studios
-
'గుడ్ లక్ స్టూడియోస్'ని ప్రారంభించిన నటుడు సూర్య (ఫొటోలు)
-
Amazon layoffs: నంబర్ గేమ్ అంతే..రేపటితో తొమ్మిదేళ్లు..ఇంతలోనే!
సాక్షి, ముంబై: టెక్ దిగ్గజం అమెజాన్‌లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. తాజాగా 100మందిని తొలగించనుంది. అమెజాన్ తన వ్యాపారాలను క్రమ బద్ధీకరించుకునే ప్రయత్నంలో భాగంగా అమెజాన్ స్టూడియోస్, ప్రైమ్ వీడియో విభాగంలో ఈ ఉద్యోగాలను తొలగిస్తోంది. డివిజన్లోని 7వేల మంది ఉద్యోగులలో 1 శాతం మందిపై ప్రభావం చూపనుందని తెలుస్తోంది. (ఐటీ కంపెనీ భారీ గిఫ్ట్స్: సంబరాల్లో ఉద్యోగులు) ఆర్థిక సంక్షోభం ఆందోళనల నేపథ్యంలో టెక్ అండ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు ఖర్చు తగ్గించే చర్యల్లో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ క్రమంలోనే అమెజాన్ తాజా నిర్ణయం తీసుకుంది. క్లౌడ్ సర్వీసెస్ డివిజన్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) విభాగంలో అమెజాన్ తొలగింపుల తాజా రౌండ్ తొలగింపులు షురూ అయ్యాయి. అమెరికా, కోస్టారికా కెనడాలోని ఉద్యోగులకు వారి ఉద్యోగ తొలగింపులకు సంబంధించి సమాచారం అందించింది. (Vanisha Mittal Amit Bhatia Love Story: వనీషా...అమిత్ లవ్ స్టోరీ తెలుసా? ఈ లవ్ బర్డ్స్ పెళ్లి ఒక రికార్డ్ ) జాబ్-సెర్చ్ ప్లాట్‌ఫారమ్ లింక్డ్ఇన్లో ప్రభావిత ఉద్యోగి భావోద్వేగ పోస్ట్ షేర్ చేశారు.అమెజాన్లోవెబ్ సర్వీసెస్‌లో 9 ఏళ్ల వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి కేవలం ఒక్క రోజు ముందు అకస్మాత్తుగా తనకు కంపెనీ ఉద్వాసన పలికిందని ఆమె వాపోయారు. ఈ మేరకు కంపెనీకి ఒక వీడ్కోలు సందేశాన్ని పోస్ట్ చేశారు. సామూహిక తొలగింపుల మధ్య ఇదొక నంబరు గేమ్..ఇపుడు నా టైం వచ్చిందంతే..నో హార్డ్ ఫీలింగ్స్ అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఇన్ని రోజులు కంపెనీలో ఎదుగుదలకు ఇచ్చిన అవకాశాలకు కృతజ్క్షతలు తెలిపారు. -
కింగ్డమ్ ఆఫ్ కిడ్స్.. హైదరాబాద్‌లో కొత్త స్టూడియో
కాస్మోపాలిటన్ సిటీ హైదరాబాద్ ప్రత్యేకతలకు నిలయంగా మారుతోంది. కొరియన్ డ్రామాలకు, బీటీఎస్ బ్యాండ్ ఫ్యాన్స్‌ని బేస్‌గా చేసుకుని కొరియన్ రెస్టారెంట్ అందుబాటులోకి వచ్చింది.. ఈ పరంపరలో కేవలం పిల్లల ఫోటోగ్రఫీ కోసమే స్పెషల్ స్టూడియో వెలిసింది. కలర్‌ఫుల్ లోకేషన్స్ నగరంలోని శామిర్‌పేటలో కింగ్డమ్ ఆఫ్ కిడ్స్ పేరుతో ప్రత్యేకమైన స్టూడియోని ప్రారంభించారు. పిల్లల అభిరుచులకు తగ్గట్టు 40కి పైగా బ్యాక్‌డ్రాప్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇండోర్, అవుట్డోర్లలో విభిన్నమైన లోకెషన్లు సైతం రెడీ చేశారు. రకరకాల మొక్కలు, రంగురంగుల పూలతో కలర్ఫుల్గా స్టూడియోను తీర్చిదిద్దారు. పిల్లలతో రండి పిల్లల ఫోటోలను ఇంట్లో తీసుకుని వాటిని గ్రాఫిక్స్‌లో డిజైన్ చేయడం కాకుండా లైవ్ లోకేషన్లలోనే తీసుకునే వెసులుబాటు ఇక్కడుంది. నగరంలో పిల్లల కోసం ప్రత్యేకంగా స్టూడియో లేదనే లోటును గమనించి కింగ్డమ్ ఆఫ్ కిడ్స్‌ని అందుబాటులోకి తెచ్చినట్టు దీని యజమాని రాహుల్ ఆనంద్ తెలిపారు. మీ పిల్లలతో స్టూడియోకి రండి అందమైన ఫోటోలతో ఇంటికి వెళ్లండి అంటూ ఆయన చెబుతున్నారు. ప్యాకేజీలు ఇలా ఈ స్టూడియోలో నాలుగు గంటల షూట్‌కి రూ. 15,000లు ఆరు గంటల షూట్‌కి రూ.20,000ల వంతున పాపులర్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. క్యాండిడ్ ఫోటోలు తీయడంలో నేర్పరులైన డెడికేటెడ్ ఫోటోగ్రాఫర్ లభిస్తారు. పదిహేను రోజుల ముందుగానే స్లాట్‌ను బుక్ చేసుకునే అవకాశం కూడా ఉంది. చదవండి: హైదరాబాద్‌లో ఇవి కూడానా? ఓపెన్ కొరియన్ మెనూ! -
నన్ను బెదిరిస్తున్నారు : ఇళయరాజా
సాక్షి,చెన్నై: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా-ప్రసాద్ స్టూడియో వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఎల్వీ ప్రసాద్ మనవడు సాయి ప్రసాద్‌పై లయ రాజా తాజాగా మరో కేసు నమోదు చేశారు. సాయి, అతని మనుషులు తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని, తద్వారా తన స్టూడియోను ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఇళయరాజా ఆరోపించారు. ఈ మేరకు ఆయన మేనేజర్ జాఫర్ ఫిర్యాదు దాఖలు చేశారు. ('ఇళయరాజా కేసును రెండు వారాల్లో ముగించండి') ప్రసాద్ స్టూడియోలోని తన సూట్లోకి ప్రవేశించి మరీ సంగీత వాయిద్యాలు, నోట్లు, ఇతర పరికరాలను ధ్వంసం చేశారని చెన్నై కమిషనర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో ఇళయరాజా పేర్కొన్నారు. అంతేకాదు తన విలువైన వస్తువులను అధిక మొత్తానికి విక్రయించుకున్నారని కూడా ఆరోపించారు. సాయి, అతని అనుచరులపై శాశ్వత ఆంక్షలు విధించాలని కోరుతూ సిటీ సివిల్ కోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసినట్లు వివరించారు. ఈ కేసు పెండింగ్‌లో ఉండగానే తనపై దౌర్జన్యం చేసి, బలవంతంగా స్టూడియోను లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారన్నారు. అందుకే స్టూడియోలో తన కార్యక్రమాలకు అడ్డొస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో సాయి ప్రసాద్, అతని అనుచరులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఇళయరాజా డిమాండ్ చేశారు. కాగా చెన్నైలోని ప్రసాద్ స్టూడియోస్ స్థాపకుడు ఎల్వీ ప్రసాద్, ఇళయరాజాపై గౌరవంతో ప్రత్యేక గది ఉన్న స్టూడియో స్థలాన్ని బహుమతిగా ఇచ్చారు. ఇక్కడున్న రికార్డింగ్ స్టూడియోలోనే గత 40 సంవత్సరాలకు పైగా ఆయన తన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే ఎల్వీ ప్రసాద్ కుమారుడు రమేష్ ప్రసాద్ ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరం చెప్పకపోగా, మనవడు సాయి ప్రసాద్ మాత్రం స్టూడియోను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. Veteran music composer #Ilaiyaraaja filed a complaint against Sai Prasad for tampering his musical instruments, notes and valuables by unlawfully entering into his recording studio #PrasadStudios pic.twitter.com/1LyAntffNL — Rajasekar (@sekartweets) July 31, 2020 -
స్టూడియో అపార్ట్మెంట్ రూ.11.20 లక్షలు!
సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో, అందుబాటు ధరల్లో నివాస, లే అవుట్ ప్రాజెక్ట్‌లను నిర్మించే శ్రీ శ్రీ గృహ నిర్మాణ్ ఇండియా.. ఎయిరో సిటీ పేరిట సుందరమైన ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. ఇబ్రహీంపట్నం మంగల్‌పల్లిలో 6 ఎకరాల్లో నిర్మిస్తున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌ను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేసి కొనుగోలుదారులకు అందిస్తామని కంపెనీ ఎండీ భూపతి రాజు ‘సాక్షి రియల్టీ’కి తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తి వివరాలు... ►6 లక్షల చ.అ. బిల్టప్ ఏరియాలో 620 గృహాలను నిర్మిస్తున్నాం. 10 బ్లాక్‌లు. ఒక్కో బ్లాక్ సెల్లార్, స్టిల్ట్ ప్లస్ 7 అంతస్తుల్లో ఉంటుంది. 350 చ.అ. స్టూడియో అపార్ట్మెంట్స్, 750 చ.అ.లలో సింగిల్ బెడ్ రూమ్, 1000 చ.అ.ల్లో 2 బీహెచ్‌కే, 1450 చ.అ.ల్లో 3 బీహెచ్‌కే ఫ్లాట్లుంటాయి. ధర చ.అ.కు రూ.3500. సింగిల్ బెడ్ రూమ్ ధర రూ.31.25 లక్షలు, స్టూడియో అపార్ట్మెంట్ ధర సౌకర్యాలతో (పార్కింగ్ రూ.2.50 లక్షలు, వసతులకు రూ.2.50 లక్షలు) రూ.16.20 లక్షలు. ► 2016లో ఎయిరో సిటీ నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. ఈ నెల ముగింపు నాటికి ప్రాజెక్ట్ పూర్తవుతుంది. 50, 40, 30 ఫీట్ల రోడ్లు, 24 గంటల పాటు సెక్యూరిటీ, ఇంటర్‌కామ్ ఫెసిలిటీ, పవర్ బ్యాకప్ జనరేటర్ ఉంటాయి. సగానికి పైగా ఫ్లాట్లు అమ్ముడుపోయాయి. ఈ ప్రాజెక్ట్‌కు ఎదురుగానే 34 ఎకరాల్లో ఎయిరో పార్క్ సౌత్ పేరిట లే అవుట్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తున్నాం. రోజూ 25 వేల మంది ఉద్యోగులు.. ►తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆదిభట్ల, పటేల్‌గూడ, రావిర్యాల, కొంగర ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఐటీ, ఎయిరో స్పేస్ కంపెనీలతో పాటూ కొంగరలో కలెక్టరాఫీసు ఏర్పాటుతో స్థిరమైన అభివృద్ధి జరుగుతుంది. స్థానికంగా పెద్దగా గృహ అవసరాలు లేకపోవటంతో ప్రతి రోజు టీసీఎస్, కాగ్నిజెంట్, టాటా అడ్వాన్స్, బీడీఎల్, ఆక్టోపస్ వంటి కంపెనీలకు, స్థానిక ప్రభుత్వ కార్యాలయాలకు 25 వేల మంది హైదరాబాద్ నుంచి ప్రయాణం చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో గృహాలకు డిమాండ్ విపరీతంగా ఉంది. ►18 వేల చ.అ.ల్లో క్లబ్ హౌస్ ఉంటుంది. ల్యాండ్ స్కేపింగ్, స్విమ్మింగ్ పూల్, జిమ్, మెడిటేషన్, పార్టీ హాల్స్, మినీ థియేటర్, షటిల్ కోర్టు, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, జాగింగ్ ట్రాక్, రెస్టారెంట్, సూపర్ మార్కెట్, విజిటర్స్ లాంజ్ వంటి ఏర్పాట్లుంటాయి. ప్రాజెక్ట్ ఆవరణలో అపోలో ఆసుపత్రి క్లినిక్‌ను ఏర్పాటు చేసింది. 24 గంటలు డాక్టర్, నర్సు అందుబాటులో ఉంటారు. -
ముంబై సినీ విస్టా స్టూడియోలో మంటలు
-
జిల్లాలో స్టూడియోలు నిర్మిస్తాం
– యువ పారిశ్రామిక వేత్త టీజీ భరత్ – నగరంలో సత్యా గ్యాంగ్ సినిమా షూటింగ్ కర్నూలు, సీక్యాంప్ : రాయలసీమ కళలకు పుట్టినిల్లు అని ఇక్కడి కళాకారుల్లో మరింత నైపుణాని్న వెలికితీయడం కోసం చిన్న స్టూడియోలు నిర్మిస్తామని యువ పారిశ్రామిక వేత్త టీజీభరత్ చెప్పారు. మంగళవారం నగరంలో సత్యాగ్యాంగ్ సినిమా షూటింగ్‌ను ఆయన క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ ఈ చిత్రంలో నటీనటులందరూ రాయలసీమ వారేనన్నారు. అనంతరం చిత్ర దర్శకుడు నిమ్మల ప్రభాస్ మాట్లాడుతూ జిల్లాలో సినిమా షూటింగ్‌లు నిర్వహించుకునేందుకు మంచి ప్రదేశాలున్నాయన్నారు. సత్యాగ్యాంగ్లో ఏఎస్పీగా హీరో సుమన్ నటిస్తున్నారని వెల్లడించారు. సినిమాషూటింగ్ ఉదయం బృందావన్ షాపింగ్‌మాల్‌లో సాయంత్రం మౌర్యఇన్‌లో జరిగింది. హీరోలు ప్రత్యుష్, సాత్విక్, కిషన్ కన్నయ్య, హీరోయిన్లు హస్విత,అక్షిత పాల్గొన్నారు. -
వెలుగులు చిమ్మిన వీధులు...నేడు ఖాళీ