State people
-
కాశీలో చిక్కుకున్న రాష్ట్రవాసులు
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఉత్తరభారత దేశం యాత్రకు వెళ్లిన పలువురు కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌తో ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. ముఖ్యంగా కాశీలో వందల సంఖ్యలో యాత్రికులు మూడు నాలుగు రోజులుగా పడిగాపులు కాస్తున్నారు. తాము రిజర్వేషన్ చేసుకున్న రైళ్లు రద్దు కావడంతో కాశీలోని సత్రాల్లో తలదాచుకున్నారు. సరైన వసతులు లేకపోవడం, తీసుకెళ్లిన డబ్బులు అయిపోవడంతో వారు పడుతున్న పాట్లు అన్నీఇన్నీకావు. దీనికి తోడు ఊరుకాని ఊరులో ఉంటున్న తమకు ఎక్కడ కరోనా సోకుతుందోనని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. బుధవారం రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని తమతమ వారికి వారి ద్వారా మీడియా వారికి, అధికారులకు ఫోన్లు చేసి తమను కాపాడాలంటూ విన్నపాలు చేశారు. - తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం సోమేశ్వరం, అనపర్తి మండలం కుతుకులూరు గ్రామానికి చెందిన 27 మంది ఈనెల 16న కాశీ ప్రయాణానికి వెళ్లారు. - పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వాసులు ఈనెల 9న ఉత్తరభారతదేశం యాత్రకు వెళ్లారు. వీరంతా ఈనెల 22న తిరుగుప్రయాణం కావాల్సి ఉండగా రైళ్ల రద్దుతో చిక్కుకుపోయారు. - గుంటూరు నగరంలోని నల్లచెరువు, కొరిటెపాడు, మేనకాగాంధీనగర్ ప్రాంతాలకు చెందిన సుమారు 55 మంది కూడా మూడు రోజులుగా కాశీలోనే తిరుగుప్రయాణం కోసం పడిగాపులు కాస్తున్నారు. ఐదు రోజులు మాత్రమే బస చేసేందుకు ఆశ్రమం నిర్వాహకులు అనుమతి ఇచ్చారని తర్వాత తమ పరిస్థితి ఏమిటని వారు వాపోతున్నారు. తమలో కొందరు కొన్ని జబ్బులకు మందులు వాడుతున్నవారు ఉన్నారని, ఇక్కడ మందులు దొరకక ఇబ్బందులు పడుతున్నామని గుంటూరుకు చెందిన రాజమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. - శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన 29 మంది కూడా కాశీలో బిక్కుబిక్కుమంటున్నారు. వీరు ఈ నెల 16న కాశీయాత్రకు రైలులో వెళ్లా రు. 22న తిరుగు ప్రయాణం కావాల్సి ఉండగా రైళ్లు రద్దు కావడంతో ఓ సత్రంలో తలదాచుకున్నారు. -
టీఆర్ఎస్ను ప్రజలు మరువరు
తరిగొప్పుల: తరిగొప్పుల ప్రాంత ప్రజల 30 ఏళ్ల చిరకాల వాంఛను ప్రభుత్వం గుర్తించి మండలంగా ప్రకటించనందుకు టీఆర్ఎస్ను మండల ప్రజలు మరువరని మండల సాధన సభ్యులు సిద్దిని మహిపాల్, అర్జుల సుధాకర్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మండల ప్రజల ఆకాంక్షను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజల కోరికను గుర్తించడంలో తెలంగాణ రాష్త్ర ప్రభుత్వం సఫలమైందని అన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ చిలువేరు సంపత్, పింగిళి జగన్మోహనరెడ్డి, లింగం, తాళ్లపల్లి రాజేశ్వర్, ఆవుల రాములు, దామెర ప్రభుదాస్, తదితరులు ఉన్నారు. -
ప్రజలందరికీ మేలు జరిగేలా ఉండాలి: వైఎస్ జగన్
* రాజధానిపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి * కొందరు శ్రీమంతులకే పరిమితమయ్యేలా రాజధాని ఉండకూడదు * రాజధాని ప్రకటనకు ముందే దానిపై చర్చ, ఓటింగ్ జరగాలి * ముఖ్యమంత్రి ప్రకటన చేసిన తర్వాత ఇక చర్చించేదేముంటుంది? * నేను చేసేది చేసేస్తా... మీ చావు మీరు చావండి అన్నట్లుగా ముఖ్యమంత్రి వైఖరి ఉంది * ఒకే చోట కనీసం 30 వేల ఎకరాలు అందుబాటులో ఉన్నచోట రాజధాని నిర్మించాలని మేం ముందునుంచీ చెబుతున్నాం * కృష్ణా - గుంటూరు జిల్లాల్లో రాజధానికి నేనూ సిద్ధమే.. అక్కడ 30 వేల ఎకరాల వైశాల్యం గల భూమి ఒకే చోట ఉంటే అక్కడే పెట్టమనండి * శివరామకృష్ణన్ కమిటీ నివేదికపై అసెంబ్లీలో చర్చ జరగాలని కోరుకుంటున్నాం * ఆ నివేదికలో ఏముందో తెలియకుండా, తెలుసుకోవాలనే బుద్ధీ జ్ఞానం లేకుండా రాజధానిపై ప్రకటనకు ముహూర్తం కూడా నిర్ణయించారు సాక్షి, హైదరాబాద్: రాజధాని ఎంపిక రాష్ట్ర ప్రజ లందరికీ మేలు జరిగేలా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిప్రాయపడ్డారు. రాజధాని ఏర్పాటు కొందరు శ్రీమంతులకే పరిమితమయ్యేలా ఉండకూడదని తెలిపారు. బుధవారం శాసన సభ వాయిదా పడిన తర్వాత జగన్ అసెంబ్లీలోని తన చాంబర్లో మీడియాతో ముచ్చటిం చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుతో ముడివడి ఉన్నందున ప్రకటన చేయడానికి ముందే ఆ అంశంపై చర్చ, ఆ తర్వాత ఓటింగ్ జరగాలని కోరుతున్నామని చెప్పారు. రాజధానిపై ముఖ్యమంత్రి ప్రకటన చేసిన తర్వాత ఇక చర్చించేదేముంటుందని ప్రశ్నించారు. ‘‘1953 జూలై 1న ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఎక్కడుండాలనే అం శంపై అప్పట్లో 5 రోజులపాటు చర్చ జరిగింది. ఓటింగ్ కూడా జరిగింది. మెజారిటీ శాసన సభ్యులు ఓట్లేశారు. ఆ ప్రకారమే రాజధాని నిర్ణ యం జరిగింది. అలా కాకుండా ఒక నియంత మాదిరిగా రాజధాని ఎక్కడుండాలో ఆయనే నిర్ణయించేస్తానంటే ఎలా? ఈరోజు అష్టమి బాగాలేదు. దశమి రోజున ప్రకటన చేసేస్తానం టే సరిపోతుందా? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నియంతృత్వంలో ఉన్నామా’’ అని జగన్ ప్రశ్నించారు. ‘‘ముందు రాజధానిపై ప్రకటన చేస్తాను. ఆ తరువాత చర్చించండి అంటున్నారు. ప్రకటన ఇచ్చాక ఇక చర్చించేదేముంటుంది? నేను చేసేది చేసేస్తా... మీ చావు మీరు చావండి అన్నట్లుగా సీఎం వైఖరి ఉంది’’ అని జగన్ ఘాటుగా విమర్శించారు. ‘‘రాజధా నికి కావాల్సిన భూమి ఎక్కడ అందుబాటులో ఉంటుందో అక్కడ నిర్మిస్తే బాగుంటుందని మేం తొలి నుంచీ చెబుతున్నాం. రాజధాని నిర్మాణానికి ప్రభుత్వ భూమి లేదా అటవీ భూమినైనా సరే లక్ష ఎకరాల వరకు డీనోటిఫై చేస్తామని కేంద్రం రాష్ట్ర విభజన చట్టంలోనే చెప్పింది. అలాంటప్పుడు అందుకు భిన్నంగా ఆలోచన చేయడమేమిటి? ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతంలో 2 వేల ఎకరాలు, 3 వేల ఎకరాలు తీసుకుని అక్కడే రాజధాని పెడతామంటే ఇక ఆ చుట్టుపక్కల స్థలాలు, ఇళ్ల ధరలు ఏ స్థాయికి వెళ్లిపోతాయో ఆలోచించండి. ఒక సామాన్యుడు చదువుకున్న తన పిల్లలను తీసుకుని ఉద్యోగాల కోసం రాష్ట్ర రాజధానికి వెళ్లి ఉండాలంటే అతనికి అందుబాటులో ఉండే ధరకు అద్దెకు ఇల్లు దొరుకుతుందా? మీలాంటి ఓ ఉద్యోగి (జర్నలిస్టులనుద్దేశించి) ఉద్యోగం చేసుకోవడం కోసం రాజధానికి వెళ్లి సొంత ఇల్లు కావాలనుకుంటే కొనడం సాధ్యమయ్యే పనేనా!’’ అని జగన్ అన్నారు. ఎవరికో మేలు చేసే ఆలోచనలతో అదే డెరైక్షన్‌లో వెళితే ఎలా? రాష్ట్రానికి ఏం చేస్తే మేలు జరుగుతుందో అది చేయాలి’’ అని జగన్ చెప్పారు. భూసేకరణ చేసి.. ఆ భూమిని అభివృద్ధి చేసి 40 శాతం తిరిగి సొంతదారునికే ఇస్తానని ప్రభుత్వం చెబుతోంది కదా అని ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘‘నిజమే.. ఆ తరువాత ఆ భూమి ని యజమాని మీలాంటి వారికి తక్కువ ధరకు అమ్ముతాడా? గజం ఏ యాభై వేల రూపాయలకో విక్రయిస్తాడు కదా..! సామాన్యుడు అంత భారీ ధరకు కొనగలడా..’’ అంటూ జగన్ అందులో ఇమిడి ఉన్న సమస్యను వివరించారు. ఇడుపులపాయ అని నేనన్నానా? ఇడుపులపాయలో రాజధాని పెట్టాలని జగన్ కోరుకుంటున్నారని అధికారపక్షం అరోపిస్తోం దని మరో విలేకరి అనగా.. ‘‘ఇడుపులపాయలో రాజధాని పెట్టాలని నేను అన్నానా? ఇలాంటివన్నీ వారు (టీడీపీ) అక్కసుతో చేసే విమర్శ లు’’ అని జగన్ సమాధానమిచ్చారు. కృష్ణా - గుంటూరు జిల్లాల్లో రాజధాని పెట్టడానికి తాను సిద్ధమేనని, అక్కడ 40వేల ఎకరాలు లేదా కనీ సం 30 వేల ఎకరాల వైశాల్యం గల భూమి ఒకే చోట ఉంటే అక్కడే పెట్టమనండి అని చెప్పారు. దయచేసి రాజధాని విషయంపై రాజకీయాలు చేయొద్దని అన్నారు. జగన్ ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొడుతున్నారంటూ టీడీపీ చేస్తున్న విమర్శలను ప్రస్తావించగా,,‘‘రాష్ట్రం 13 జిల్లాలకు కుదించుకుపోయింది. ఇంకా ఇబ్బందులు పడ టం మంచిది కాదు. దీనిని రాజకీయం చేయాలని చూడటం మంచిది కాదు. మనమంతా కల సి ఉంటే బలంగా, దృఢంగా ఉంటాం. లేకుంటే ఇంకా బలహీనం అయిపోతాం’’ అని చెప్పారు. ‘‘రాజధానిని అడ్డుకోవడానికి మేము ప్రయత్నించడంలేదు. రాజధానిని పెట్టండి అనే మేమే కోరుతున్నాం. రాజధాని ఎంపిక కోసం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నివేదిక అసెం బ్లీకి వచ్చి దానిపై చర్చ జరగాలని కోరుకుంటున్నాం. ఆ నివేదికలో ఏముందో తెలియకుండా, తెలుసుకోవాలనే బుద్ధీ లేకుండా రాజధాని ఎక్కడుండాలో ప్రకటన చేయడానికి ముహూర్తం కూడా నిర్ణయించేసుకుంటున్నారు’’ అని జగన్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. రాజధాని ఎక్కడో ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు కదా అని ఓ విలకరి అనగా.. రాజధాని ఎక్కడ నిర్మించేదీ అసెంబ్లీలో గురువారం మధ్యాహ్నం 12.17 గంటలకు ప్రకటిస్తారని, ఇందుకోసం ముహూర్తం నిర్ణయించిన సిద్ధాంతి పేరుతో సహా చంద్రబాబు అనుకూల పత్రిక ఒకటి ప్రచురించిన వార్తను జగన్ ఉదహరించారు. ఒకసారి ఆ వార్త చదవండి అని అన్నారు. రామారావుపై కేసు ఎత్తివేయడమేంటి? చర్చకు అనుమతించాలని జగన్ డిమాండ్ సాక్షి, హైదరాబాద్: టీడీపీ మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావుపై నమోదైన కేసును ప్రభుత్వం ఉపసంహరించడాన్ని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం అసెంబ్లీలో ప్రస్తావించారు. ఇది చాలా ముఖ్యమైన విషయమైనందున సభలో చర్చించేందుకు సమయం కేటాయించాలని స్పీకర్‌కు విజ్ఞప్తిచేశారు. ప్రశ్నోత్తరాల ప్రారంభంలో ఆయన మాట్లాడుతూ.. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే రామారావుపై నిర్భయ చట్టం కింద కేసులతో పాటు పలు అత్యాచారం కేసులున్నాయని, అయితే వాటిని ఈ ప్రభుత్వం తొలగించిందని సభ దృష్టికి తెచ్చారు. ఈ రకంగా కేసును ఉపసంహరించడమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ.. దానిపై చర్చ జరగాలని అంటుండగా స్పీకర్ కోడెల శివప్రసాదరావు అభ్యంతరం తెలిపారు. జగన్ బదులిస్తూ ఆయనపై కేసు రద్దు విషయం పత్రికల్లో చూసి ఆశ్చర్యపోయానని చెప్పారు. కేసు ప్రా ధాన్యత దృష్ట్యా చ ర్చకు తగిన సమయం కేటాయించాలని కోరారు. ఇలావుండగా.. ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపుపై అసెంబ్లీలో చర్చించాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం అసెంబ్లీలో పార్టీ సభ్యుడు కె.శ్రీని వాసులు వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించా రు. అయితే స్పీకర్ దీన్ని తిరస్కరించారు. వేలా ది మంది జీవితాలతో ముడిపడిన అంశాన్ని చర్చించకపోతే ఎలా? అని వైసీపీ సభ్యులు స్పీకర్‌ను అడిగారు. ప్రతిపక్ష నేత జగన్ జోక్యం చేసుకుని ఔట్సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు పై చర్చించేందుకు ఏదో విధంగా సమయం ఇవ్వాలని కోరారు. ‘వారేం చేసినా బాబు కాపాడేలా ఉన్నారు’ టీడీపీ కార్యకర్తలు, నేతలు ఎలాంటి నేరం చేసినా కాపాడేలా సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో పార్టీ ఎమ్మెల్యేలు రక్షణనిధి, విశ్వేశ్వరరెడ్డిలతో కలసి ఆయన మాట్లాడారు. 2009 సెప్టెంబర్ 1న కొవ్వూరులోని తన న ర్సింగ్ కళాశాలలో కేరళ విద్యార్థినుల్ని లైంగి కంగా వేధించి, అత్యాచార ప్రయత్నాలకు ఒడిగట్టిన టీడీపీ నాయకుడు, అప్పటి ఎమ్మెల్యే టీవీ రామారావుపై కేసులు నమోదయ్యూయని, సీఐడీ విచారణలో నేర నిర్ధారణ సైతం జరిగిందని చెప్పారు. దీనిపై కోర్టులో విచారణ జరుగుతుంటే, వాదనలను ఉప సహరించుకోవాల్సిం దిగా పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఆదేశిస్తూ జీవో జారీ చేయడం అన్యాయమన్నారు. న్యాయవ్యవస్థను కించపరిచేలా జీవో ఇప్పించిన చంద్రబాబు సీఎంగా సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. మహిళలకు టీడీపీ ప్రభుత్వం ఎలాంటి భద్రత కల్పిస్తుందో ఈ చర్య ద్వారా తేటతెల్లమౌతోందని దుయ్యబట్టారు. -
రైల్వే బడ్జెట్లో.. ఏపీపై కరుణ ఏది?
► రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి మొండిచేయి ► కొత్త ప్రాజెక్టుల ఊసే లేదు ► పునర్వ్యవస్థీకరణ చట్టంలో చెప్పిన ప్రాజెక్టులకూ దిక్కులేదు ► ప్రత్యేక జోన్, మెట్రో ప్రాజెక్టుల ప్రస్తావనే లేదు ► రాష్ట్రంలో ప్రారంభమయ్యే రైళ్లు మూడే..వీటిలో రెండు పాతవే.. ► రాష్ట్రం మీదగా 6 కొత్త రైళ్లు ► కొత్త లైన్ల నిర్మాణం, డబ్లింగ్, ఇతరత్రా పనులకు ఇచ్చింది సుమారు రూ.473.28 కోట్లే.. సాక్షి, హైదరాబాద్/విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే బడ్జెట్లో మళ్లీ మొండిచేయే మిగిలింది. రాష్ట్ర ప్రజలు పెట్టుకున్న ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. మంగళవారం పార్లమెంటులో కేంద్ర రైల్వే మంత్రి సదానంద గౌడ ప్రవేశపెట్టిన బడ్జెట్లో నామమాత్రంగానే నిధులు విదిలించారు. చెప్పుకోదగ్గ ఒక్క ప్రాజెక్టూ రాష్ట్రానికి రాలేదు. కొత్త ప్రాజెక్టుల ఊసే లేదు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న ప్రాజెక్టులకూ బడ్జెట్లో చోటు దక్కలేదు. కొత్త రాష్ట్రం ఆవిర్భావం జరి గిన ఆరు నెలల్లోగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని చట్టంలో పేర్కొన్నారు. దక్షిణ మధ్య జోన్ పరిధిలోని విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు, తూర్పు కోస్తా జోన్‌లోని వాల్తేరు డివిజన్‌తో కలిపి కొత్త జోన్ ఏర్పాటు ప్రకటన బడ్జెట్లో ఉంటుందని ఎదురు చూసిన ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలు అడియాశలయ్యాయి. విశాఖ లేదా విజయవాడ కేంద్రంగా ఈ జోన్ ఏర్పాటు చేస్తామని నేతలు ప్రకటనలు గుప్పించినా, బడ్జెట్లో నిరాశే మిగిలింది. రాష్ట్ర విభజన బిల్లు లో పేర్కొన్న విజయవాడ - గుంటూరు - తెనాలి మెట్రో రైల్ ఏర్పాటుపై అపాయింటెడ్ డే (జూన్ 2) నుంచి ఆరు నెలల్లో సర్వే చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించాల్సి వుంది. బడ్జెట్లో ఈ ప్రస్తావనే లేదు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు కూడా నేతల ప్రకటనలకే పరిమితమైంది.తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్ ఏర్పాటు చేస్తామని గతంలో అనేక సార్లు ప్రకటించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ డిమాండ్ నెరవేరగలదని అందరూ భావించారు. డివిజన్ ఏర్పాటు అంశం బడ్జెట్లో ప్రస్తావించాల్సిన అవసరం లేదనీ, కమిటీ నివేదిక వచ్చాక ఏర్పాటవుతుందని బీజేపీ నేతలు అంటున్నారు. ఎ క్లాస్ రైల్వే స్టేషన్లను ఎయిర్‌పోర్టుల తరహాలో అభివృద్ధి చేస్తామని మంత్రి చేసిన ప్రకటన వల్ల రాష్ట్రంలోని తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం స్టేషన్ల అభివృద్ధి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టే అవకాశాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. విశాఖలో వ్యాగన్ల తయారీ పరిశ్రమ ఏర్పాటునూ కేంద్రం విస్మరించింది. గుంతకల్లులో రూ.100 కోట్లతో విద్యుత్ లోకో షెడ్ నిర్మింప్రతిపాదనకు కూడా ఆమోద ముద్ర పడలేదు. పెండింగ్ ప్రాజెక్టులపై కమిటీతో సరి.. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తామన్న హామీ కూడా మంత్రి ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులపై కమిటీ ఏర్పాటు ప్రకటనతో సరిపెట్టారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ రూ. 20,680 కోట్ల విలువైన 29 ప్రాజెక్టులు ఉన్నాయని, వీటికి నిధుల కేటాయింపుపై నివేదిక ఇవ్వడానికి రైల్వే, ఇరు రాష్ట్రాల అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కమిటీ నివేదికను అనుసరించి ఇరు రాష్ట్రాల్లో ఆర్థికాభివృద్ధికి చేయూతనిచ్చేవిధంగా ఈ ప్రాజెక్టులను చేపడతామని హామీ ఇచ్చారు. పాత రైళ్లే కొత్తవిగా.. రాష్ట్రం నుంచి 3 రైళ్లు కొత్తగా ప్రారంభిస్తున్నట్లు బడ్జెట్లో చూపించారు. వాస్తవానికి వీటిలో విజయవాడ - న్యూఢిల్లీ మధ్య రోజూ నడిచే ఏపీ ఎక్స్‌ప్రెస్ మాత్రమే కొత్త రైలు. విశాఖపట్నం - చెన్నై మధ్య వీక్లీ ఎక్స్‌ప్రెస్ వేస్తున్నట్లు బడ్జెట్లో చెప్పారు. అయితే, ఈ రైలు ఇప్పటికే విశాఖ - చెన్నైల మధ్య ప్రత్యేక రైలుగా నడుస్తోంది. దానినే వీక్లీ ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు. పారదీప్ - విశాఖపట్నం వీక్లీ ఎక్స్‌ప్రెస్ కూడా ఇటువంటిదే. ఇప్పటికే పారదీప్ - శ్రీకాకుళంల మధ్య నడుస్తున్న రైలును విశాఖపట్నం వరకు పొడిగించి, కొత్త రైలు మంజూరు చేసినట్లు చూపించారు. మరో 6 రైళ్లు ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణించేవి ఉన్నాయి. హైదరాబాద్ - చెన్నై హైస్పీడ్ రైలు, షాలిమార్ - చెన్నై ప్రీమియం ఏసీ ఎక్స్‌ప్రెస్, జైపూర్ - మధురై, కమాఖ్య - బెంగళూరు ప్రీమియం ఎక్స్‌ప్రెస్‌లు, అహ్మదాబాద్ - చెన్నై ఎక్స్‌ప్రెస్ (బైవీక్లీ), టాటానగర్ - బెంగళూరు ఎక్స్‌ప్రెస్ (వీక్లీ)లు రాష్ట్రం మీదుగా వెళ్తాయి. ఇవి మినహా రాష్ట్రానికి ఉపయోగపడే అంశాలు బడ్జెట్లో ఒక్కటీ కనిపించలేదు. విజయవాడ నుంచి ముంబై, కోల్‌కతా నగరాలకు ప్రత్యేక రైళ్లు, తిరుపతి- షిరిడి రైలు ఊసే లేదు. -
వైఎస్ జగన్ నాయకత్వం ప్రజలకు అవసరం:ఏబీకే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష వెంటనే విరమించాలని సీనియర్ పాత్రికేయులు ఏబీకే ప్రసాద్ శనివారం హైదరాబాద్‌లో విడుదల చేసిన ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దిశానిర్దేశం చేయాల్సిన మీరు త్యాగాలకు పూనుకోవద్దని ఆయన జగన్‌కు ఈ సందర్భంగా హితవు పలికారు. వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు బాసటగా నిలవాల్సిన సమయంలో ఆసన్నమైందని పేర్కొన్నారు. ప్రస్తుతం మీ నాయకత్వం ప్రజలకు చాలా అవసరమని ఈ సందర్భంగా జగన్‌కు ఏబీకే ప్రసాద్ గుర్తు చేశారు. రాజకీయ స్వార్థం కోసమే రాష్ట్రాన్ని చీల్చేందుకు సిద్దమైందని ఏబీకే ప్రసాద్ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు.