హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వలోని వివిధ శాఖల ఆదాయాలపై మంత్రి యనమల రామకృష్ణుడు సోమవారం త్రైమాసిక సమీక్ష నిర్వహించారు. గతయేడాది కంటే వివిధ శాఖల్లోని ఆదాయాలు పెరిగినట్లు ఈ సందర్భంగా యనమల తెలిపారు. ఈ త్రైమాసికంలో వివిధ శాఖలకు నిర్దేశించిన రూ.10 530 కోట్ల లక్ష్యానికిగాను, రూ.9,800 కోట్ల ఆదాయాన్ని సాధించిటనట్లు పేర్కొన్నారు. ఎక్సైజ్ శాఖలో మూడు శాతం పెరుగుదల మాత్రమే ఉండగా, సీఆర్డీఏ పరిధిలో రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గినట్లు తెలిపారు. ప్రత్యేకంగా కృష్ణా జిల్లాలో రిజిస్టేషన్ల ఆదాయం లక్ష్యాన్ని చేరుకోలేదన్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ రూ.789 కోట్ల ఆదాయానికి చేరుకున్నట్లు యనమల తెలిపారు.
గనుల శాఖలో ఆదాయం గణనీయంగా పెరిగింది. రూ.287 కోట్ల లక్ష్యానిగాను రూ.304 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. రవాణాశాఖలో, అటవీ శాఖలో ఆదాయం పెరిగినట్లు యనమల తెలిపారు. రవాణా శాఖలో నాలుగు నెలల్లో రూ. 512 కోట్ల ఆదాయం సమకూరగా, అటవీ శాఖలో రూ.116 కోట్లకు గాను రూ.148 కోట్ల ఆదాయం సాధించామన్నారు. కొన్ని శాఖలు లక్ష్యాలు అధిగమించగా..కొన్ని శాఖలు వెనకబడ్డాయన్నారు. తెలంగాణతో పోలిస్తే.. రూ. రెండు వేల కోట్ల వరకూ ఆదాయం తక్కువగా ఉందన్నారు.