'విద్యార్థి సంఘాల రాజకీయాలు కామన్'
హైదరాబాద్: వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో హెచ్సీయూలో నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థులకు త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ శుక్రవారం సంఘీభావం ప్రకటించారు. వారి న్యాయబద్ధమైన డిమాండ్లకు తన మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మాణిక్ సర్కార్ మాట్లాడుతూ యూనివర్సిటీ ప్రాంగణంలో విద్యార్థి సంఘాల రాజకీయాలు సర్వసాధారణమని, వాటిని పరిష్కరించడంలో వర్సిటీ యాజమాన్యం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరముందని పేర్కొన్నారు.
ఈ విషయంలో వర్సిటీ యాజమాన్యం పక్షపాతంలేకుండా సమన్యాయం పాటించాల్సిన అవసరముందన్నారు. వేముల రోహిత్ ఆత్మహత్యకు కారణమైన విద్యార్థులపై సస్పెన్షన్ వ్యవహారాన్ని యూనివర్సిటీలోనే పరిష్కరించి ఉంటే బాగుండదని ఆయన అభిప్రాయపడ్డారు. రోహిత్ ప్రతిభ గల విద్యార్థి అని, ప్రతిభావంతుడైన పౌరుణ్ణి ఈ సమాజం కోల్పోయిందని మాణిక్ సర్కార్ అన్నారు.