ప్రత్యేక హోదా కథ ముగిసింది... | Andhra Pradesh Special Status is a closed chapter, says panagariya | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదా కథ ముగిసింది...

Published Fri, Jun 2 2017 2:45 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

ప్రత్యేక హోదా కథ ముగిసింది... - Sakshi

ప్రత్యేక హోదా కథ ముగిసింది...

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కథ ముగిసిందని  నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు అరవింద్‌ పనగరియా వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ రాష్ట్రానికి హోదాకు మించిన ప్రయోజనాలతో ప్యాకేజీ ఇస్తున్నామని అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని పనగరియా ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సంతృప్తికరంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతానిక ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదన్నారు. 

14వ ఆర్థిక సంఘం వచ్చాక రాష్ట్రాలకే అన్ని నిధులని అన్నారు. కాగా ప్రత్యేక హోదా కేవలం ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ పర్వత రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తుందని దేశంలో ఆ కేటగిరీకి చెందిన 11 రాష్ట్రాలు ఇప్పటికే ప్రత్యేక హోదా అనుభవిస్తున్నాయని, ఇక వేరే రాష్ట్రాలకు ఇవ్వనవసరమే లేదని కేంద్ర ఆర్థిక శాఖ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement