PM Narendra Modi Pariksha Pe Charcha.. విద్యార్థులకు ఇది పరీక్షా సమయం.. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ.. పరీక్షా పే చర్య కార్యక్రమంలో పాల్గొని వారికి కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే, ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పేరెంట్స్, ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఈ క్రమంలో వారితో ముచ్చటించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు.
కాగా, ఢిల్లీలోని తాల్కటోరా ఇండోర్ స్టేడియం పరీక్షా పే చర్చకు వేదికైంది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ.. విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులతో సమయపాలన గురించి కీలకంగా చర్చించారు. ఇదే సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు మోదీ. రోజూ ఇంట్లో అమ్మను చూస్తే.. సమయపాలన ఎలా నిర్వహించుకోవాలో మనకు తెలుస్తుందన్నారు. విద్యార్థులు గెలుపు, ఓటమిని సమానంగా తీసుకోవాలని సూచించారు. ఎవరైతే పరీక్షల పట్ల శ్రద్ధ పెడతారో వారి శ్రమకు తగిన ఫలితం తప్పకుండా దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు కూడా ప్రధాని మోదీని పలు ప్రశ్నలు అడిగారు.
మోదీజీ.. హార్డ్ వర్క్ లేక స్మార్ట్ వర్క్..
పరీక్షా పే చర్చ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. చర్చ మధ్యలో ఓ విద్యార్థి ప్రధాని మోదీని.. స్మార్ట్ వర్క్ లేక హార్డ్ వర్క్ ఏదీ ముఖ్యమైంది ప్రధాని సార్ అంటూ ప్రశ్నించాడు. దీనికి ప్రధాని సమాధానం ఇస్తూ.. ‘కొంతమంది చాలా అరుదుగా తెలివితో పనిచేస్తారు. మరికొందరు తెలివిగా కష్టపడతారు’ అన్ని అన్నారు. కొంత మంది విద్యార్థులు వారి క్రియేటివిటిని పరీక్షల్లో చీటింగ్ చేసేందుకు ఉపయోగిస్తున్నారు. ఆ క్రియేటివిటి మంచి మార్గానికి వాడుకుంటే మంచి విజయాన్ని అందుకుంటారని తెలిపారు. మనం జీవితంలో ఎన్నడూ షార్ట్‌కట్స్ వెతుక్కోకూడదు. ప్రతి ఒక్కరూ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. వారు అనుకున్న లక్ష్యాలను సాధించాలని కోరారు.
ఇదే సమయంలో చదువు విషయంలో పిల్లలపై ఒత్తిడి పెంచవద్దని తల్లిడండ్రులు, ఉపాధ్యాయులకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. వారికి నచ్చిన రంగంలో పిల్లలను ప్రోత్సహించాలన్నారు. మానసిక ఉల్లాసం ఉంటేనే పిల్లలు బాగా చదువుతారన్నారని చెప్పారు. ప్రశాంతమైన మనసుతో పిల్లలు పరీక్షలు రాస్తేనే సత్ఫలితాలు వస్తాయని తెలిపారు. ఇక.. పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని తొలిసారి ప్రధాని మోదీ 2018 ఫిబ్రవరి 16న నిర్వహించారు. కాగా, ఈ ఏడాది పరీక్షా పే చర్చ కార్యక్రమంలో సుమారు 38.80 లక్షల మంది పాల్గొన్నారు.
- విద్యార్థులు- 31.24 లక్షలు,
- ఉపాధ్యాయులు - 5.60 లక్షలు,
- తల్లిదండ్రులు - 1.95 లక్షల మంది ఉన్నారు.
- గతేడాది పరీక్షా పే చర్చ కార్యక్రమంలో దాదాపు 15.7 లక్షల మంది పాల్గొన్నారు.
అయితే, పరీక్షా పే చర్చ కార్యక్రమం ద్వారా ప్రధాని మోదీ విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని, ఒత్తిడిని పోగొట్టి, పలు అంశాలపై వారికి వచ్చిన సందేహాలపై సమాధానాలు ఇస్తుంటారు. విద్యార్థులను పరీక్షల కోసం సిద్ధం చేస్తుంటారు.
WATCH | PM @narendramodi cites the example of INDIA & its Economic Growth trajectory. Suggests not to be affected & stressed about being average or extraordinary.
— DD India (@DDIndialive) January 27, 2023
Link: https://t.co/b9K0J2A3OH@PMOIndia@EduMinOfIndia#ParikshaPeCharcha#PPC2023 pic.twitter.com/gNDJoZBAGR
Comments
Please login to add a commentAdd a comment