జిల్లాలో స్టూడియోలు నిర్మిస్తాం
– యువ పారిశ్రామిక వేత్త టీజీ భరత్
– నగరంలో సత్యా గ్యాంగ్ సినిమా షూటింగ్
కర్నూలు, సీక్యాంప్ : రాయలసీమ కళలకు పుట్టినిల్లు అని ఇక్కడి కళాకారుల్లో మరింత నైపుణాని్న వెలికితీయడం కోసం చిన్న స్టూడియోలు నిర్మిస్తామని యువ పారిశ్రామిక వేత్త టీజీభరత్ చెప్పారు. మంగళవారం నగరంలో సత్యాగ్యాంగ్ సినిమా షూటింగ్‌ను ఆయన క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ ఈ చిత్రంలో నటీనటులందరూ రాయలసీమ వారేనన్నారు. అనంతరం చిత్ర దర్శకుడు నిమ్మల ప్రభాస్ మాట్లాడుతూ జిల్లాలో సినిమా షూటింగ్‌లు నిర్వహించుకునేందుకు మంచి ప్రదేశాలున్నాయన్నారు. సత్యాగ్యాంగ్‌లో ఏఎస్‌పీగా హీరో సుమన్ నటిస్తున్నారని వెల్లడించారు. సినిమాషూటింగ్ ఉదయం బృందావన్ షాపింగ్‌మాల్‌లో సాయంత్రం మౌర్యఇన్‌లో జరిగింది. హీరోలు ప్రత్యుష్, సాత్విక్, కిషన్ కన్నయ్య, హీరోయిన్లు హస్విత,అక్షిత పాల్గొన్నారు.