ఫోన్ కొట్టు.. బహుమతి పట్టు!
ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు సబ్ కలెక్టర్ అలగు వర్షిణి కొత్త ఆలోచన చేశారు. ఎక్కడైనా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా.. అక్రమ నిల్వలున్నా వాట్సప్‌లో ఫొటోతో సహా వివరాలు అందివ్వాలని సూచించారు. సమాచారం అందజేసిన వారికి నగదు బహుమతి అందజేస్తామని తెలిపారు. వివరాలు పంపాల్సిన ఫోన్ నంబర్: 98499 04208
- రివార్డులు అందుకోండి
- వివరాలు గోప్యంగా ఉంచుతాం
- సబ్‌కలెక్టర్ అలగు వర్షిణి
- ఇసుక డంప్‌లపై సమాచారమిచ్చిన విద్యార్థికి రూ.5వేల నగదు
యాలాల: కాగ్నా నది నుంచి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు వికారాబాద్ సబ్‌కలెక్టర్ అలగు వర్షిణి కొత్త ఆలోచన విధానాన్ని ప్రకటించారు. ఎక్కడైనా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా.. అక్రమ నిల్వలున్నా వాట్సప్‌లో ఫొటోతో సహా వివరాలు పెట్టాలన్నారు. సమాచారం అందజేసిన వారికి నగదు రివార్డుతోపాటు వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. 98499 04208 నంబరుకు వాట్సప్ ద్వారా ఫొటో లేదా సమాచారం ఇవ్వాలన్నారు.
వాట్సప్ సౌకర్యం లేని వారు కచ్చితమైన సమాచారం ఇవ్వాలని సూచించారు. మండల పరిధిలోని జక్కేపల్లి ఆర్బీఎల్ ఫ్యాక్టరీ సమీపంలోని సర్వేనెంబరు 31లో అక్రమంగా నిల్వ ఉంచిన 15 ట్రాక్టర్ల ఇసుక నిల్వలను మంగళవారం ఆమె సీజ్ చేశారు. ఇసుక నిల్వలు ఉన్నట్లు ఫొటో తీసి, వాట్సప్ ద్వారా సమాచారం ఇచ్చిన స్థానిక ఇంటర్ విద్యార్థికి రూ.5వేల నగదును ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఇసుక నిల్వలు ఉన్న భూ యజమాని పెద్దింటి మల్కప్పపై కేసు నమోదు చేయాలని తహసీల్దార్ వెంకట్‌రెడ్డి, ఎస్ఐ రవికుమార్‌ను ఆదేశించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కాగ్నా నది నుంచి ఇసుక అక్రమ రవాణాకు కళ్లెం వేసేందుకు కఠిన చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. ఇందుకు బాధ్యత గల ప్రతి పౌరుడు ముందుకు రావాలన్నారు. ఇసుక నిల్వలను గుర్తించిన వెంటనే వాటిని సీజ్ చేసి గ్రామంలోని ప్రభుత్వ, ప్రవేటు వ్యక్తులకు కేటాయించడం జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియ ఇసుక నిల్వలు గుర్తించిన గ్రామానికే వర్తిస్తుందన్నారు.
అక్రమార్కులపై కఠిన చర్యలు..
బషీరాబాద్: తాండూరు డివిజన్లో ఇసు క అక్రమ రవాణా, నాపరాతి అక్రమ రవాణా చేసే వారిపై చర్యలు తీసుకుం టామని సబ్‌కలెక్టర్ వర్షిణి అన్నారు. ఈ విషయమై మంత్రి మహేందర్‌రెడ్డి తన తో ఫోన్లో మాట్లాడారన్నారు. ఎవరైనా తన పేరు వాడుకొని అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించవద్దని, సదరు వ్యక్తులపై కఠిన చర్యలకు వెనుకాడొద్దని సూచించి నట్లు చెప్పారు. ఇసుక, నాపరాతి వ్యవహారాలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని కోరినట్లు ఆమె చెప్పారు.