
కాస్మోపాలిటన్ సిటీ హైదరాబాద్ ప్రత్యేకతలకు నిలయంగా మారుతోంది. కొరియన్ డ్రామాలకు, బీటీఎస్ బ్యాండ్ ఫ్యాన్స్‌ని బేస్‌గా చేసుకుని కొరియన్ రెస్టారెంట్ అందుబాటులోకి వచ్చింది.. ఈ పరంపరలో కేవలం పిల్లల ఫోటోగ్రఫీ కోసమే స్పెషల్ స్టూడియో వెలిసింది.
కలర్‌ఫుల్ లోకేషన్స్
నగరంలోని శామిర్‌పేటలో కింగ్‌డమ్ ఆఫ్ కిడ్స్ పేరుతో ప్రత్యేకమైన స్టూడియోని ప్రారంభించారు. పిల్లల అభిరుచులకు తగ్గట్టు 40కి పైగా బ్యాక్‌డ్రాప్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇండోర్, అవుట్‌డోర్‌లలో విభిన్నమైన లోకెషన్లు సైతం రెడీ చేశారు. రకరకాల మొక్కలు, రంగురంగుల పూలతో కలర్‌ఫుల్‌గా స్టూడియోను తీర్చిదిద్దారు.
పిల్లలతో రండి
పిల్లల ఫోటోలను ఇంట్లో తీసుకుని వాటిని గ్రాఫిక్స్‌లో డిజైన్ చేయడం కాకుండా లైవ్ లోకేషన్లలోనే తీసుకునే వెసులుబాటు ఇక్కడుంది. నగరంలో పిల్లల కోసం ప్రత్యేకంగా స్టూడియో లేదనే లోటును గమనించి కింగ్‌డమ్ ఆఫ్ కిడ్స్‌ని అందుబాటులోకి తెచ్చినట్టు దీని యజమాని రాహుల్ ఆనంద్ తెలిపారు. మీ పిల్లలతో స్టూడియోకి రండి అందమైన ఫోటోలతో ఇంటికి వెళ్లండి అంటూ ఆయన చెబుతున్నారు.
ప్యాకేజీలు ఇలా
ఈ స్టూడియోలో నాలుగు గంటల షూట్‌కి రూ. 15,000లు ఆరు గంటల షూట్‌కి రూ.20,000ల వంతున పాపులర్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. క్యాండిడ్ ఫోటోలు తీయడంలో నేర్పరులైన డెడికేటెడ్ ఫోటోగ్రాఫర్ లభిస్తారు. పదిహేను రోజుల ముందుగానే స్లాట్‌ను బుక్ చేసుకునే అవకాశం కూడా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment