బిగ్‌బీని ఇబ్బంది పెట్టిన అనిల్ కపూర్
గత వారం జరిగిన టీఓఐఎఫ్ఏ అవార్డ్స్ ఫంక్షన్ సందర్భంగా ఆసక్తికరమైన దృశ్యాన్ని చూసే అవకాశం అంతర్జాతీయ సినీ అభిమానులకు కలిగింది. ఈ ఫంక్షన్లో అమితాబ్‌కు లివింగ్ లెజెండ్ అవార్డ్‌ను అందించిన అలనాటి హీరో అనిల్ కపూర్.. వేదిక మీద సీనియర్ బచ్చన్‌ను కాస్త ఇబ్బందిపెట్టాడు. ఈ విషయాన్ని తను అవార్డు అందుకుంటున్న ఫోటోలతో సహా ట్విట్టర్లో పోస్ట్ చేశారు బిగ్‌బీ.
అవార్డు ప్రదానోత్సవం సందర్భంగా అమితాబ్‌కు బహుమతి ప్రదానం చేసిన బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కపూర్ తరువాత ఆయనకు పాదాభివందనం చేశారు. ఈ పరిణామంతో అమితాబ్ చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారట. ఈ ఇద్దరు పలు చిత్రాల్లో కలిసి నటించారు. ఇదే వేదికపై పీకు సినిమాకు గాను క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ అవార్డ్‌ను కూడా అందుకున్నారు అమితాబ్.
శుక్రవారం దుబాయ్‌లో జరిగిన టీఓఐఎఫ్ఏ అవార్డుల ఫంక్షన్‌తో పాటు ఆదివారం ముంబైలో జరిగిన స్టైల్ అవార్డ్స్ ఫంక్షన్లోనూ అమితాబ్, షారూఖ్ ఇద్దరూ కలిసి ఏదో విషయంపై సీరియస్‌గా మాట్లాడుతున్న దృశ్యాలు కనిపించాయి. దీనిపైనా సరదాగా ట్వీట్ చేసిన అమితాబ్ తామిద్దరం బోన్ పెయిన్స్ గురించి మాట్లాడుకున్నట్టు తెలిపారు.
T 2182 -At TOIFA Anil Kapoor gives me the Lifetime Award and then this ... so embarrassing !! pic.twitter.com/vREh1gm0ib
— Amitabh Bachchan (@SrBachchan) March 21, 2016
T 2182 -A TOIFA, SRK and me discuss, then a day later at HT fashion award, we are still discussing .. bone pains !! pic.twitter.com/lsPcaMr1TR
— Amitabh Bachchan (@SrBachchan) March 21, 2016