Subhash Desai
-
ఏపీ సర్కార్ మాకు ఆదర్శం
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకుంటున్న విధాన నిర్ణయాలు, నూతన ఒరవడి దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రైవేట్ పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాల రిజర్వేషన్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అనుసరిస్తామని తాజాగా మహారాష్ట్ర సర్కారు ప్రకటించింది. ప్రైవేట్ పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాల్లో 75 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం కొద్ది నెలల క్రితం ప్రత్యేక చట్టం తెచ్చిన విషయం విదితమే. ప్రభుత్వం నుంచి తక్కువ ధరకు భూములు, ఇతర రాయితీలు పొందుతున్న పరిశ్రమలు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనని ప్రభుత్వం తేల్చి చెప్పింది. - స్థానికులకు ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపట్టిన ఏపీ ప్రభుత్వం వారి నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రకటించింది. ఈ చట్టం జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది. - స్థానికులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న దీర్ఘకాలిక డిమాండ్‌ను ఏపీ ప్రభుత్వం నెరవేర్చిందని నిపుణులు ప్రశంసించారు. ఈ చట్టాన్ని అమలు చేయాలని ఇతర రాష్ట్రాల్లో ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కర్ణాటకలోనూ ఈ చట్టాన్ని తేవాలని ఉద్యమిస్తున్నారు. - మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి సుభాష్ దేశాయ్ ఇటీవల ఆ రాష్ట్ర శాసనమండలిలో మాట్లాడుతూ ప్రైవేటు పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమకు ఆదర్శప్రాయమని ప్రకటించారు. మహారాష్ట్రలోనూ ఈ విధమైన చట్టాన్ని తేవాలని నిర్ణయించామన్నారు. - స్థానికులకు 80 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని ప్రైవేట్ పరిశ్రమలను తమ ప్రభుత్వం ఆదేశించినా సానుకూలంగా స్పందించనందున ఏపీ తరహాలో ప్రత్యేక చట్టం తేవాల్సిన అవసరం ఉందని గుర్తించినట్లు సుభాష్ దేశాయ్ వెల్లడించారు. ఈమేరకు చట్టం చేస్తామని ప్రకటించారు. - ఉద్దవ్ ఠాక్రే సర్కారు నిర్ణయం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా ఆకాంక్షలను గుర్తించడం, అందుకు సరైన విధానాన్ని రూపొందించడంలో మహారాష్ట్రకు ఏపీ ప్రభుత్వం దిశా నిర్దేశం చేసిందని నిపుణులు అభినందిస్తున్నారు. - ఈ చట్టాన్ని అమలు చేసే పరిశ్రమలకే తక్కువ ధరలకు భూములు, పారిశ్రామిక రాయితీలు, ఇతర సదుపాయాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. మహిళల రక్షణకు ఆంధ్రప్రదేశ్ తరహాలో తాము కూడా ‘దిశ’ చట్టాన్ని తెస్తామని మహారాష్ట్ర ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. -
కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు
సాక్షి, ముంబై: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా శుక్రవారం కేబినెట్, సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన బీజేపీ, శివసేన ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని బీజేపీ సర్కారులో శనివారం శాఖలు కేటాయించారు. ఇందులో బీజేపీ విద్యుత్, ఇరిగేషన్, నీటి పారుదల లాంటి కీలక శాఖలను తమవద్ద ఉంచుకుని తమ మిత్రపక్షమైన శివసేనకు ప్రజా పనుల శాఖ మినహా మిగతావన్నీ ప్రాధాన్యత లేని శాఖలు అంటగట్టినట్లు స్పష్టమవుతోంది. బీజేపీ మంత్రులకు కేటాయించిన శాఖలు: గిరీష్ బాపట్- ఆహార, పౌర సరఫరాల శాఖ, విని యోగదారుల సంరక్షణ, శాసనసభ వ్యవహారాలు. గిరీష్ మహాజన్- జల వనరులు చంద్రశేఖర్ బావన్కులే- విద్యుత్ బబన్‌రావ్ లోణికార్- ఇరిగేషన్, పరిశుభ్రత రాజ్‌కుమార్ బడోలే- సామాజిక న్యాయ శాఖ, ప్రత్యేక సహాయ శాఖ సహాయ మంత్రులకు కేటాయించిన శాఖలివే.. రామ్ షిండే- గృహ, మార్కెటింగ్, సార్వజనిక ఆరోగ్యం, పర్యాటకం విజయ్‌కుమార్ దేశ్‌ముఖ్- పీడబ్ల్యూడీ (ప్రాజెక్టులు), రవాణ, కార్మిక, వస్త్రోద్యోగం అంబరీష్ రాజే ఆత్రాం- గిరిజన సంక్షేమం రంజీత్ పాటిల్- న్యాయ శాఖ ప్రవీణ్ పోటే- ఉద్యోగ, పర్యావరణ, పీడబ్ల్యూడీ (ప్రాజెక్టులు మినహా) శివసేనకు చెందిన మంత్రులకు కేటాయించిన శాఖలు... దివాకర్ రావుతే- రవాణా శాఖ సుభాష్ దేశాయ్- పరిశ్రమలు రాందాస్ కదం- పర్యావరణం ఏక్నాథ్ షిండే- ప్రజా పనులు. (పీడబ్ల్యూడీ) దీపక్ సావంత్- సార్వజనిక ఆరోగ్య, కుటుంబ సంక్షేమం సహాయ మంత్రులకు కేటాయించిన శాఖలు... సంజయ్ రాఠోడ్- రెవెన్యూ దాదాజీ భుసే- సహకారం విజయ్ శివ్‌తారే- జల వనరులు దీపక్ కేసర్కర్- ఆర్థిక, గ్రామాభివృద్ధి రవీంద్ర వాయ్‌కర్- గృహనిర్మాణ, ఉన్నత సాంకేతిక విద్య