sub quota
-
బీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వాల్సిందే
సాక్షి, న్యూఢిల్లీ: వెనుకబడిన వర్గాల సమస్యలు పరిష్కరించాలంటూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నా నినాదాలతో హోరెత్తింది. మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించినప్పుడే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని, లేకపోతే సమాజంలో మార్పు ఉండదని ధర్నాలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైఎస్సార్సీపీ ఎంపీ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. మహిళా బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం దేశంలో 56 శాతం జనాభా ఉన్న బీసీల బతుకులు మార్చే బీసీ బిల్లును పార్లమెంటులో ఎందుకు ప్రవేశపెట్టడంలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా బీసీల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేయాలని, పంచాయతీరాజ్ సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 52 శాతానికి పెంచాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు గుజ్జ కృష్ణ, డాక్టర్ ఎన్ మారేష్‌ల అధ్యక్షతన జరిగిన ఈ మహాధర్నాలో ఆర్.కృష్ణయ్యతో పాటు ఎంపీలు బీద మస్తాన్ రావు, బడుగుల లింగయ్య యాదవ్ పాల్గొని తమ సంఘీభావం ప్రకటించారు. ధర్నాలో జబ్బల శ్రీనివాస్, బత్తుల వెంకటరమణ, పద్మలత, నీలం వెంకటేష్, భూపేష్ సాగర్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలి
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా బిల్లు ప్రవేశ పెట్టి అందులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను కోరారు. ఈమేరకు ఆయన శనివారం రాజకీయ పార్టీ లకు లేఖలు రాశారు. మహిళా బిల్లు, బీసీలకు ప్రత్యేక వాటా కల్పించేందుకు కేంద్ర ప్రభు త్వంపై దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఇందులో భాగంగా బీజేపీతో పాటు కాంగ్రెస్, జనతాదళ్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, అన్నా డీఎంకే, ఎన్సీపీ, రాష్ట్రీయ జనతాదళ్ తదితర పార్టీల అధ్యక్షులకు కృష్ణయ్య వేర్వేరుగా లేఖలు రాశారు. ప్రస్తుతం చట్టసభల్లో మహిళలకు అతి తక్కువగా ప్రాతినిధ్యం ఉందన్నారు. బీసీలకు అన్ని రంగాల్లో జనాభా ప్రకారం వా టా ఇవ్వకపోతే తిరుగుబాటు తప్పదన్నారు. -
ఓబీసీ మహిళలకు సబ్‌కోటా ఇవ్వండి
* ఓబీసీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో జంతర్‌మంతర్ వద్ద ధర్నా సాక్షి, న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని కోరుతూ ఆలిండియా ఓబీసీ మహిళా సమాఖ్య సభ్యులు సోమవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. 545 మంది పార్లమెంట్ సభ్యుల్లో మహిళా ఎంపీలు పదుల సంఖ్యలో ఉండడం బాధాకరమని సమాఖ్య అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి అన్నారు. ఓబీసీ మహిళా ఎంపీల సంఖ్య మరింత పెరిగేలా అవకాశాలు కల్పించాలని కోరారు. ధర్నాకు టీఆర్ఎస్ ఎంపీ వినోద్‌కుమార్ సంఘీభావం తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిలుపై గతంలో తమ పార్టీ తరఫున పార్లమెంట్లో ప్రస్తావించామని చెప్పారు. అనంతరం సంఘం నాయకులు మాట్లాడుతూ, జ్యోతిరావ్‌ఫూలే, సావిత్రీబాయి ఫూలేకు భారత రత్న ఇవ్వాలని కోరారు.