state income
-
పరుగెడుతున్న తెలంగాణ అప్పుల పద్దు.. ఆదాయంలో మూడో వంతు అప్పులే!
సాక్షి, హైదరాబాద్: ఈ ఆర్థిక సంవత్సరంలో అప్పుల పద్దు పరుగెడుతోంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను తొలి రెండు నెలల ఆదాయ, వ్యయాలను పరిశీలిస్తే రాష్ట్ర మొత్తం ఆదాయంలో మూడో వంతు అప్పులే కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో కలిపి మొత్తం రూ.31,699 కోట్ల ఆదాయం రాగా, అందులో రూ.9,266 కోట్లు అప్పులే ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం కాగ్‌కు పంపిన నివేదికలో వెల్లడైంది. ఇక వచ్చిన ఆదాయంలో దాదాపు 95 శాతం ఖర్చయిపోయింది. ఈ రెండు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వ ఖర్చు రూ.28,171 కోట్లు అని ఈ నివేదిక వెల్లడించింది. పన్ను ఆదాయం రూ.20,097 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1.52 లక్షల కోట్ల పన్ను ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేయగా, అందులో 13.18% తొలి రెండు నెలల్లో సమకూరింది. అన్ని రకాల పన్నులు కలిపి రూ.20,097 కోట్లు వచ్చినట్టు తేలింది. జీఎస్టీ కింద రూ.7,430 కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.2,358 కోట్లు, అమ్మకపు పన్ను పద్దు కింద రూ.4,802 కోట్లు, ఎక్సైజ్ ద్వారా రూ.2,683 కోట్లు, ఇతర పన్నుల నుంచి రూ.1,327 కోట్లు వచ్చాయి. ఇక పన్నేతర ఆదాయం అంచనాల్లో 4 శాతం అంటే రూ. 891.47 కోట్లు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నుంచి తొలి రెండు నెలల్లో రూ.3 వేల కోట్లకు పైగా గ్రాంట్లు వచ్చాయి. అందులో పన్నుల్లో వాటా కింద రూ.1,494 కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ.1,438 కోట్లు వచ్చాయి. వడ్డీలకు రూ.3,200 కోట్లు ఖర్చుల విషయానికి వస్తే వేతనాలు, పింఛన్లు, అప్పులకు వడ్డీల రూపంలో సింహభాగం ఖర్చయ్యాయి. వేతనాలకు రూ.6,784 కోట్లు, పింఛన్లకు రూ.2,779 కోట్లు, అప్పులకు వడ్డీల కోసం రూ.3,205 కోట్లు చెల్లించారు. సబ్సిడీల రూపంలో రూ.1,923 కోట్లు, రెవెన్యూ పద్దు కింద రూ.6,692 కోట్లు ఖర్చయ్యాయి. అన్ని రంగాల్లో కలిపి మూలధన వ్యయం కింద రూ.6,800 కోట్ల వరకు ఖర్చయ్యాయి. -
రుణమే శరణ్యం!
సాక్షి, హైదరాబాద్: కరోనా, లాక్‌డౌన్‌తో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ద్విముఖ వ్యూహంతో ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రుణ పరిమితి వెసులుబాటును ఆసరాగా చేసుకుని వీలున్నంత మేర రుణ సమీకరణతో పాటు సొంత ఆదాయ వనరులను పెంచుకునే దిశలో ముందుకెళుతోంది. 2020–21 బడ్జెట్ అంచనాలు తొలి త్రైమాసికంలోనే తలకిందులైన నేపథ్యంలో ఈ ఏడాది ద్వితీయార్థంకల్లా భారీగా నిధులు సమకూర్చుకునే ప్రణాళికలను ఆర్థికశాఖ సిద్ధం చేసుకుంటోంది. రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉన్నా నెలవారీ ఖర్చులు, అనివార్య చెల్లింపులకు ఇబ్బందుల్లేకుండా రాబడులు పెంచుకునే దిశగా కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా పేదలు, రైతులకు ఇబ్బంది కలగకుండా పన్నులు పెంచడం, ఆదాయం పెరిగే అవకాశం ఉన్నా చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న భూముల మార్కెట్ ధరల సవరణ వంటి అంశాలను అమల్లోకి తేవాలని భావిస్తోంది. వీలైనంతగా రుణ సమీకరణ ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల మనుగడకు ఈ ఏడాది రుణ సమీకరణే శరణ్యమని ఆర్థికశాఖ వర్గాలంటున్నాయి. ప్రభుత్వానికి ఓపెన్ మార్కెట్లో ఉన్న రుణ పరపతికి తోడు, జీఎస్డీపీ సామర్థ్యాన్ని బట్టి 5 శాతం వరకు రుణాలు తెచ్చుకునే అవకాశం కేంద్రం ఇవ్వడంతో బడ్జెట్లో ప్రతిపాదించిన రూ.33 వేల కోట్ల రుణ సమీకరణకు అదనంగా మరో రూ.15 వేల కోట్లు అప్పులు తెచ్చుకునే వెసులుబాటు కలిగింది. దీంతో ఈ ఏడాది ఆ మేరకు రుణ సమీకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. తొలి త్రైమాసికంలోనే రూ.12 వేల కోట్ల రుణ సమీకరణ చేసిన ప్రభుత్వం మిగిలిన మూడు త్రైమాసికాల్లో కలిపి మరో రూ.36 వేల కోట్లు అప్పు (ఎఫ్ఆర్బీఎం చట్టానికి లోబడే) తెచ్చుకోవడం ద్వారా ఆర్థిక ఇబ్బందులను అధిగమించే యోచనలో ఉంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అప్పులు తెచ్చుకునేందుకు ఇటీవలే ఆర్డినెన్స్ సైతం జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్‌తో రూ.9.7లక్షల కోట్ల జీఎస్డీపీలో 5 శాతం రుణ సమీకరణకు మార్గం సుగమమైంది. సొంత ఆదాయం కొంత పెంచుకోవాలని.. ♦ సొంత ఆదాయ వనరులను పెంచుకోవడంలో భాగంగా చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న భూముల మార్కెట్ ధరల సవరణ ప్రతిపాదనకు పరిష్కారం చూపనుంది. వాస్తవానికి, తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి రాష్ట్రంలో భూముల విలువలు సవరించలేదు. దీంతో ఆరేళ్లుగా రిజిస్ట్రేషన్లశాఖ ఆదాయాన్ని కోల్పోతోంది. వీటిని సవరించాలని పలుమార్లు డిమాండ్లు వచ్చినా ప్రభుత్వం పక్కనపెట్టింది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మార్కెట్ విలువల సవరణ ప్రభుత్వ ఆదాయం పెంపునకు ఉపయోగపడనుంది. ప్రస్తుతం ఉన్న భూముల విలువల్ని ప్రాంతాన్ని బట్టి 10–20 శాతం పెంచడం ద్వారా ఏటా రూ.3వేల కోట్ల వరకు అదనపు రాబడి సమకూర్చుకునే ప్రతిపాదనను ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోందని, త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటుందని ఆర్థిక శాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది. ♦ ఎక్సైజ్ శాఖ ద్వారా కూడా ఆదాయ వనరులను శాశ్వతంగా పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా ఇటీవల కోవిడ్ సెస్ పేరుతో సగటున 16 శాతం మద్యం ధరలు పెంచింది. తద్వారా ప్రతి నెలా రూ.200 కోట్ల వరకు అదనపు ఆదాయం వస్తుందని అంచనా. ఈ ఆర్థిక సంవత్సరంలో మరోసారి మందుబాబుల జేబుకు చిల్లు తప్పదని ఎక్సైజ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల పెరిగిన ధరల మేరకు మద్యం కంపెనీలతో అమ్మకపు ఒప్పందం కుదుర్చుకునే ఫైలు ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఇది పూర్తయ్యాక ఇప్పటికిప్పుడు కాకున్నా, త్వరలో మద్యం ధరలు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ రూపేణా ఏటా రూ.1,500 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా. ♦ వాహన పన్ను, గ్రామాలు, పట్టణాల్లో ఆస్తి పన్ను పెంపు, ఐదేళ్లుగా పెరగని మద్యం డిస్టిలరీల లైసెన్స్ ఫీజు పెంపు, గనులు, ఇసుక రీచ్‌ల ద్వారా పారదర్శకంగా ఆదాయం రాబట్టుకోవడం లాంటి అంశాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. అయితే, పన్నుల పెంపు విషయంలో సీఎం కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారనేది కీలకమని, ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టామని ఆర్థికశాఖ చెబుతోంది. -
రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలపై యనమల సమీక్ష
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వలోని వివిధ శాఖల ఆదాయాలపై మంత్రి యనమల రామకృష్ణుడు సోమవారం త్రైమాసిక సమీక్ష నిర్వహించారు. గతయేడాది కంటే వివిధ శాఖల్లోని ఆదాయాలు పెరిగినట్లు ఈ సందర్భంగా యనమల తెలిపారు. ఈ త్రైమాసికంలో వివిధ శాఖలకు నిర్దేశించిన రూ.10 530 కోట్ల లక్ష్యానికిగాను, రూ.9,800 కోట్ల ఆదాయాన్ని సాధించిటనట్లు పేర్కొన్నారు. ఎక్సైజ్ శాఖలో మూడు శాతం పెరుగుదల మాత్రమే ఉండగా, సీఆర్డీఏ పరిధిలో రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గినట్లు తెలిపారు. ప్రత్యేకంగా కృష్ణా జిల్లాలో రిజిస్టేషన్ల ఆదాయం లక్ష్యాన్ని చేరుకోలేదన్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ రూ.789 కోట్ల ఆదాయానికి చేరుకున్నట్లు యనమల తెలిపారు. గనుల శాఖలో ఆదాయం గణనీయంగా పెరిగింది. రూ.287 కోట్ల లక్ష్యానిగాను రూ.304 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. రవాణాశాఖలో, అటవీ శాఖలో ఆదాయం పెరిగినట్లు యనమల తెలిపారు. రవాణా శాఖలో నాలుగు నెలల్లో రూ. 512 కోట్ల ఆదాయం సమకూరగా, అటవీ శాఖలో రూ.116 కోట్లకు గాను రూ.148 కోట్ల ఆదాయం సాధించామన్నారు. కొన్ని శాఖలు లక్ష్యాలు అధిగమించగా..కొన్ని శాఖలు వెనకబడ్డాయన్నారు. తెలంగాణతో పోలిస్తే.. రూ. రెండు వేల కోట్ల వరకూ ఆదాయం తక్కువగా ఉందన్నారు. -
వరుస ఉద్యమాల వల్ల రాష్ట్ర ఖజనాకు భారీ గండి