టీఆర్‌ఎస్‌ను ప్రజలు మరువరు | People won't forget TRS | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ను ప్రజలు మరువరు

Published Sat, Oct 15 2016 10:35 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 PM

People won't forget TRS

తరిగొప్పుల: తరిగొప్పుల ప్రాంత ప్రజల 30  ఏళ్ల చిరకాల వాంఛను ప్రభుత్వం గుర్తించి మండలంగా ప్రకటించనందుకు టీఆర్‌ఎస్‌ను మండల ప్రజలు మరువరని మండల సాధన సభ్యులు సిద్దిని మహిపాల్, అర్జుల సుధాకర్‌రెడ్డి అన్నారు. గురువారం  స్థానిక గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు  మాట్లాడుతూ మండల ప్రజల ఆకాంక్షను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ప్రజల కోరికను గుర్తించడంలో తెలంగాణ రాష్త్ర ప్రభుత్వం సఫలమైందని అన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ చిలువేరు సంపత్, పింగిళి జగన్మోహనరెడ్డి, లింగం, తాళ్లపల్లి రాజేశ్వర్, ఆవుల రాములు, దామెర ప్రభుదాస్, తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement