సబ్ ట్రెజరీ కార్యాలయంలో తనిఖీలు
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలోని సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఉన్నతాధికారి మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సబ్ ట్రెజరీ కార్యాలయం సిబ్బంది తీరుపై అందిన ఫిర్యాదుల మేరకు విచారణ చేస్తున్నట్టు జిల్లా అసిస్టెంట్ ట్రెజరీ అధికారి రామనాథం తెలిపారు. కార్యాలయానికి వచ్చిన ఆయన రికార్డులను తనిఖీ చేయడంతోపాటు సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు.