
సాక్షి, కర్నూలు: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కర్నూలు పర్యటన ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా బుధవారం కర్నూలు కలెక‍్టరేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా రాయలసీమ వాసుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడారంటూ పవన్ కల్యాణ్ పర్యటనను అడ్డుకునేందుకు విద్యార్థి జేఏసీ యత్నించింది. పవన్ రాయలసీమ ద్రోహి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ...పవన్ గోబ్యాక్ అంటూ విద్యార్థి జేఏసీ నేతలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థి జేఏసీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ‘మమ్మల్ని అరెస్ట్ చేయడం కాదు... పవన్‌ను అరెస్ట్ చేయాలి’ అంటూ విద్యార్థి జేఏసీ డిమాండ్ చేసింది. (అప్పుడే పవన్ సీమలో అడుగు పెట్టాలి..)