Storm havoc
-
అత్తిగారిపల్లె అతలాకుతలం
గాలివాన బీభత్సం పెనగలూరు : మండలంలో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. 2.25 గంటలకు ప్రారంభమై అర్ధగంట వ్యవధిలో అతలాకుతలం చేసి ంది. ముఖ్యం గా అత్తిగారిపల్లెలో అనేక రకాలుగా నష్టాలు మిగిల్చింది. ఆ గ్రామానికి చెం దిన బొడ్డు వేములయ్య ఇంటిపై చెట్టు కూలడంతో.. పైకప్పు రేకులు కూలిపోయాయి. ఇంట్లోని టీవీ, డీవీడీతో సహా పగిలిపోయాయి. వస్తువులు, దుస్తులు, బియ్యం తడిచిముద్దయ్యాయి. అక్కడ తలదాచుకునేందుకు వీలులేకుండా పోయింది. అలాగే నాగమ్మ ఇంట్లో ఉండగానే పైకప్పు రేకులు కూలిపోయాయి. పరిస్థితిని గమనించిన ఆమె బయటికి వచ్చేలోపే రేకులు కూలి పోయి వస్తువులన్నీ దెబ్బతిన్నాయి. పరిగెత్తే సమయంలో కిందపడి గాయాలపాలైంది. అదే విధంగా సుబ్బమ్మ ఇం టిపైఉన్న రేకులు లేచిపోవడంతో ల్యాప్ టాప్, టీవీ నీళ్లలో మునిగిపోయాయి. వస్తువులను వదిలేసి మొదట ప్రాణాల నుంచి బయట పడటానికి అనేక మంది ఇళ్ల నుంచి పరుగులు తీశారు. తిప్పన లక్షుమయ్య, పూలతోటి శంకరమ్మ, రామాంజులు, నారయ్య, వెంకటయ్య ఇళ్లపై రేకులు కూడా ఎగిరిపోయాయి. ఇంకా చాలా మంది ఇళ్లలో నష్టాలు జరిగాయి. సాదక్‌వల్లి పొలం వద్దనున్న ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ స్తంభంతో సహా పడిపోయింది. తడిబట్టలతో మిగిలాం గాలివానకు ఇంట్లో కూర్చుని ఉండగా ముందు భాగంలో ఉన్న చెట్టు విరిగి ఇంటిపై పడటంతో రేకులన్నీ పగిలిపోయాయి. ఇంట్లో ఉన్న టీవీతో సహా వస్తువులు, బియ్యం తడిచాయి. అప్పులు చేసి రేకులు ఇల్లు వేసుకుంటే గాలివాన మాకు అప్పులు మిగిల్చింది. - వేములయ్య, అత్తిగారిపల్లె ప్రాణాలు దక్కించుకున్నా: వర్షం కురవడంతో ఇంట్లో ఉండ గా పైకప్పు రేకులు ఒక్క సారిగా విరిగి కింద పడ్డాయి. ఎందుకో భయం వేసి ఇంట్లో నుంచి తలుపు వద్దకు వచ్చే సరికే చెట్టు కూలి రేకులు ఇంట్లో పడ్డాయి. ఇంట్లోనే ఉండి ఉంటే ప్రాణాపాయం జరిగి ఉండేది. ప్రభుత్వం సహాయం చేసి ఆదుకోవాలి. - నాగమ్మ, అత్తిగారిపల్లె కంప్యూటర్ నీళ్లలో మునిగింది మా కుమారుడి చదువు కోసం అప్పులు చేసి కంప్యూటర్ తెచ్చుకుంటే గాలివానతో రేకులు లేచి పోయి కంప్యూటర్, టీవీ కూడా నీళ్లలో మునిగిపోయాయి. ఇంట్లో వస్తువులన్నీ తడిచిపోయాయి. ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలి. - సుబ్బమ్మ, అత్తిగారిపల్లె -
గాలివాన బీభత్సం
♦ పలుచోట్ల పండ్లతోటలకు అపారనష్టం ♦ దెబ్బమీద దెబ్బతో కుంగిపోతున్న రైతన్న ♦ ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ సాక్షి, కడప : ప్రతిసారి ప్రకృతి ప్రకోపానికి అన్నదాత బలి అవుతూనే ఉన్నాడు. కరువుతో ఒకవైపు.. గాలివాన బీభత్సంతో మరోవైపు అన్నదాతకు అపార నష్టం సంభవించింది. నెలరోజుల వ్యవధిలోనే మరోమారు ప్రకృతి రైతన్నను దెబ్బ తీసింది. ప్రతిసారి ప్రకృతి చేస్తున్న గాయాలతో అన్నదాతకు కోలుకోలేని దెబ్బ తగులుతోంది. తాజాగా వీచిన గాలులు, వర్షం ధాటికి జిల్లాలో పండ్ల తోటలకు నష్టం వాటిల్లింది. వరుసగా రైతులకు దెబ్బమీద దెబ్బ తగులుతున్నా... ప్రభుత్వం నుంచి ఎటువంటి నష్టపరిహారం అందకపోవడంతో రైతన్న ఆందోళన చెందుతున్నాడు. గాలివానకు దెబ్బతిన్న పండ్ల తోటలు జిల్లాలో బుధవారం రాత్రి, గురువారం వర్షం, వీచిన గాలులకు పండ్ల తోటలకు అపార నష్టం వాటిల్లింది. ప్రధానంగా వీరబల్లి మండలంలో బాగా కాపు దశలో ఉన్న మామిడి చెట్లు కొన్నిచోట్ల నిలువునా కూలిపోయాయి. అలాగే గాలుల ధాటికి మామిడి చెట్ల నుంచి కాయలు విరివిగా రాలిపోయాయి. దీంతో ఒక్క వీరబల్లి మండలంలోనే రూ.10నుంచి 15లక్షల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రైల్వేకోడూరు నియోజకవర్గ పరిధిలోని ఓబులవారిపల్లె మండలంలో సుమారు వంద ఎకరాల్లో అరటి, మామిడి, ఆకు తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సుమారు రూ.50లక్షల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు భావిస్తున్నారు. ఇక పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలం పార్నపల్లెలో కూడా గాలి దెబ్బకు ఆకుతోటలు, అరటి చెట్లు కూలిపోయాయి. ప్రస్తుతం గెలల దశలో ఉన్న అరటి చెట్లు కూలిపోవడంతో భారీ నష్టం సంభవించింది. ఒక్క పార్నపల్లె, చుట్టు పక్కల ప్రాంతంలోనే రూ.50లక్షల మేర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఇక్కడే కాకుండా ఇంకా చాలాచోట్ల పండ్ల తోటలకు నష్టం వాటిల్లింది. ప్రభుత్వం ఆదుకోవాలి.. పండ్ల తోటలకు సంబంధించి జిల్లాలో భారీ నష్టం జరిగిన నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల కాలంలోనే ఒకట్రెండు సార్లు గాలి,వానల దెబ్బకు పండ్ల తోటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని.. మళ్లీ ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కావడంతో భారీగా నష్టపోయామని రైతులు పేర్కొంటున్నారు. కనీసం ప్రభుత్వమైనా స్పందించి వెంటనే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. -
గాలివాన బీభత్సం
♦ నాగర్‌కర్నూలు నియోజకవర్గంలో కురిసిన వర్షం ♦ కూలిన చెట్లు, ఒరిగిన స్తంభాలు, దెబ్బతిన్నతోటలు నాగర్‌కర్నూలు రూరల్/బిజినేపల్లి/వంగూరు : నియోజకవర్గంలో గురువారం సాయంత్రం కురిసిన వర్షం రైతులకు అపార నష్టాన్ని తెచ్చిపెట్టింది. నాగర్‌కర్నూలు మండలం అంతటి, పులిజాల, మల్కాపూర్, మంతటి గ్రామాలతోపాటు పట్టణంలో గంటకుపైగా గాలితో కూడిన వర్షం కురిసింది. గగ్గలపల్లిలో పాత ఇళ్లు, రేకుల ఇళ్లు కూలిపోయాయి. అలాగే రహదారివెంట ఉన్నచెట్లు, స్తంభాలు కూలిపడ్డాయి. అదేవిధంగా బిజినేపల్లి మండలంలో కురిసిన గాలీవాన బీభత్సానికి భారీగా ఆస్తినష్టం జరిగింది. మండల కేంద్రంలో పెద్ద ఎత్తున వీచిన ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రేకుల షెడ్లు ఎగిరిపోగా, మండల కేంద్రంలోని గోవుల చంద్రయ్యకు చెందిన ఇంటి రేకులు లేచిపోయి ఇంట్లో ఉన్నవారికి గాయాలయ్యాయి. పాలెం పారిశ్రామిక వాడ వద్ద విద్యుత్‌తీగలు తెగిపడడి గంటపాటు వాహనాలు నిలిచిపోయాయి. ఈ ట్రాఫిక్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా నిరీక్షించారు. పోలేపల్లి, ఖానాపూర్, గుడ్లనర్వ తదితర గ్రామాల్లో విద్యుత్ తీగలు తెగిపోయి అంధకారం నెలకొంది. అలాగే వంగూరు మండలంలో కురిసిన వడగండ్ల వర్షానికి మామిడి, బొప్పాయి తోటలకు నష్టం వాటిల్లింది. చిరుజల్లులతో ఊరట పాలమూరు : పగలంతా ఎండవేడిమి ఉండగా గురువారం సాయంత్రం తర్వాత ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన జనం కొంత ఊరట చెందారు. జిల్లా కేంద్రంతో సాయంత్ర ంవేళ కురిసిన చిరుజల్లులతో ఎండతాపం తగ్గి చల్లని గాలులు వీచాయి. జిల్లా కేంద్రంలోనే కాకుండా జడ్చర్ల, కొత్తకోట, దేవరకద్ర, వనపర్తి, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాల పరిధిలో పలుచోట్ల గాలులతో కూడిన చిరుజల్లులు కురిసి వాతావరణం కొంతమేర చల్లబడింది. వెల్దండ మండల పరిధిలోని బండోనిపల్లి గ్రామంలో అలిట్టి చెన్నయ్య అనే రైతుకు చెందిన పాడిఆవును పొలంలో కట్టేసి ఉంచగా పిడుగు పాటుకు మృతి చెందింది. అదేవిధంగా ఆయా గ్రామాల్లో విద్యుత్‌స్తంభాలు కూలిపోయి అంధకారం నెలకొంది. -
రేపల్లెలో గాలివాన బీభత్సం
నేల కొరిగిన చెట్లు, విద్యుత్ తీగలు విద్యుత్ సరఫరాకు అంతరాయం జిల్లాలో పలుచోట్ల వర్షాలు రేపల్లె : జిల్లాలో మంగళవారం సాయంత్రం పలుచోట్ల వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉన్నట్టుండి మేఘాలు ఆవరించి ఈదురుగాలులతో కూడిన వర్షపు జల్లులు కురిశాయి. గుంటూరు నగరంతోపాటు ప్రత్తిపాడు, పెదనందిపాడు, తెనాలి, రేపల్లె తదితర ప్రాంతాల్లో చెట్లు కూలి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంధకారం నెలకొంది. ముఖ్యంగా రేపల్లె పట్టణంలో గాలివాన బీభత్సం సృష్టించింది. వర్షానికి తోడు కొద్దిసేపు బలమైన గాలులు వీయడంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. ఉదయం నుంచి వడగాడ్పులు వీయగా సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మబ్బులు ఆవహించి క్షణాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. గాలివానకు పట్టణంలో పండ్ల మార్కెట్ సెంటర్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. విద్యుత్ తీగలు తెగిపోయాయి. అదే పలు చోట్ల షాపుల రేకులు లేచి దూరంగా పడ్డాయి. ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడటంతో బస్టాండ్ నుంచి మున్సిపల్ కార్యాలయం మీదుగా వాహనాల రాకపోకలను మళ్లించారు. నిలిచిన విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు ఆశాఖ అధికారులు, సిబ్బంది శ్రమిస్తున్నారు.