students awareness
-
కూటమి ప్రభుత్వంలో ఆగని అఘాయిత్యాలు
-
Pariksha Pe Charcha:‘తల్లిని చూసి నేర్చుకోండి.. లైఫ్‌లో షార్ట్ కట్స్ వద్దు’
PM Narendra Modi Pariksha Pe Charcha.. విద్యార్థులకు ఇది పరీక్షా సమయం.. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ.. పరీక్షా పే చర్య కార్యక్రమంలో పాల్గొని వారికి కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే, ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పేరెంట్స్, ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఈ క్రమంలో వారితో ముచ్చటించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. కాగా, ఢిల్లీలోని తాల్కటోరా ఇండోర్ స్టేడియం పరీక్షా పే చర్చకు వేదికైంది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ.. విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులతో సమయపాలన గురించి కీలకంగా చర్చించారు. ఇదే సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు మోదీ. రోజూ ఇంట్లో అమ్మను చూస్తే.. సమయపాలన ఎలా నిర్వహించుకోవాలో మనకు తెలుస్తుందన్నారు. విద్యార్థులు గెలుపు, ఓటమిని సమానంగా తీసుకోవాలని సూచించారు. ఎవరైతే పరీక్షల పట్ల శ్రద్ధ పెడతారో వారి శ్రమకు తగిన ఫలితం తప్పకుండా దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు కూడా ప్రధాని మోదీని పలు ప్రశ్నలు అడిగారు. మోదీజీ.. హార్డ్ వర్క్ లేక స్మార్ట్ వర్క్.. పరీక్షా పే చర్చ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. చర్చ మధ్యలో ఓ విద్యార్థి ప్రధాని మోదీని.. స్మార్ట్ వర్క్ లేక హార్డ్ వర్క్ ఏదీ ముఖ్యమైంది ప్రధాని సార్ అంటూ ప్రశ్నించాడు. దీనికి ప్రధాని సమాధానం ఇస్తూ.. ‘కొంతమంది చాలా అరుదుగా తెలివితో పనిచేస్తారు. మరికొందరు తెలివిగా కష్టపడతారు’ అన్ని అన్నారు. కొంత మంది విద్యార్థులు వారి క్రియేటివిటిని పరీక్షల్లో చీటింగ్ చేసేందుకు ఉపయోగిస్తున్నారు. ఆ క్రియేటివిటి మంచి మార్గానికి వాడుకుంటే మంచి విజయాన్ని అందుకుంటారని తెలిపారు. మనం జీవితంలో ఎన్నడూ షార్ట్‌కట్స్ వెతుక్కోకూడదు. ప్రతి ఒక్కరూ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. వారు అనుకున్న లక్ష్యాలను సాధించాలని కోరారు. ఇదే సమయంలో చదువు విషయంలో పిల్లలపై ఒత్తిడి పెంచవద్దని తల్లిడండ్రులు, ఉపాధ్యాయులకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. వారికి నచ్చిన రంగంలో పిల్లలను ప్రోత్సహించాలన్నారు. మానసిక ఉల్లాసం ఉంటేనే పిల్లలు బాగా చదువుతారన్నారని చెప్పారు. ప్రశాంతమైన మనసుతో పిల్లలు పరీక్షలు రాస్తేనే సత్ఫలితాలు వస్తాయని తెలిపారు. ఇక.. పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని తొలిసారి ప్రధాని మోదీ 2018 ఫిబ్రవరి 16న నిర్వహించారు. కాగా, ఈ ఏడాది పరీక్షా పే చర్చ కార్యక్రమంలో సుమారు 38.80 లక్షల మంది పాల్గొన్నారు. - విద్యార్థులు- 31.24 లక్షలు, - ఉపాధ్యాయులు - 5.60 లక్షలు, - తల్లిదండ్రులు - 1.95 లక్షల మంది ఉన్నారు. - గతేడాది పరీక్షా పే చర్చ కార్యక్రమంలో దాదాపు 15.7 లక్షల మంది పాల్గొన్నారు. అయితే, పరీక్షా పే చర్చ కార్యక్రమం ద్వారా ప్రధాని మోదీ విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని, ఒత్తిడిని పోగొట్టి, పలు అంశాలపై వారికి వచ్చిన సందేహాలపై సమాధానాలు ఇస్తుంటారు. విద్యార్థులను పరీక్షల కోసం సిద్ధం చేస్తుంటారు. WATCH | PM @narendramodi cites the example of INDIA & its Economic Growth trajectory. Suggests not to be affected & stressed about being average or extraordinary. Link: https://t.co/b9K0J2A3OH@PMOIndia@EduMinOfIndia#ParikshaPeCharcha#PPC2023 pic.twitter.com/gNDJoZBAGR — DD India (@DDIndialive) January 27, 2023 -
మార్కులే సర్వస్వం కాదు..
న్యూఢిల్లీ: విద్యార్థులకు పరీక్షలే ప్రధానం కాదనీ, తమ ఆసక్తులను బట్టి విద్యార్థులు ఎదగాలనీ, సాంకేతికతకు బానిసలు కారాదనీ ‘పరీక్షా పే చర్చా’కార్యక్రమంలో ప్రధాని మోదీ విద్యార్థులకు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా హాజరైన విద్యార్థులకు ఆయన కొన్ని సూచనలు చేశారు. తాత్కాలికంగా ఎదురయ్యే అవరోధాలను చూసి ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని ప్రధాని పిల్లలకు హితవు పలికారు. పరీక్షల సమయంలో ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలో, పరీక్షల్లో సమయపాలనకు ఏం చేయాలో కొన్ని చిట్కాలు చెప్పారు. క్రికెట్ నుంచి మొదలుకొని, చంద్రయాన్ –2 ప్రయోగం వరకు స్వీయ అనుభవాల నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠాలను ప్రస్తావించారు. ప్రతి ఒక్కరూ అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకోవాలనీ, అయితే అది మన జీవితాలను శాసించే స్థాయికి చేరకుండా జాగ్రత్తపడాలన్నారు. ‘అత్యంత వేగంగా సాంకేతికాభివృద్ధిలో మార్పులు సంభవిస్తున్నాయి. సాంకేతికతను చూసి భయపడాల్సిన పనిలేదు. శాస్త్ర సాంకేతిక విజ్ఙానం మన స్నేహితుల్లాంటిది. దాన్ని అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ∙కేవలం ఆ పరిజ్ఞానాన్ని అర్థం చేసుకోవడం ఒక్కటే సరిపోదు, దాన్ని అన్వయించడమే ప్రధానమైన విషయం. దాన్ని మనం అధీనంలో ఉంచుకోవాలి తప్ప దాని అధీనంలోకి మనం వెళ్లి సమయాన్ని వృథా చేసుకోరాదు’అంటూ విద్యార్థులకు హితబోధ చేశారు. నిత్యం ప్రయత్నిస్తూనే ఉండాలి జయాపజయాలతో నిమిత్తం లేకుండా నిత్యం ప్రయత్నించాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తూ ఆయన.. ‘చంద్రయాన్–2 ఆవిష్కరణ విజయవంతమవుతుందన్న గ్యారెంటీ లేకపోయినప్పటికీ లాంచింగ్ సమయంలో ఇస్రోలో ఉండాలనుకున్నా. ఆ అనుభవాన్ని ఎన్నటికీ మరిచిపోలేను’అని ఉదహరించారు. ఎలాంటి అననుకూల పరిస్థితుల్లోనైనా రాణించాలని సూచించారు. 2001లో భారత్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లో రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ ఏం చేశారు? అని ప్రశ్నించారు. మొత్తం మ్యాచ్‌నే మలుపుతిప్పిన విషయాన్ని ప్రధాని మోదీ గుర్తుచేశారు. పరీక్షల్లో మంచి మార్కులు రావడమొక్కటే సర్వస్వం కాదని గుర్తుంచుకోవాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు సైతం పిల్లల ఆకాంక్షలను అర్థం చేసుకోవాలని సూచించారు. పరీక్ష హాలులోకి ప్రవేశించేటప్పుడు ఒత్తిడిని విడనాడాలనీ, ఆత్మ విశ్వాసంతో ఉండి నేర్చుకున్న విషయాలపై దృష్టిసారించాలని ఉద్బోధించారు. దాదాపు 2,000 మంది విద్యార్థులు, అధ్యాపకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
వ్యసనాలకు దూరంగా ఉండాలి
బోట్‌క్లబ్ (కాకినాడ) : వ్యసనాలకు దూరంగా ఉండాలని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు, సాహిత్య అవార్డు గ్రహీత, నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ విద్యార్థులకు ఉద్బోధించారు. స్థానిక విద్యుత్‌నగర్‌లో శ్యామ్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో సోమవారం ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు హాజరవుతున్న విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. చదువుకొనేటప్పుడు మంచి వాతావరణం ఎంతో అవసరమని యండమూరి పేర్కొన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నెల్లాల్ల ముందు నుంచి ఎటువంటి మాంసాహారం తీసుకోకుండా ఉంటే మంచిదన్నారు. పరీక్షకు వెళ్లేటప్పుడు నేను తప్పకుండా ఈ పరీక్షలో పాసవుతానన్న దృఢసంకల్పంతో ఉండాలని సూచించారు. పరీక్ష హాల్లో ప్రశ్నపత్రం ఇచ్చిన వెంటనే సమాధానలు రాయడం మంచి పద్ధతి కాదని ఆయన అన్నారు. ఒక్కసారి ప్రశ్నపత్రాన్ని క్షుణ్ణంగా చదువుకొని ఆ తర్వాత ఆలోచించుకొని జవాబులు రాయాలన్నారు. ప్రస్తుతం విద్యార్థులు సెల్‌ఫోన్‌తో ఎక్కువ సేపు కాలక్షేపం చేస్తున్నారని, పరీక్షలకు సిద్ధమవుతున్న తరుణంలో దానికి దూరంగా ఉండాలన్నారు. శ్యామ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ గుంటూరు శ్యామ్ మాట్లాడుతూ విద్యార్థులు ఈ అవగాహన సదస్సును సద్వినియోగం చేసుకొని పరీక్షలు సక్రమంగా రాసి ఉద్యోగాలు సాధించాలని కోరారు. ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.