study reveals
-
రొమ్ము క్యాన్సర్ చికిత్సకు మానుకా తేనె.. ఎలా పని చేస్తుందంటే!
తేనె అనేది ప్రకృతిలో ఓ అద్భుతం. తేనెటీగలు తేనెను సేకరించి… దాచుకోవడం, దాన్ని ప్రాసెస్ చేసి… ప్యాక్ చేసి మనకు ఇవ్వడం… ఆ శుద్ధమైన తేనెతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందుతున్నాం. మన చర్మ కణాల్ని తేనె కాపాడుతోంది. జుట్టుకు కూడా రక్షణ కల్పిస్తోంది.తేనెలో చాలా రకాలు ఉంటాయి.. వీటిలో మానుకా తేనె చాలా ప్రత్యేకమైనది. దీనిని ఆస్ట్రేలియా న్యూజిలాండ్‌లలో తేనెటీగలు తయారు చేస్తాయి. మనుక చెట్టు మకరందంతో తేనెటీగలు ఈ తేనెను ఉత్పత్తి చేస్తాయి. ఈ చెట్టు సంవత్సరంలో 2 నుంచి 6 వారాలు మాత్రమే పువ్వులు పూస్తుంది. ఇది చాలా అరుదైన తేనెగా చెబుతున్నారు. మామూలు తేనే కన్నా దీని తీపి కాస్త తక్కువగా ఉంటుంది. మామూలు తేనేలాగే మానుకా తేనేను కూడా రోజూ వాడొచ్చు. మానుకా తేనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్, హీలింగ్ గుణాలు ఉన్నాయని అధికంగా ఉంటాయి. ప్రీ రాడికల్స్ వల్ల శరీరం దెబ్బతినకుండా ఇది కాపాడుతుంది. దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా కాపాడుతుంది. మానుకా తేనెలోని యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలు చర్మ మీద అయిన గాయాలను తగ్గించడంతో సాయపడతాయి. తాజాగా మానుకా తేనే ఎలాంటి దుష్ప్రభావాలను కలిగించకుండా రొమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదలను 84% తగ్గించినట్లు ఓ అధ్యయనం ద్వారా వెల్లడైంది. ఈ పరిశోధనలు సహజమైన, నాన్-టాక్సిక్ సప్లిమెంటరీ యాంటీకాన్సర్ చికిత్సను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడనున్నాయి.ఇందులోని పోషకాహారం', 'ఫార్మాస్యూటికల్స్' కలయిక పోషక విలువలను అందించడమే కాకుండా, ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లక్షణాలను కలిగి ఉంటాయి. మానుకా తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్, హీలింగ్ గుణాలు అధికంగా ఉంటాయి. తాజాగా యూసీఎల్ఏ పరిశోధకుల ప్రాథమిక అధ్యయనాల ద్వారా ఈ న్యూట్రాస్యూటికల్ రొమ్ము క్యాన్సర్ నివారణ, చికిత్సలో సహాయపడతాయని కనుగొన్నారు.ఈ పరిశోధనలు సాంప్రదాయ కీమోథెరపీకి ప్రత్యామ్నాయ చికిత్సగా ఉపయోగపడతాయని పరిశోధకులు వెల్లడించారు. క్యాన్సర్ చికిత్సలో సహజ సమ్మేళనాల ప్రయోజనాలను పూర్తిగా అర్థం చేసుకోవడానికి మరింత పరిశోధన అవసరం అయినప్పటికీ, ఈ అధ్యయనం మరింత అన్వేషణకు బలమైన పునాదిని ఏర్పరుస్తుందని చెప్పారు.ఈస్ట్రోజెన్ రిసెప్టర్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వారిలో 60% నుంచి 70% వరకు- రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న వారే ఉన్నారు. క్యాన్సర్ కణాలలో గ్రాహకాలు ఉంటాయి. ఇవి ఈస్ట్రోజెన్ హార్మోన్‌ను వృద్ధి చేయడానికి ఉపయోగించుకునేలా చేస్తాయి. యాంటీ-ఈస్ట్రోజెన్ లేదా ఎండోక్రైన్తో చికిత్స చాలా మంది రోగులలో కణితి పెరుగుదలను నిరోధించవచ్చు.పరిశోధకులు మొదట తమ ప్రయోగంలో ఈఆర్ పాజిటివ్, ట్రిపుల్-నెగటివ్ రొమ్ము క్యాన్సర్ కణాలను పెంచారు, ఇది రొమ్ము క్యాన్సర్ అత్యంత సాధారణ రకాల్లో ఒకటి. మనుకా తేనె లేదాడీహైడ్రేటెడ్ మనుకా తేనె పొడితో చికిత్స చేసిన ఈఆర్ పాజిటివ్ కణాలలో.. నియంత్రణలతో చికిత్స చేయబడిన వాటితో పోలిస్తే క్యాన్సర్ కణాల విస్తరణ గణనీయమైన మోతాదు-ఆధారిత నిరోధాన్ని వారు గమనించారు. ట్రిపుల్-నెగటివ్ కణాల కోసం మనుక తేనెను టామోక్సిఫెన్తో కలిపినప్పుడు యాంటిట్యూమర్ ప్రభావం మరింత తక్కువగా ఉంటుంది.కణాలను మరింత నిశితంగా పరిశీలిస్తే, తేనె రక్తంలోని ఈస్ట్రోజెన్ స్థాయిలు, కణితుల్లో ఈస్ట్రోజెన్ గ్రాహకాలలో తగ్గుదలకు కారణమైందని తేలింది. కణితి కణాలలో అపోప్టోసిస్ లేదా సెల్ డెత్‌ను ప్రేరేపించడం ద్వారా క్యాన్సర్ పురోగతిని మరింత దెబ్బతీస్తుందని పరిశోధకులు కనుగొన్నారు.మనుకా తేనెను జంతు నమూనాలలో పరిశోధకులు పరీక్షించారు. మానవ ఈఆర్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ కణాలతో అమర్చబడి కణితిని అభివృద్ధి చేసిన ఎలుకలకు మనుకా తేనెను నోటి ద్వారా అందించారు. తేనెతో చికిత్స చేయబడిన ఎలుకలు నియంత్రణలతో పోలిస్తే కణితి పెరుగుదలను గణనీయంగా అణిచివేసాయి. మొత్తంమీద ఇది ఆరోగ్యకరమైన కణాలను ప్రభావితం చేయకుండా మానవ రొమ్ము క్యాన్సర్ కణితి పెరుగుదల, పురోగతిని 84% నిరోధించింది. -
బీ అలెర్ట్! చుట్టుపక్కల పరిస్థితుల్ని మర్చిపోయి ఫోన్లో మునిగిపోతున్నారా..
‘‘చేతిలో ఫోన్ పెడితే చాలు మనం పెట్టిందంతా వద్దనకుండా మా బుడ్డోడు తినేస్తాడు’’ ‘‘మేమిద్దరం మూవీ చూడాలనుకుంటే బుజ్జిదాని చేతికి ఫోనిస్తాం. అది అల్లరి చేయకుండా యూట్యూబ్‌లో కార్టూన్ చానెల్ తానే సెలక్ట్ చేసేసుకుని మరీ చూస్తుంది తెలుసా?’’ఇలాంటి మాటలు వినపడని ఇల్లూ, అనని ఇల్లాళ్లూ సిటీలో కనపడడం అరుదై పోయింది. అయితే తమ పనులు సులభంగా కావడానికి పెద్దలు ఉపయోగించే ఈ రకమైన చిట్కాలు పసిపిల్లల భవిష్యత్తుపై దుష్ప్రభావం చూపించనున్నాయని యువతలో కనపడుతున్న తీవ్రమైన ఫబ్బింగ్ స్థితి పిల్లల్లోనూ మొదలవుతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చుట్టుపక్కల పరిస్థితుల్ని మర్చిపోయేంతగా ఫోన్లో మునిగిపోవడమే ‘‘ఫబ్బింగ్’’ గా వ్యవహరిస్తున్నారు. 2012లో ఫోన్, స్నబ్బింగ్ పదాల్ని మేళవించి ఓ ఆ్రస్టేలియా యాడ్స్ సంస్థ దీన్ని సృష్టించింది. ఆ తర్వాత ఇది వాడుక పదంగా మారిపోయింది. గతంలో ఈ ఫబ్బింగ్ అనే స్థితి నగరంలోని సగానికి పైగా యువకుల్లో కనిపిస్తోందని ‘కన్సీక్వెన్స్ ఆఫ్ ఫబ్బింగ్ ఆన్ సైకలాజికల్ డిస్ట్రెస్ అమాంగ్ ది హైదరాబాద్’ అనే అధ్యయనం వెల్లడించింది. అదే పరిస్థితికి చిన్నారులు కూడా చేరేలా ఉన్నట్లు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. మహమ్మారితో మరింతగా... పసివయసును దృష్టి మరల్చడానికి గతంలో అరకొరగా కనిపించిన ఫోన్ చిట్కా...కరోనా నేపథ్యంలో నగరంలో మరింతగా పెరిగిందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్, పిల్లలకు స్కూల్స్ లేకపోవడం..తల్లులకు పనుల భారం పెరగ డం..ఇవన్నీ కలిపి పిల్లలకు చేజేతులా ఫోన్‌ను అలవాటు చేసే దిశగా పెద్దల్ని మరింతగా ప్రేరేపించాయి. ఏడిచే పిల్లల్ని ఊరుకోబెట్టడం, తిండి తినకుండా మారాం చేసే పిల్లల్ని ఏమార్చి తినిపించడం, అల్లరి మానిపించడం...ఇలా అనేక అవసరాలకు ఫోన్ ఏకైక సులభ పరిష్కారంగా అవతరించడం పలు రకాల సమస్యలు తెచ్చిపెడుతుందని వైద్యులు అంటున్నారు. నేటి నిశ్శబ్ధం...రేపటి యుద్ధం... పారాడే పిల్లలకి ఫోన్ అలవాటు చేయడం వల్ల వారి మాట్లాడే దశ మరింత ఆలస్యం కావచ్చునని నగరానికి చెందిన క్లినికల్ సైకాలజిస్ట్ డా.అనిత హెచ్చరిస్తున్నారు. పిల్లల్ని నిశ్శబ్ధంగా ఉంచడానికి పెద్దలు చేసే ఈ ప్రయత్నం వారిని మౌనంగా మార్చవచ్చు, అలాగే మాటలపట్ల ఆసక్తి తగ్గిపోతుందని, అలాగే భావోద్వేగాలను అర్థం చేసుకోవడం వారికి కష్టమవుతుందని ఆమె పేర్కొన్నారు. తద్వారా పెరిగి పెద్దయే దశలో ఇతరులతో ఎలా మెలగాలో అర్థం కాక సతమతమవుతారని, కమ్యూనికేషన్ స్కిల్స్ తగ్గిపోతాయని స్పష్టం చేస్తున్నారు. పిల్లల్ని తినిపించడానికి ఫబ్బింగ్కు గురి చేయడం శారీరక అనారోగ్యాలకు దారి తీస్తుందన్నారు. ఆహారం తీసుకునేటప్పుడు ఫోన్లో ఆడుకోవడం, లేదా ఏదైనా తదేకంగా చూడడం అతిగా తినడానికి, ఒబెసిటీకి దారి తీస్తాయన్నారు. కాస్త ఓపికగా వ్యవహరించడం తగినంత సమయం వెచ్చిస్తే పిల్లలను అదుపు చేయడం సమస్య కాదని దానికి బదులుగా వారి భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టే పరిష్కారాలు ఎంచుకోవడం సరైంది కాదని వైద్యులు సూచిస్తున్నారు. యువతలో ఫబ్బింగ్ అధ్యయనం ఏం చెప్పిందంటే.. సిటిలోని ఈఎస్ఐసీ హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుధా బాల సహ రచయితగా ‘కన్సీక్వెన్స్ ఆఫ్ ఫబ్బింగ్ ఆన్ సైకలాజికల్ డిస్ట్రెస్ అమాంగ్ ది హైదరాబాద్’ అనే అధ్యయనం నగర యువతలో పబ్బింగ్ సర్వసాధారణమైపోయిందని పేర్కొంది. ఇది వారి జీవితాలను వారి స్నేహితులు కుటుంబ సభ్యులతో సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తోందని తేల్చింది. అధ్యయనం ప్రకారం, నగర యువతలో 52% మంది ఫబ్బింగ్లో నిమగ్నమై ఉన్నారు. వీరిలో ఫబ్బింగ్ వల్ల 23% మంది అపరిమితంగా 34% మంది పరిమితంగా మానసిక ఇబ్బందులను అనుభవించారు. ఫబ్బింగ్ గేమింగ్ వ్యసనానికి కారణమవుతోంది. -
మరో అందమైన మగ తోడు కనిపిస్తే భర్తకు విడాకులే..
న్యూఢిల్లీ: మనిషి జీవితంలో వివాహానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. జీవితంలో ఏదో ఒక దశలో తోడు అవసరం అవుతుంది. ఇది గమనించే మనకు పెళ్లి, పిల్లలు, కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశారు పెద్దలు. అయితే దురదృష్టం కొద్ది విడాకులు అనే సౌలభ్యాన్ని కూడా ఏర్చర్చుకున్నాడు మనిషి. విడాకులు అనేది ఇద్దరు వ్యక్తులనే కాక.. రెండు కుటుంబాలను తీవ్రంగా బాధపెడుతుంది. అయితే దంపతులు విడిపోవాలనుకోవడానికి ప్రధాన కారణం.. వారి మధ్య మూడో వ్యక్తి ప్రవేశించడం. పిల్లలు ఎదుగుతున్న సమయంలో దంపతులు విడాకులు తీసుకుంటే అది పిల్లల భవిష్యత్‌పై చాలా తీవ్ర పరిణామాలు చూపిస్తుంది. ఇప్పుడు ఈ విడాకులు ముచ్చట ఎందుకంటే మనుషుల మాదిరే పక్షుల్లో కూడా విడాకులు సంప్రదాయం ఉందట. జంట పక్షి నచ్చకపోయినా.. వేరే పక్షి అందంగా కనిపించినా.. వెంటనే భాగస్వామికి విడాకులు ఇచ్చేస్తాయట. అలానే తప్పుడు భాగస్వామిని ఎన్నుకున్నట్లు భావించినప్పుడు కూడా విడాకులు తీసుకుంటాయట. ఈ విషయాలను ఓ ప్రముఖ పరిశోధకుడు తెలిపారు. (చదవండి: విడాకులపై పూనమ్ సంచలన వ్యాఖ్యలు, కాసేపటికే ట్వీట్ డిలీట్) కొన్ని సంవత్సరాల క్రితం, అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ)లోని వన్యప్రాణి విభాగానికి చెందిన ప్రొఫెసర్ హెచ్ఎస్ఎ యాహ్యా ఉర్దూలో ఒక పుస్తకాన్ని రాశారు. గార్డ్-ఓ-పెష్ అనే తన 11వ పుస్తకంలో, పక్షుల మధ్య సంబంధాల గురించి పరిశోధనా వాస్తవాలను ముందుకు తెచ్చాడు. దీని వెనుక ఆయన 4 దశాబ్దాల పరిశోధన ఉంది. ప్రొఫెసర్ యాహ్యా 40 ఏళ్లకు పైగా పక్షులపై పరిశోధనలు చేస్తున్నారు. ఈ పుస్తకంలో, ఆయన చాలా అసాధారణమైన వాస్తవాలను వెల్లడించారు. ప్రొ.యాహ్యా తన పరిశోధనల కోసం కాలిఫోర్నియా, స్కాట్లాండ్, సౌదీ అరేబియా తదితర అనేక దేశాలను సందర్శించారు. ముఖ్యంగా వార్బెట్ జాతుల పక్షులు, నార్కోండమ్ హార్న్ బిల్, ఖర్మోర్, తెల్ల రెక్కల బాతు మొదలైన వాటిపై ఆయన విస్తృత పరిశోధనలు చేశారు. (చదవండి: టెక్కీ దంపతులు.. 3 నెలలకే విడాకుల వరకు, ఎందుకిలా జరుగుతోంది?) ఈ పరిశోధనల అనంతరం ఆయన గుర్తించింది ఏంటంటే పక్షులు కూడా విడాకులు ఇస్తాయట. ప్రొఫెసర్ యాహ్యా పరిశోధన ప్రకారం, బయా పక్షులు అత్యధిక జంటలను ఏర్పరుస్తాయి. మగ పక్షి గూడు నిర్మాణం ప్రారంభించి.. అసంపూర్ణంగా వదిలివేస్తుంది. మిగిలిన గూడును జంటగా మారిన తర్వాత, మగ, ఆడ రెండూ కలిసి పూర్తి చేస్తాయి. రెండు కలిసి ఆ గూట్లో నివసిస్తాయి. (చదవండి: ఈ చెట్టు పిట్టలని చంపుతుంది.. కారణం తెలుసా!?) ఇక్కడ ఓ ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. ఆడ బయా పక్షికి.. తన సహచరుడి కంటే మెరుగైన మగతోడు దొరికినప్పుడు.. మొదటిదానిని వదిలి.. కొత్తగా దొరికిన తోడుతో వెళ్లిపోతుందట. ప్రొఫెసర్ యాహ్యా పరిశోధన ప్రకారం, పాలియాండ్రీ, అమెరికన్ మాకింగ్ బర్డ్స్ అనే జాతుల పక్షుల్లో ఆడ పక్షి.. ఒకదాని కంటే ఎక్కువ మగ పక్షులతో సంబంధం కలిగి ఉంటుందని తెలిపారు. బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ జాతుల పక్షులు కూడా ఇలానే ప్రవర్తిస్తాయట. ఒకటి కంటే ఎక్కువ మంది భాగస్వాములతో సంబంధాల కారణంగా స్త్రీ, పురుషుల మధ్య విడాకులు ఎలా సంభవిస్తాయో.. పక్షుల్లో కూడా ఇదే కారణంగా విడాకులు సంభవిస్తాయని ప్రొఫెసర్ యాహ్య తెలిపారు. (చదవండి: 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్‌సిరీస్ తర్వాత సమంత ఆ నిర్ణయం తీసుకుంది) అలానే పక్షులు తప్పుడు భాగస్వామిని ఎన్నుకున్నట్లు గ్రహించిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడాకులు తీసుకుంటాయట. ఆడ పక్షికి.. మరో మగ పక్షి మరితం ఆకర్షణీయంగా కనిపిస్తే.. తన పాత భాగస్వామిని వదిలివేస్తుందట. అదే సమయంలో, భాగస్వామి ప్రమాదంలో గాయపడితే విడాకులు తీసుకుంటాయట. పక్షులు బలహీనమైన సహచరులను ఇష్టపడరట. మనుషుల్లాగే అవి కూడా తమ జీవితానికి భద్రతను కోరుకుంటాయట. చదవండి: మాస్క్‌లు లేవు.. భౌతిక దూరం బాధే లేదు... -
రుణాలు : తీసుకున్నది తిరిగి ఇచ్చేయండి, లేదంటే లావైపోతారు.
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రుణాలు తీసుకోవడంలోనే కాదు ఇవ్వడంలోనూ యూత్ సత్తా చాటుతున్నారు. ఆన్లైన్ వేదికగా వ్యక్తుల నుంచి వ్యక్తులకు (పీర్ టు పీర్) మధ్య జరిగిన రుణ లావాదేవీలపై లెన్‌డెన్‌క్లబ్ విడుదల చేసిన 2020-21 అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. 12 లక్షల మంది సర్వేలో పాలుపంచుకున్నారు. 21 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉన్న యువతలో.. రుణాలు తీసుకున్నవారు 56 శాతం ఉంటే.. రుణాలు ఇచ్చినవారు 54 శాతం మంది ఉండడం విశేషం. లోన్స్ కోసం దరఖాస్తులన్నీ దాదాపు యాప్ ద్వారానే జరుగుతున్నాయి. అత్యవసర వైద్యానికి ఎక్కువగా అప్పులు చేశారు. అదికూడా రూ.25,000 వరకే. హైదరాబాదీయులు రుణాలు తీసుకోవడంలో మూడవ స్థానంలో, ఇవ్వడంలో రెండవ స్థానంలో నిలిచారు. విశేషమేమంటే రుణాలు ఇచ్చినవారిలో 19 శాతం మంది మహిళలు ఉన్నారు. -
పాపం మగాళ్లు.. వేధింపులకు బలిపశువులు
ఉద్యోగాలు చేస్తున్న పురుష పుంగవులూ.. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే, ఇటీవలి కాలంలో కార్యాలయాల్లో మగాళ్ల మీద వేధింపులు చాలా ఎక్కువయ్యాయట. క్వీన్స్లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (క్యూయూటీ), రాయల్ మెల్బోర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఆర్ఎంఐటీ)లకు చెందిన పరిశోధకులు ఈ అంశంపై పరిశోధన చేశారు. గడిచిన ఆరు నెలల్లో వచ్చిన 282 ఫిర్యాదులను వీళ్లు సమీక్షించారు. వీటిలో 78 శాతం వరకు పురుషులు తమ మహిళా సహోద్యోగులను వేధిస్తున్నట్లు ఉన్నాయి. అయితే, మరో 11 శాతం కేసుల్లో మాత్రం పురుషులకు ఇతర పురుషుల నుంచి లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయని ప్రొఫెసర్ పౌలా మెక్‌డోనాల్డ్ తెలిపారు. అందిన ఫిర్యాదుల కంటే, వాస్తవంగా అక్కడి పరిస్థితులు మరింత ఘోరంగా ఉంటున్నాయని ఆమె తెలిపారు. పురుషులపై పురుషుల లైంగిక వేధింపులు బాగా పెరిగాయని, ఈ తరహా ఫిర్యాదులు కూడా ఎక్కువగానే వస్తున్నాయని ఆమె అన్నారు. కార్యాలయాల్లో మేనేజర్లు ఈ తరహా వ్యవహారాలను ఓ కంట కనిపెట్టి ఉంచాలని, మగాళ్లకు కూడా రక్షణ అవసరమేనని ఆమె హెచ్చరించారు. ఆడవాళ్ల మీద ఆడవాళ్లు చేసే లైంగిక వేధింపులు కాస్త తక్కువగానే ఉంటున్నాయని, చాలావరకు ఉన్నతాధికారులైన మహిళలే తమ కింద పనిచేసే మహిళలను వేధిస్తున్నారని పరిశోధనలో తేలింది.