state Panchayati Raj
-
అభయహస్తం లబ్ధిదారులకు ‘ఆసరా’
సాక్షి, హైదరాబాద్: ఆసరా పింఛన్ల అర్హత వయసును 57 ఏళ్లకు తగ్గిస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అభయహస్తం పథకం పింఛన్‌దారుల వివరాలను సేకరించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మం త్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు. అభయహస్తం పథకం అమలు తీరుపై గురువారం తన చాంబర్లో అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఆసరా లబ్ధిదారులకు నెలకు రూ. 2,016 చొప్పున అందుతున్నాయన్నారు. గతంలో అభయహస్తం లబ్ధిదారులుగా ఉన్న 1.90 లక్షల మందికి ఆసరా కింద ప్రయోజనం దక్కడంలేదని, వీరందరికి ఆసరా పింఛన్లు అందజేసే దిశగా సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పారిశుధ్య నిర్వహణకు నిధుల కొరత ఉందని, ఈ సమస్యను అధిగమించేందుకు ఉపాధి హామీ నిధులను వినియోగించే అంశాన్ని పరిశీలించాలని ఆయన అధికారులకు సూచించారు. -
దసరా నుంచి కొత్త రేషన్‌కార్డులు
- రుణమాఫీ చేసితీరుతాం - మంత్రి కేటీఆర్ వెల్లడి ముస్తాబాద్: ప్రజల కష్టాలు తెలుసుకునేందుకే ఇంటింటి సర్వే చేపట్టామని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. అర్హులకు దసరా నుంచి కొత్త రేషన్‌కార్డులు ఇస్తామని వెల్లడించారు. ముస్తాబాద్‌లో జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమతో కలిసి గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సర్వేకు ముందే ప్రభుత్వానికి 6.15 లక్షల రేషన్‌కార్డులను సరెండర్ చేశారని తెలిపారు. హైదరాబాద్ భూములు విక్రయించైనా రుణమాఫీఅమలు చేస్తామని, తలతాకట్టు పెట్టయినా రైతులకు అండగా ఉంటామని స్పష్టంచేశారు. రైతు కష్టాలు తెలిసిన వ్యక్తిగా కేసీఆర్ పనిచేస్తున్నారని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా గోదాముల నిర్మిస్తున్నామని, ఇందుకోసం 200 గ్రామాలను ఎంపిక చేశామని వివరించారు. గోదాముల వద్ద ప్లాట్‌ఫామ్‌లూ నిర్మిస్తామని తెలిపారు. ఉపాధిహామీ పనుల్లో వెనుకబడిన కరీంనగర్ జిల్లాను నంబర్‌వన్‌గా నిలిపేలా కూలీలకు పనులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. కేడీసీసీబీ చైర్మన్ రవీందర్రావు, ఆర్డీవో బిక్షానాయక్, ఓఎస్డీ శ్రీనివాస్, డ్వామా పీడీ గణేశ్, జెడ్పీటీసీ శరత్‌రావు, ఎంపీపీ శ్రీనివాస్, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు సర్వర్‌పాషా పాల్గొన్నారు. -
అయ్యన్నా..మా మొర వినన్నా...
నేడు మంత్రి అయ్యన్నపాత్రుడు రాక కైకలూరు : రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, ఎన్ఆర్ ఈజీఎస్ (ఉపాధి హామీ) శాఖల మంత్రి సిహెచ్.అయ్యన్నపాత్రుడు నేడు జిల్లాకు రానున్నారు. సమస్యలు ఆయనకు స్వాగతం పలుకుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత నిధుల కొరత వేధిస్తుండంతో అనేక పథకాలు నత్తనడకన సాగుతున్నాయి. ప్రధానంగా గ్రామ పట్టుసీమలైన పంచాయతీలు నిధుల కొరతతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. జిల్లాలో 969 పంచాయతీలుండగా...వీటిలో కనీసం బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు చేయలేని దీనస్థితిలో అనేక పంచాయతీలు పాలన సాగిస్తున్నాయి. ఒక పక్క 100 రోజుల ప్రణాళిక అంటూ కాగితాల మీద లెక్కలు అడుగుతున్న అధికారులు నిధుల మార్గాలు చూపాలని ప్రజాప్రతినిధుల నుంచి ఇప్పటికే ఆయా పంచాయతీల్లో వ్యతిరేకత వచ్చింది. పంచాయతీల్లో పెరుకుపోయిన విద్యుత్ బకాయిల కారణంగా కొత్త పనులు చేయడానికి విద్యుత్‌శాఖ ససేమిరా అంటుంది. ఈ కారణంతో అనేక కాలనీలు చీకట్లో మగ్గుతున్నాయి. ఇదిలా ఉంటే గ్రామీణ నీటి సరఫరా కోటి సమస్యలతో ఈదుతుంది. ఫిల్టర్బెడ్లలో ఇసుక మార్చడానికి కూడా నిధులు లేమి వేధిస్తుంది. జిల్లాలోని అనేక గ్రామాలో రక్షిత నీటి సరఫరా పథకాలు ఉత్సవ విగ్రహాలుగా దర్శనమిస్తున్నాయి. ఉపాధి హామీ పథకం పనుల కోసం కూలీలు ఆశగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలో వలసల నివారణకు ఈ పథకం ఏ మాత్రం ఉపయోగపడటం లేదు. ఎస్సీ, ఎస్టీ సర్పంచులు ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను కేటాయించాలని ఆందోళన చేస్తున్నారు. అనేక పంచాయతీలు పాడుబడ్డ కొంపల్లా దర్శనమిస్తున్నాయి. సమస్యలు తీర్చాలని మంత్రిని కోరుతున్నారు.