strugle
-
అడవి బిడ్డలు ఆగమాగం
సాక్షి, నాగర్‌కర్నూల్: నల్లమల అటవీ ప్రాంతంలో అరకొర వసతుల మధ్య జీవిస్తున్న చెంచులకు లాక్డౌన్ వల్ల మరిన్ని కష్టాలు వచ్చిపడ్డాయి. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో పేదలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సాయం చాలా మందికి అందలేదు. కొంత మంది చెంచుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అయినా తీసుకోలేని పరిస్థితి. మరికొందరు చెంచులకు అసలు ప్రభుత్వం నగదు సాయం అందజేసినట్లుగా కూడా తెలియకపోవడం గమనార్హం. లాక్డౌన్ ఉన్నందున వారిని అడవిలో నుంచి బయటికి రానివ్వడం లేదు. ప్రస్తుతం రేషన్ బియ్యం మాత్రమే తీసుకున్న చెంచులు, దాతలు అందజేస్తున్న నిత్యావసరాలతోనే జీవనం వెల్లదీస్తున్నారు. మరో పక్క వేసవి కాలం కావడంతో చెంచుపెంటల్లో వేసిన బోర్లు పూర్తిగా అడుగంటి పోయాయి. గ్రామీణ నీటిసరఫరా పథకం (ఆర్డబ్ల్యూఎస్) ద్వారా అధికారులు ఇప్పటివరకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసే వారు. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా ఆ సదుపాయం కూడా నిలిచిపోయింది. మరో పక్క వాగులు, నీటి చెలిమలు కూడా ఎండిపోయాయి. దీంతో నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని నల్లమల అడవుల్లో ఉన్న మల్లాపూర్, ఫర్హాబాద్, పుల్లాయిపల్లి, రాంపూర్, అప్పాపూర్, భౌరాపూర్ తదితర పెంటల్లో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల్లో ఉండి చదువుకుంటున్న పిల్లలంతా ఇప్పుడు ఇళ్లకు చేరుకున్నారు. నీటికొరత కారణంగా వ్యక్తిగత పరిశుభ్రత దూరమైంది. బట్టలు ఉతుక్కోవడానికి కూడా నీళ్లు దొరకని పరిస్థితి ఉంది. సరుకులకోసం ఇక్కట్లు.. మన్ననూర్‌కు వచ్చి చెంచులు తమకు కావాల్సిన నిత్యావసరాలను తీసుకెళ్లేవారు. కానీ.. ప్రస్తుతం రవాణా సౌకర్యాలు పూర్తిగా నిలిచి పోవడంతో చెంచు పెంటల నుంచి బయటికి వెళ్లలేని పరిస్థితి. గిరిజన కార్పొరేషన్ ద్వారా కొన్ని సరుకులు మాత్రమే దొరుకుతున్నాయి. ఉపాధిహామీ వల్ల వచ్చిన కూలీతో కొంత జీవనం గడిచేది. ప్రస్తుతం ఉపాధి పనులు కూడా కొన్ని చెంచుపెంటల్లో జరగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన బియ్యం మాత్రమే అందాయి. రూ.1,500 నగదు సాయం తమ ఖాతాల్లో జమ అయిందా.. లేదా అనే అవగాహన కూడా వారికి లేదు. చాలా మందికి బ్యాంకు ఖాతాలు కూడా లేవు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లాక్డౌన్ ఆర్థిక సాయం కూడా చెంచుల దరి చేరలేదు. నగదు సాయం ఇచ్చినట్లు తెలవదు.. పోయిన నెలలో రేషన్ బియ్యం మాత్రమే తీసుకున్నాం. ప్రభుత్వం నగదు సాయం ఇచ్చినట్లు మాకు తెలవదు. మన్ననూర్‌కు కూడా పోనిస్తలేరు. అధికారులు స్పందించి నగదు సాయం అందజేయాలి. – మహేశ్వరి, చెంచుమహిళ, భౌరాపూర్ ఇబ్బందులు లేకుండా చర్యలు.. లాక్డౌన్ వేళ చెంచులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. రేషన్‌బియ్యం, నిత్యావసరాలు అందజేస్తున్నాం. తాగునీటికి సం బంధించి 17 హామ్లెట్లకు బోర్లు మంజూరయ్యా యి. త్వరలో బోర్లు వేయిస్తాం. కొంతమందికి రేషన్‌కార్డులు లేవని గుర్తించాం. అలాంటి వారికి కూడా రేషన్ అందించేందుకు చర్యలు తీసుకుంటాం. ఉపాధి హామీ పనులు అన్ని పెంటల్లో జరుగుతున్నాయి. ఒకవేళ ఏ పెంటల్లోనైనా జరగకపోతే వెంటనే పని కల్పించాలని ఆదేశిస్తాం. –అఖిలేశ్‌రెడ్డి, ఐటీడీఏ పీఓ, మన్ననూర్, నాగర్‌కర్నూల్ జిల్లా -
విద్యారంగం అభివృద్ధికి ఉద్యమాలే మార్గం
కరీంనగర్‌ఎడ్యుకేషన్ : విద్యారంగం అభివృద్ధి చెంది అందరికీ సమానమైన విద్య అందాలంటే విద్యార్థి ఉద్యమాలే మార్గమని ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య అన్నారు. బుధవారం కళాభారతిలో ఎస్ఎఫ్ఐ రాష్ట్రస్థాయి విసృతస్థాయి సమావేశం సందర్భంగా ఏర్పాటు చేసిన సెమినార్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యారంగాన్ని ప్రభుత్వాలు పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాయని, విశ్వవిద్యాలయాల్లో కులం, మతం పేరిట రాజకీయాలు చేస్తూ విద్యార్థులను బలిగొంటున్నారని అన్నారు. బాలికలకూ మూత్రశాలలు లేని పరిస్థితి ఉండడం దౌర్భాగ్యమన్నారు. నేటి విద్యావిధానం ప్రశ్నకు సమాధానాలు అన్న తరహాలో కొనసాగుతోందని, ఇలాగైతే మేథావులు ఎలా తయారవుతారని ప్రశ్నించారు. రాష్ట్రం వస్తే నీళ్లు, నిధులు, చదువులు, కొలువులు వస్తాయని ఆశించిన యువతకు నిరాశే ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యారంగ సమస్యలపై పోరాడుతున్న విద్యార్థి, యువజన సంఘాలను లాఠీలు, తూటాలతో అణిచివేయడం అనైతికమన్నారు. విద్యార్థులు ఐక్యతచాటుతూ.. ఉద్యమించే హక్కులను కాపాడుకోవాలని అన్నారు. తనకు ఎస్ఎఫ్ఐతో 20 ఏళ్ల అనుబంధముందన్నారు. ఇలాంటి సెమినార్లు మరిన్ని నిర్వహించి విద్యార్థుల్లో చైతన్యంకలిగించాలని కోరారు. కార్యక్రమంలో ఆహ్వాన సంఘం అధ్యక్షుడు ముద్దసాని రమేశ్‌రెడ్డి, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేశ్, ఉపాధ్యక్షురాలు రజిని, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాదం తిరుపతి, బత్తిని సంతోష్, రజినీకాంత్, లక్ష్మణ్, రామారావు, తదితరులు పాల్గొన్నారు. -
ఆటో కార్మికుల సంక్షేమానికి పోరాటం
సిరిసిల్ల టౌన్ : ఆటో కార్మికుల సంక్షేమానికి తాము పోరాటం చేస్తామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మూషం రమేష్ అన్నారు. ఈనెల 17న ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆర్డీవో కార్యాలయం ముట్టడిస్తామన్నారు. ఆదివారం స్థానిక గాంధీచౌక్‌లో ముట్టడి ప్రచార కరపత్రాలు విడుదల చేసి మాట్లాడారు. కార్యక్రమంలో సీఐటీయూ డివిజన్ కార్యదర్శి పంతం రవి, నాయకులు ఇటిక్యాల అశోక్, పిట్ల బాలయ్య, పున్న దేవయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు.