sub-stations
-
అమ్మో కరెంట్!
ఎప్పుడు పోతుందోనని నిత్యం భయం ఎప్పుడొస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని దైన్యం విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం క్షేత్రస్థాయి సిబ్బందిలో నిండా నిర్లక్ష్యం అధికారుల పర్యవేక్షణ కరువు ఇబ్బందులు పడుతున్న జనం దుబ్బాక: పాలకుల పట్టింపులేని తనం, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు కష్టాలు తెచ్చిపెడుతోంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో మండలంలోని చీకోడు విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో తరచుగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. గృహావసరాలకు సింగిల్ ఫేజ్ 24 గంటలు, రైతుల పొలాలకు త్రీ ఫేజ్ 9 గంటలపాటు నిరంతరాయంగా రెప్పపాటు కరెంట్ పొకుండా ఇస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. క్షేత్ర స్థాయిలో మాత్రం విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం, పర్యవేక్షణా లోపంతో అది అమలు కావడం లేదు. ప్రభుత్వ ఉద్దేశమే నీరుగారిపోతోంది. క్షేత్రస్థాయి అధికారుల తీరుతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. చీకోడు విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలోని కమ్మర్పల్లి, అచ్చుమాయపల్లి, పర్శరాంనగర్, ఆరెపల్లి, చీకోడు గ్రామాల్లో 15 రోజులుగా విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా మారింది. ఫలితంగా ప్రజలు చీకట్లో మగ్గుతున్నారు. వారం రోజుల్లోనే రెండు సార్లు 48 గంటల కరెంట్ సరఫరా బందైంది. సబ్ స్టేషన్లో మరమ్మతు పేరిట మరో నాలుగు రోజులు మధ్యాహ్నం సమయంలో కరెంట్ సరఫరా చేయలేదు. గ్రామాల్లో విద్యుత్ బోరుబావుల నుంచి సరఫరా అయ్యే నీటిపైనే ఆధారపడి తమ వ్యక్తిగత అవసరాలను తీర్చుకుంటారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం వల్ల తాగడానికి నీరు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు గోస చెప్పరానిది. స్నానాలకు నీరు లేక పాఠశాలలను మానేసి ఇంటి వద్దనే కూర్చుంటున్నారు. తాగునీరు లేక పాచి నీటినే వాడాల్సి వస్తోంది. రాత్రి పూట స్వైర విహారం చేసే దోమలతో ప్రజలు, చిన్నారులు సహవాసం చేయాల్సి వస్తోంది. ఇన్కమింగ్ కరెంట్ రావడం లేదని, కురుస్తున్న వర్షాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అధికారుల వాదన. కురుస్తున్న వర్షాలకు, వీస్తున్న గాలీకి పగటి పూట విద్యుత్ వైర్లు తెగిపోతే క్షేత్ర స్థాయి సిబ్బంది రాత్రి పూట వచ్చి తెగిన వైర్లు దొరకడం లేదని ఇంటి ముఖం పడుతున్నారు. పగటి సమయాల్లో అధికారులు అప్రమత్తం అయితే ప్రజలకు ఇబ్బంది కలిగేదు కాదు. కింది స్థాయి సిబ్బంది వల్లే రాత్రింబవళ్లు దోమలతో సహవాసం చేయాల్సి వస్తోందని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగిస్తున్న విద్యుత్ వైర్లను సరిచేసి తాగు నీటి సరఫరాకు సహకరించాలని విద్యుత్ అధికారులకు గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. కరెంట్ ఎప్పుడొస్తుందో.. ఎప్పుడు పోతుందో.. కరెంట్ ఎప్పుడొస్తుందో, ఎప్పుడు పోతోందో తెలియడం లేదు. అప్పుడొప్పుడొచ్చే వచ్చిరాని కరెంట్‌తోని తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నాం. దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. రాత్రి పూట నిద్ర ఉండడం లేదు. తరచుగా ఇబ్బంది పెడుతున్న కరెంట్ సరఫరాపై విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. - బెస్త రాజయ్య, చీకోడు విద్యుత్ కోతలు లేకుండా చూడాలి నెల రోజులుగా చీకోడు సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు విద్యుత్ సరఫరా కావడం లేదు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. సబ్ స్టేషన్లో సాంకేతిక లోపం తలెత్తితే క్షేత్ర స్థాయి సిబ్బంది పట్టించుకోవడం లేదు. ప్రజల విద్యుత్ కష్టాలను తొలగించి, విద్యుత్ కోతలు లేకుండా చూడాలి. - ముత్యంపేట భాగ్యమ్మ, సర్పంచ్, కమ్మర్పల్లి తాగు నీటి సమస్య ఏర్పడుతోంది విద్యుత్ కోతలతో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో బోరు బావుల నుంచి నీటి బొట్టు రావడం లేదు. తాగు నీటికి చాలా ఇబ్బంది పడుతున్నాం. వాడకానికి ఒక్కోసారి వర్షపు నీళ్లే దిక్కవుతున్నాయి. విద్యుత్ సమస్యల్లేకుండా సరి చేయాలి. - తౌడ రేణుక, గృహిణి, చీకోడు -
సబ్-స్టేషన్ల ఏర్పాట్లు కలేనా!
రామచంద్రాపురం: పట్టణం, మండల పరిధిలో విద్యుత్ సమస్యలు పరిష్కరించేందుకు రెండు సబ్స్టేషన్లు మంజూరై ఏళ్లు గడుస్తున్న నిర్మాణ పనులు మాత్రం జరగడంలేదు. రామచంద్రాపురం పట్టణంలో విద్యుత్ వాడకం, కొత్త కొత్త కాలనీలు రావడంతో ఉన్న సబ్‌స్టేషన్‌పై లోడ్ పడుతుంది. దాని కారణంగా ఏప్పుడు కరెంట్ వస్తుందో పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీనితో పాటు లోఓల్టెజీ సమస్య ఏర్పడుతుంది. గతంలో ఒవర్‌లోడ్ కారణంగా లక్షల విలువచేసే పరికరాలు, కాలిపోయిన సంఘటనలు రామచంద్రాపురం సబ్‌స్టేషన్‌లో నెలకొన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని అధికారులు మరొక్క 33 కేవీ సబ్‌స్టేషన్ మంజూరు చేశారు. అందుకు రూ.రెండు కోట్ల నిధులు సైతం మంజూరై ఏళ్లు గడుస్తున్న నేటికి పనుల ప్రారంభోత్సవానికి నోచుకొలేదు. గత పాలకులు సబ్‌స్టేషన్ నిర్మాణానికి స్థలం చూపిస్తామంటూ కాలయాపన చేశారే తప్ప పూర్తి స్థాయిలో భూమిని కేటాయించడంలో విఫలం చెందారు. సుమారు ఏడేళ్లు గడుస్తున్న నేటికి భూమిని కేటాయించకపోవడతో ప్రజలకు మాత్రం విద్యుత్ సమస్యలు తప్పడంలేదు. మండల పరిధిలోని విద్యుత్‌నగర్ సబ్‌స్టేషన్ కింద అనేక గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాల పరిధిలో కొత్త కొత్త కాలనీలు రావడంతో ఉన్న సబ్‌స్టేషన్‌పై లోడ్ ఏక్కువ పడుతుంది. ఇక్కడ కూడా 33 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం సుమారు రూ.రెండు కోట్లు మంజూరయ్యాయి. స్థలాన్ని చూపిస్తే సబ్‌స్టేషన్ నిర్మాణం పనులు ప్రారంభిస్తామని సంబంధిత అధికారులు, నేతలకు మొరపెట్టుకుంటున్నా వారు మాత్రం సబ్‌స్టేషన్ నిర్మాణానికి కావాల్సిన స్థలాన్ని మాత్రం చూపెట్టడంలేదు. దానితో ఈ రెండు ప్రాంతాల్లో సబ్‌స్టేషన్ నిర్మాణానికి నిధులు మంజూరైన ఫలితం మాత్రం రావడంలేదు. ఇప్పటికైన నేతలు స్పందించి సబ్‌స్టేషన్ నిర్మాణానికి భూమిని కేటాయించకపోతే రానున్న రోజుల్లో విద్యుత్ సమస్య జఠిలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది. -
గ్రామాలకైతే మరో వారం రోజులు!
ఇక విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ రూరల్ ప్రాంతాల్లో పలు సమస్యలు ప్రతిబంధకంగా మారారుు. శ్రీకాకుళం జిల్లాలో 3.6 మి.యూ, విజయనగరంలో 5.3 మి.యూ విద్యుత్ డిమాండ్ అంత త్వరగా పరిష్కారం సాధ్యమయ్యే సూచనలు కన్పించడం లేదు. విద్యుత్ లైన్లన్నీ దెబ్బతిన్నాయి. టవర్లు పూర్తిగా పాడయ్యాయి. పెందుర్తి నుంచి విజయనగరం, శ్రీకాకుళం వెళ్లే మార్గంలో మూడు ప్రధాన టవర్లు కుప్పకూలాయి. దాదాపు 20 వరకూ 132 కేవీ సబ్ స్టేషన్లు దెబ్బతిన్నాయి. 12 వేల స్తంభాలు నేలకొరిగారుు. ఇవన్నీ మారిస్తే తప్ప, గ్రామీణ ప్రాంతాలకు విద్యుత్ సరఫరా సాధ్యం కాదు. జాతీయ గ్రిడ్ నుంచి విద్యుత్ తీసుకునే అవకాశం ఉన్నా లైన్లు లేక వీలు కుదరడం లేదు. లైన్లు, టవర్లు పునరుద్ధరించడానికి వారం రోజులు పడుతుందనేది అధికారిక సమాచారం. అయితే మరో 48 గంటల్లో జిల్లా కేంద్రాలకు విద్యుత్ అందిస్తామని చెబుతున్నారు. కానీ ఇప్పటి వరకూ క్షేత్రస్థాయి సమాచార క్రోడీకరణ జరగలేదు. స్తంభాలు, ఇతర సామగ్రి ఉన్నప్పటికీ వాటిని చేర్చడం కష్టంగా ఉంది. ప్రధాన రహదారుల్లో కూలిపోయిన చెట్లే ఉన్నాయి. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. దీంతో గ్రామీణ ప్రాంతాలకు సామగ్రి సరఫరా కష్టంగా ఉంది. -
కాంట్రాక్టర్లే సైంధవులు
ఆపరేటర్ల ఎంపికలో డీఈలు, కాంట్రాక్టర్ల మధ్య వివాదం వినియోగానికి దూరంగా21 సబ్స్టేషన్లు ప్రజలకు తప్పని లోఓల్టేజీ కష్టాలు సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో విద్యుత్ సమస్యల పరిష్కారానికి రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన సబ్ స్టేషన్లు లక్ష్యానికి దూరంగా ఉండిపోయాయి. వీటి నిర్వహణ విషయంలో కాంట్రాక్టర్లు, అధికారుల మధ్య తలెత్తిన వివాదం ప్రజలకు శాపంగా మారుతోంది. ముఖ్యంగా ఆపరేటర్ల నియామకం విషయమై ఇరువర్గాల మధ్య బేధాభిప్రాయాలు చోటుచేసుకోవడంతో సబ్ స్టేషన్లు ఎందుకూ కొరగాకుండాపోతున్నాయి. చంపాపేట్, ఆల్మాస్‌గూడ, నాదర్గుల్, బైరమల్గూడ, ఇంజాపూర్, సాహెబ్‌నగర్, వనస్థలిపురం, బాలాజీన గర్, ఎన్ఎన్నగర్, సైనిక్‌పురి కాలనీ, చింతల్, ఎర్రకుంట, మామిడిపల్లి, మాతశ్రీనగర్, కేపీహెచ్‌బీ కాలనీ, జేటీపీఎల్, నిజాంపేట్, మియాపూర్, హయత్‌నగర్, వ సంతపురి, మల్కజ్గిరిలలో కొత్తగా 33/11 కేవీ సబ్స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఈ సబ్ స్టేషన్లు నేటికీ రీ చార్జికి నోచుకోలేదు. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో లోవోల్టేజీ సమస్య ఉత్పన్నమవుతోంది. ఈ సమస్యను పరిష్కరించాల్సిన లైన్స్ విభాగంలోని ఓ ఉన్నతాధికారి అక్రమార్కులకే వంతపాడుతుండటం కొసమెరుపు. ముందుకు కదలని పనులు గ్రేటర్లో విద్యుత్ సరఫరాను మెరుగుపరిచేందుకు 2011లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆర్-ఏపీడీఆర్పీ కింద తెలంగాణ రాష్ట్ర సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (టీఎస్పీడీసీఎల్)కి రూ.806.78 కోట్లు మంజూరు చేసింది. ఇందులో ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌లోనే రూ.143.84 కోట్లతో 64 సబ్ స్టేషన్లు నిర్మించాలని నిర్ణయించింది. 2014 చివరికి పనులు పూర్తి చేయాలని నిర్దేశించింది. ఆ మేరకు ప్రణాళికలు రూపొందించింది. తొలి విడతలో 19 సబ్స్టేషన్లు నిర్మించి, సేవలను వినియోగంలోకి తెచ్చింది. రెండో విడతలో 21 సబ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. పనులు పూర్తి కావడంతో ట్రయల్న్ రకూడా చేశారు. ఇదంతా పూర్తయి ఎనిమిది నెలలైనాఇప్పటి వ రకు వినియోగంలోకి తీసుకురాలేదు. డీఈలపై కత్తిగట్టిన కాంట్రాక్టర్లు సబ్స్టేషన్ల నిర్వహణ కోసం ఆపరేటర్ల నియామకానికి రంగారెడ్డి లైన్స్ విభాగం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. ఆపరేటర్ల ఎంపికలో అక్రమాలకు తావు లేకుండా ఉండేందుకు డిస్కం కొన్ని నిబంధనలు విధించింది. ఐటీఐ పూర్తి చేసిన స్థానిక యువకులనే ఆపరేటర్లుగా ఎంపిక చేయాలని సూచించింది. ఇలా చేస్తే స్థానికులకు ఉపాధి కల్పించడంతో పాటు అక్రమాలకు తావుండదని అధికారుల అభిప్రాయం. అ క్రమార్జనకు అలవాటు పడిన కొంతమంది కాంట్రాక్టర్లకు ఇది మింగుడు పడలేదు. ఈ నిబంధనను ఎత్తివేయాలని కొందరు కాంట్రాక్టర్లు డీఈలపై ఒత్తిడి తెచ్చారు. అధికారులు లొంగకపోవ డంతో వారిపై కత్తిగట్టారు. తమ పలుకుబడినిఉపయోగించి, అధికారుల యత్నాన్ని అడ్డుకునే పనిలో పడ్డారు. ఇంతలో మరికొంతమంది కాంట్రాక్టర్లు కోర్టును ఆశ్రయించి, పనులను నిలిపివేయించడంతో సబ్ స్టేషన్లు ఎందుకూ కొరగాకుండా పోతున్నాయి. గ్రేటర్‌కు మంజూరైన 33/11కేవీ సబ్స్టేషన్లు : 64 తొలి దశలో పూర్తయినవి : 19 రెండో దశలో పూర్తయినవి : 21 వివిధ దశల్లో పనులు కొనసాగుతున్నవి : 24 విద్యుత్ డిమాండ్... 2006లో : 1538 మెగావాట్స్ 2010లో : 1881 మెగావాట్స్ 2014లో : 2500 మెగావాట్స్ గ్రేటర్లో విద్యుత్ వినియోగదారుల సంఖ్య... 2006లో : 24.12 లక్షలు 2010లో : 29.75 లక్షలు 2014లో : 38 లక్షలు