరగకపోవడంతో బస్టాండ్ నిర్మానుష్యంగా కనిపించింది. ఏకపక్షంగా ఏపీలో కలిపిన ఐదు పంచాయితీలను తిరిగి తెలంగాణలో కలపాలనే డిమాండ్‌తో శుక్రవారం తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ సరిహద్దులను దిగ్బంధం చేయనున్నట్టు అఖిలపక్షం నేతలు తెలిపారు. యూబీ సెంటర్లో మూతపడిన దుకాణాలు -
ప్రత్యేక హోదా కథ ముగిసింది...
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కథ ముగిసిందని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియా వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ రాష్ట్రానికి హోదాకు మించిన ప్రయోజనాలతో ప్యాకేజీ ఇస్తున్నామని అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని పనగరియా ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సంతృప్తికరంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతానిక ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదన్నారు. 14వ ఆర్థిక సంఘం వచ్చాక రాష్ట్రాలకే అన్ని నిధులని అన్నారు. కాగా ప్రత్యేక హోదా కేవలం ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ పర్వత రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తుందని దేశంలో ఆ కేటగిరీకి చెందిన 11 రాష్ట్రాలు ఇప్పటికే ప్రత్యేక హోదా అనుభవిస్తున్నాయని, ఇక వేరే రాష్ట్రాలకు ఇవ్వనవసరమే లేదని కేంద్ర ఆర్థిక శాఖ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. -
హోదా ముగిసిన అధ్యాయం: వెంకయ్య
-
హోదా ముగిసిన అధ్యాయం: వెంకయ్య
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్య సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయమని కేంద్ర సమాచార శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి మోసం జరుగుతుంటే ఎందుకు అడ్డుకోలేకపోయారని ప్రతిపక్ష నేతలను వెంకయ్య ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో ప్రస్తుతం ఉద్యమాలు చేస్తూ ప్రధాని మోదీని, తనను విమర్శిస్తున్న వారు రాష్ట్ర విభజన సమయంలో ఏం చేశారో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘రాష్ట్రాన్ని విభజిస్తున్నప్పుడు, ఏకపక్ష విభజన జరుగుతున్నప్పుడు వీళ్లందరూ ఎక్కడ ఉన్నారు. ఉద్యమించే వాళ్లందరూ ఆరోజు ఎక్కడున్నారు? ఏమి చేశారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత కేంద్ర ప్రభుత్వాన్నిగానీ, రాష్ట్ర ప్రభుత్వాన్నిగానీ విమర్శిస్తే బాగుంటుంది. ఇది నా సలహా’ అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ప్రస్తుతం విమర్శలు చేసేవారు విభజన జరుగుతున్న సమయంలో అన్యాయాన్ని ఎలా ఎదుర్కున్నారో ప్రజలకు వివరిస్తే ఆ తర్వాత వారు చెప్పే మాటలకుగానీ, చేసే విమర్శలకు గానీ విశ్వసనీయత ఉంటుందన్నారు. ప్రధాన మంత్రి మోసం చేశారు, వెంకయ్యనాయుడు మోసం చేశారని చెప్పే వాళ్లందరూ ఆ రోజు పచ్చి మోసం జరుగుతున్నప్పుడు ఎక్కడ ఉన్నారో, పార్టీగా, వ్యక్తులుగా సంస్థలుగా ఏమి చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘పై పెచ్చు ఈ సమస్య (ప్రత్యేక హోదా) ఏదైతే ఉందో అది ముగిసిన అధ్యాయం. ఏపీకి కేంద్ర సహకారం అవసరం’ అన్నారు. ఒక్క హామీనైనా నెరవేర్చారా అని కొందరు ప్రశ్నలు వేస్తున్నారని, ఏపీకి కేంద్ర ప్రభుత్వం అందించే సాయం చూసే వాళ్లకు కనిపిస్తుందని వెంకయ్యనాయుడు వివరించారు. -
విభజన ప్రక్రియను ఆపాలి: ఎంపీ వేణుగోపాల్ రెడ్డి
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన ప్రక్రియను తక్షణమే ఆపాలని నర్సరావుపేట టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. విభజన వల్ల సీమాంధ్ర ప్రజలు నష్టపోతారని ఆయన బుధవారమిక్కడ అన్నారు. రాజీనామాలు ఆమోదించేవరకూ ఆందోళనలు కొనసాగిస్తామని వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధానమంత్రి, సోనియాగాంధీ ముందు ఫ్లకార్డులు ప్రదర్శించి నిరసనలు తెలిపామని ఆయన అన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నిన్న సభలో తెలుగుదేశం సభ్యులు నిమ్మల కిష్టప్ప, నారాయణరావు, వేణుగోపాల్‌రెడ్డి, శివప్రసాద్ పోడియం వద్దకు వచ్చి ‘జై సమైక్యాంధ్ర’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సభను స్తంభింప చేసిన విషయం తెలిసిందే.