stomped
-
'సదరం' వద్ద తోపులాట, స్పృహ తప్పిన మహిళలు
నిజామాబాద్ : సామాజిక పింఛన్ల కోసం ప్రభుత్వం చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ సామాన్యులకు ప్రాణాంతకంగా మారింది. వికలాంగ పింఛన్లు కోరుకునే వారికి సదరం సర్టిఫికెట్లు తప్పని సరిగా ఉండాలనే నిబంధనతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఆస్పత్రి వద్ద శుక్రవారం సదరం శిబిరం వద్ద తోపులాట జరిగింది. ధ్రువ పత్రాల కోసం వేలాదిమంది వికలాంగులు, వృద్ధులు సదరం కేంద్రాల వద్దకు తరలిరావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మహిళలు స్పృహ తప్పిపడిపోయారు. దాంతో వారికి చికిత్స అందిస్తున్నారు. వృద్ధులు, వితంతువులకు ప్రతినెలా వేయిరూపాయలు, వికలాంగులకు రూ.1500 చొప్పున పింఛన్ చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. నిబంధనల మేరకు 40శాతం వైకల్యమున్న వారికే వికలాంగ పింఛన్ మంజూరవుతుంది. దాంతో గతంలో సదరం పరీక్షలో 40 శాతం పొందలేక పోయిన వారు మరోమారు ధ్రువీకరణ పత్రాల కోసం వస్తుండటంతో గందరగోళం నెలకొంటోంది. -
అనకాపల్లిలో పాల ప్యాకెట్ల కోసం తొక్కిసలాట
విశాఖ : విశాఖ జిల్లా అనకాపల్లిలో గురువారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. తుఫాను బాధితుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాల ప్యాకెట్ల క్యూలైన్ వద్ద తొక్కిసలాట జరిగింది. పాల ప్యాకెట్ల కోసం బాధితులు ఒక్కసారిగా తోసుకు రావటంతో గందరగోళం నెలకొంది. మరోవైపు పాల ప్యాకెట్ల కోసం జనాలు గంటల కొద్దీ క్యూలైన్లలో నిలబడే పరిస్థితి నెలకొంది. ఉదయం నుంచే జనాలు పాల ప్యాకెట్ల కోసం రోడ్లపై బారులు తీరారు. కాగా పాల ప్యాకెట్ల పంపిణీలో ప్రణాళిక లేని కారణంగా నిజమైన బాధితులకు పాలు అందలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత నాలుగు రోజులుగా తుఫాను వల్ల జనానాకి ఏమీ దొరకడంలేదు. కూరగాయలు, పాలు అన్నింటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దాంతో ప్రభుత్వం సాధారణ ధరలకు పాల ప్యాకెట్లు ఇప్పిస్తోందని తెలిసి భారీ సంఖ్యలో జనం చేరుకున్నారు. కానీ అక్కడ ఏర్పాట్లు తగినంతగా లేకపోవడం, వచ్చిన పాలు అయిపోతాయేమోనన్న ఆందోళన తొక్కిసలాటకు కారణమైంది.