subsidy benefit
-
e- vehicles: గుడ్‌న్యూస్.. తగ్గనున్న టూ వీలర్ ధరలు!
వెబ్‌డెస్క్ : ఎలక్ట్రికల్ వెహికల్ మార్కెట్‌కి మరింత ఊతం ఇచ్చే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఎలక్ట్రికల్ వెహికల్ తయారీ సంస్థలకు ఇస్తున్న సబ్సిడీని రెట్టింపు చేసింది. దీని వల్ల ఎలక్ట్రిక్ వెహికల్స్ ధరలు తగ్గి అమ్మకాలు పెరుగుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ మేరకు భారీ పరిశ్రమల శాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. 1 kWhకి రూ.15,000 ప్రస్తుతం ఈవీ వెహికల్స్ తయారీకి సంబంధించి కిలోవాట్ పర్ అవర్ సామర్థ్యం కలిగిన బైక్ తయారీ ధరలో 20 శాతంగా ఉన్న సబ్సిడీని 40 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఒక కిలోవాట్ పర్ అవర్ (kWh) సామర్థ్యం కలిగిన బైక్‌పై రూ. 15,000 సబ్సిడీ లభిస్తోంది. ఇలా 2 kWh బైక్‌పై రూ. రూ. 30,000 సబ్సిడీ 3 kWh బైక్‌పై రూ. 45,000 వరకు సబ్సిడీ లభిస్తోంది. లక్షన్నర ధర మించని బైకులకు ఈ సబ్సడీ వర్తిస్తుందని కేంద్రం ప్రకటించింది. అథర్ స్పందన ఈవీ వెహికల్స్‌పై సబ్సిడీని ఒకేసారి 50 శాతానికి పైగా పెంచడంతో అథర్ సంస్థ తన స్కూటర్ల ధరలను వెంటనే తగ్గించింది. అథర్ 450ఎక్స్ మోడల్‌పై రూ. 14,500 ధర తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఈవీ అమ్మకాలు జోరందుకుంటాయని అథర్ ఫౌండర్ తరుణ్ మెహతా ప్రకటించారు. రివోల్ట్ మోటార్స్ దీన్ని గేమ్ ఛేంజర్‌గా ప్రకటించింది. మరిన్ని కంపెనీలు ధరలు తమ ఈవీల తగ్గించే పనిలో పడ్డాయి. డిమాండ్ పెంచేందుకే ప్రస్తుతం మార్కెట్లో మైలేజ్, ఛార్జింగ్ పరంగా 2 kWh సామార్థ్యం ఉన్న బైకులు పెట్రోలు బైకులకు ప్రత్యామ్నయంగా ఉన్నాయి. అయితే ధరల విషయంలో పోల్చినప్పుడు పెట్రోలు బైకుల కంటే ఈవీ బైకుల ధరలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో కష్టమర్ల నుంచి ఆశించిన మేరకు డిమాండ్ రావడం లేదు. దీంతో సబ్సిడీ ఇవ్వడం ద్వారా వెహికల్స్ ధర తగ్గించి, డిమాండ్ పెంచేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఫేమ్ 2 ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడకాన్ని పెంచేందుకు కేంద్రం ప్రత్యేకంగా ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ (FAME) పథకాన్ని అమల్లోకి తెచ్చింది. తాజాగా ఫేమ్ 2లో భాగంగా సబ్సిడీ మొత్తాన్ని పెంచింది. దీని కోసం కేంద్రం రూ. 10,000 కోట్లు కేటాయించింది. Govt of India doubles down on its commitment towards #goingelectric. Subsidy for electric 2W increases under #FAME2 incentives. Which means a whopping ₹14,500 additional subsidy on the #ATHER450X. Haven't booked it yet? Now seems like a good time: https://t.co/HNCOb2bGc9 pic.twitter.com/t2qD3c5Qq6 — Ather Energy (@atherenergy) June 11, 2021 చదవండి: బాబోయ్ పెట్రోల్.. భవిష్యత్తు హైపర్ ఛార్జర్లదే -
పరిశ్రమలకు పాక్షిక సబ్సిడీలు
సాక్షి, హైదరాబాద్: కరోనా లాక్డౌన్ మూలంగా తీవ్రంగా నష్టపోయిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగాన్ని (ఎంఎస్ఎంఈ) ఆదుకోవాలని పారిశ్రామికవర్గాల నుంచి వినతులు అందిన నేపథ్యంలో దాదాపు రాష్ట్ర ఆవిర్భావం నుంచి పెండింగ్‌లో ఉన్న పారిశ్రామిక ప్రోత్సాహకాలు, బకాయిలను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ అంశానికి సంబంధించి పరిశ్రమల శాఖ ఇదివరకే ప్రతిపాదనలు సమర్పించింది. పావు వంతు చెల్లింపు.... పారిశ్రామిక రంగానికి వివిధ సబ్సిడీలు, ప్రోత్సాహకాల కింద సుమారు రూ. 2,500 కోట్ల మేర బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. ఇందులో ఎంఎస్ఎంఈ రంగానికి రూ. 1,284 కోట్లు, ఇతర పరిశ్రమలకు రూ. 600 కోట్లు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ. 600 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. బకాయిల చెల్లింపునకు 2020–21 వార్షిక బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,500 కోట్లు కేటాయించింది. బడ్జెట్లో పేర్కొన్న బకాయిల మొత్తాన్ని విడుదల చేయాల్సిందిగా పారిశ్రామికవేత్తలు గతంలోనే పలుమార్లు ప్రభుత్వాన్ని కోరారు. అయితే కరోనా లాక్డౌన్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపడంతో దశలవారీగా ప్రోత్సాహకాలు, సబ్సిడీలను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఈ నేపథ్యంలో ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తూ బకాయిల్లో పావు వంతును తక్షణమే విడుదల చేయాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రస్తుతం ఆర్థిక శాఖ పరిశీలనలో ఉండగా నేడో, రేపో ఆమోదించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఫిక్స్డ్ విద్యుత్ చార్జీలపైనా నిర్ణయం? లాక్డౌన్ మూలంగా మార్చి నుంచి మే వరకు మూడు నెలలపాటు పరిశ్రమల విద్యుత్ బిల్లులపై మారటోరియం విధించారు. ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు రూ. 130 కోట్ల మేర ఫిక్స్డ్ విద్యుత్ చార్జీలు రద్దు చేయాలనే ప్రతిపాదన కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉంది. దీంతోపాటు ఆస్తి పన్ను రద్దు చేసే యోచనలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా పరిశ్రమలకు రుణాలు అందేలా చూడాలని పారిశ్రామికవేత్తలు కోరుతున్నారు. త్వరలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం నిర్వహించి ఈ అంశంపై సమీక్షించే అవకాశం ఉందని పరిశ్రమల శాఖ వర్గాలు వెల్లడించాయి. -
నూలుపై 40 శాతం సబ్సిడీ
జనగామ: చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు సీఎం కేసీఆర్ నూలు పథకంలో 20 శాతం సబ్సిడీని 40 శాతం వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని శాసన మండలి విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని జనగామ జిల్లా కేంద్రంలో మంగళవారం చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో నేత కార్మికులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ చౌరస్తాలో కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డితో కలిసి బోడకుంటి వెంకటేశ్వర్లు ర్యాలీని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నూలు సబ్సిడీ పథకంలో తీసుకొచ్చిన మార్పులు సహకార సంఘం సభ్యులతోపాటు సహకారేతర కార్మికులకు కూడా వర్తిస్తాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఐఐడీసీ ద్వారా అందిస్తున్న పది శాతం సబ్సిడీకి ఇది అదనమని పేర్కొన్నారు. కేంద్రం ఇస్తున్న సబ్సిడీ జియో ట్యాగింగ్ చేసిన మగ్గాలకు మాత్రమే వర్తిస్తుందన్నారు. ఈ పథకం ద్వారా జిల్లాలో 657 మంది లబ్ధిదారులకు రూ.24,94,720 నిధులను మంజూరు చేసేందుకు సంబంధిత శాఖ ఉన్నతాధికారులు సిఫారసు చేశారని చెప్పారు. సబ్సిడీ నిధులను విడతల వారీగా లబ్ధిదారులకు డీబీటీ ద్వారా అందిస్తారని చెప్పారు. ముఖ్యంగా చేనేత కార్మికుల కుటుంబాల్లో ఆర్థిక, సామాజిక భద్రతను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పొదుపు భద్రతా పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. 18 ఏళ్ల వయస్సు పైబడి, చేనేత వృత్తిపై 50 శాతం వచ్చే నేత కార్మికులు, అనుబంధ రంగాలైన డిజైనింగ్, డ్రైయింగ్, వార్పింగ్, సైజింగ్ కార్మికులు దీని పరిధిలోకి వస్తారని చెప్పారు. చేనేత కార్మికులు తమ ఆదాయాన్ని బ్యాంకులో జమ చేయడంతోపాటు 8« శాతాన్ని ఆర్డీ–1 ఖాతాలో వేస్తే.. ఇందులో 16 శాతం ఆర్డీ ఖాతాలో ప్రభుత్వ వాటా కలుపుతుందన్నారు. ఈ పథకంలో ఇప్పటి వరకు 1,443 మంది చేరినట్లు స్పష్టం చేశారు. రూ.2.30 కోట్ల రుణమాఫీ:కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి చేనేత కార్మికులకు ప్రభుత్వం రూ.2.30 కోట్ల రుణాలను మాఫీ చేసిందని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి తెలిపారు. కలెక్టరేట్లో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుంటూ.. వృత్తి కనుమరుగు కాకుండా కాపాడుకోవాలని సూచించారు. మగ్గంపై పట్టు వస్త్రాల తయారీ కోసం పంజాబ్ నేషనల్ బ్యాంకుతోపాటు ప్రభుత్వం నుంచి రుణ సదుపాయాన్ని కల్పించేందుకు లీడ్ బ్యాంకు మేనేజర్‌తో మాట్లాడుతానని చెప్పారు. చేనేత కార్మికుల భద్రతను ప్రభుత్వం బాధ్యతగా చూస్తోందని పేర్కొన్నారు. జిల్లాలో నేత కార్మికులను సెక్టార్ల వారీగా విభజించి, అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ ఫలాలు దక్కేలా చూస్తామన్నారు. కడు పేదరికంతో ఉన్న వారికి మాత్రమే అంత్యోదయ కార్డులను ఇవ్వనున్నుట్ల తెలిపారు. చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు సాగర్ మాట్లాడతూ ప్రభుత్వం అందిస్తున్న 16 శాతం వాటా ద్వారా 877 మందికి రూ.11.79 లక్షలు, 40 శాతం వాటాలో 276 మందికి రూ.24.76 లక్షలు అందించామని వివరించారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, డీఆర్డీఓ మేకల జయచంద్రారెడ్డి, మునిసిపల్ కమిషనర్ ఈశ్వరయ్య, సొసైటీ చైర్మన్ వేముల బాలరాజు, గుర్రం నాగరాజు పాల్గొన్నారు. -
సబ్సిడీపై 12 సిలిండర్లు
-
సబ్సిడీపై 12 సిలిండర్లు
కేంద్రంలో మాకు మెజారిటీ రాకుండా కుట్ర బలహీన ప్రభుత్వం ఏర్పడేలా మాపై అసత్య ఆరోపణలు బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీలో కాంగ్రెస్‌పై రాజ్‌నాథ్ నిప్పులు సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ తమపై కుయుక్తులు పన్నుతోందని బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ నిప్పులు చెరిగారు. ఎన్నికల తర్వాత కేంద్రంలో నరేంద్ర మోడీ సారథ్యంలో పటిష్టమైన ప్రభుత్వం ఏర్పాటు కాకుండా, కేవలం పేలవ ప్రభుత్వం ఉండాలనే లక్ష్యంతో కాంగ్రెస్ కుట్రపన్నుతోందని ఆరోపించారు. శుక్రవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని పార్టీ అగ్రనేత ఎల్.కె. అద్వానీ, ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ, పార్లమెంటులో ప్రతిపక్ష నేతలు సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీలతో కలసి రాజ్‌నాథ్ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించి అధ్యక్షోపన్యాసం చేశారు. భేటీలో జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, దత్తాత్రేయ, డాక్టర్ లక్ష్మణ్, ఇంద్రసేనారెడ్డి, హరిబాబు, వీర్రాజు, శాంతారెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, ప్రత్యేక ఆహ్వానితుడిగా కృష్ణంరాజు పాల్గొన్నారు. శని, ఆదివారాల్లో పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశాలు రాంలీలా మైదాన్‌లో జరగనున్నాయి. రాజ్‌నాథ్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు: యూపీఏ పదేళ్ల పాలనపై ప్రజాగ్రహం పెల్లుబుకుతున్న నేపథ్యంలో ఓటమి తప్పదని తెలుసుకున్న కాంగ్రెస్.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ రాకుండా, బలహీన ప్రభుత్వం ఏర్పాటయ్యేలా అసత్య ఆరోపణలతో ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తోంది. ఓటుబ్యాంకు రాజకీయాలకు మారుపేరైన కాంగ్రెస్...మన వల్ల లౌకిక వాదానికి పెనుముప్పంటూ తప్పుడు ఆరోపణలు చేస్తోంది. దీన్ని తిప్పికొట్టేందుకు యూపీఏ పాలనలో జరిగిన స్కాంలు, ఆర్థిక వ్యవస్థ పతనం, ఓటుబ్యాం కు రాజకీయాల వంటి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. లోక్‌సభ ఎన్నికల్లో 272 స్థానాల్లో గెలిచి సంపూర్ణ మెజార్టీతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వస్తే సుపరిపాలన అందిస్తాం. భేటీలో ఏం చేశారంటే... 272 కన్నా ఎక్కువ సీట్ల సాధనకు రాష్ట్రాల వారీగా పార్టీ పరిస్థితులపై అగ్రనేతల మేధోమథనం. ఒక ఓటు ఒక నోటు కార్యక్రమం ద్వారా పల్లెపల్లెకు వెళ్లడం, పార్లమెంటరీ నియోజకవర్గస్థాయి, బూత్‌స్థాయిల్లో సమావేశాల నిర్వహణ, ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చాల్సిన అంశాలు, ప్రచార వ్యూహాలపై చర్చ. ఆర్థిక, రాజకీయ తీర్మానాలకు తుదిరూపు సిక్కుల ఊచకోత గుర్తులేదా: బీజేపీ బీజేపీతో లౌకికవాదానికి ముప్పన్న సోనియాగాంధీ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ ఘాటుగా స్పందించారు. దశాబ్దాలపాటు సాగిన కాం గ్రెస్ పాలనలో 13 వేల అల్లర్లు జరిగాయని, 70 వేల మందికిపైగా మృత్యువాతపడటానికి కాంగ్రెస్ మతఛాందసవాద విధానాలే కారణమన్నారు. ముఖ్యంగా తమ పార్టీపై మతతత్వ ముద్ర వేస్తున్న కాంగ్రెస్‌కు 10 వేల మంది సిక్కుల ఊచకోత ఎవరి హయాంలో జరిగిందో గుర్తులేదా? అని దుయ్యబట్టారు. -
ఆధార్ లేకుంటే సబ్సిడీ గోవిందా!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: వంట గ్యాస్ వినియోగదారులకు రాయితీ గుబులు పట్టుకుంది. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి నగదు బదిలీ కార్యక్రమం అమల్లోకి రానున్న నేపథ్యంలో ఆధార్ కార్డు అందని వారు, బ్యాంకు లింకేజీ కాని వారు ఆందోళన చెందుతున్నారు. గడువు ముంచుకొస్తుండడంతొ సబ్సిడీ అందకుండా పోతుందేమోనన్న భయంతో వినియోగదారులు గడువు విషయమై తెలుసుకునేందుకు గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు. ఆధార్- బ్యాంక్ లింకేజీ పథకంలో భాగంగా ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. ముందుగా వంటగ్యాస్ సిలిండర్‌కు సంబంధించిన రాయితీ నిధులను లబ్ధిదారుని బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకుగాను లబ్ధిదారులకు ఆధార్ కార్డుల జారీ, వాటితో బ్యాంకు ఖాతా వివరాలను అనుసంధానం చేయాల్సి ఉంటుంది. అయితే జిల్లాలో ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఇప్పటివరకు కేవలం 14.5శాతం మంది లబ్ధిదారుల వివరాలు మాత్రమే పూర్తిస్థాయిలో సేకరించడంతో మిగతా లబ్ధిదారులందరికీ రాయితీ పంపిణీ ప్రక్రియ సంకటంలో పడింది. చేతులెత్తేసిన యంత్రాంగం ఇప్పటికే గ్యాస్‌కు సంబంధించి నగదు బదిలీ పథకాన్ని పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చారు. అయితే వచ్చే నెల నుంచి కచ్చితంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. అయితే జిల్లాలో ఆధార్ కార్డుల జారీ, సీడింగ్ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. మరో పక్షం రోజుల్లో పథకం అమల్లోకి రానుండగా ఇప్పటికీ కేవలం 14.5 శాతం మంది లబ్ధిదారుల వివరాలను మాత్రమే పూర్తిస్థాయిలో సేకరించారంటే జిల్లా యంత్రాంగం పనితీరు ఏ విధంగా ఉందో స్పష్టమవుతోంది. జిల్లాలో ఆధార్ నమోదు ప్రక్రియ మొదలై దాదాపు రెండేళ్లు కావస్తున్నది. అయితే ఇప్పటివరకు జిల్లాలో 105 శాతం నమోదు ప్రక్రియ చేసినట్లు పౌరసరఫరాల శాఖ గణాంకాలు చెబుతుండగా.. ఇంకా 250 ఆధార్ కేంద్రాలను కొనసాగిస్తోంది. ఈ లెక్కన జిల్లాలో పూర్తిస్థాయిలో ఆధార్ నమోదు కాలేదని తెలుస్తోంది. మరోవైపు ఆధార్ నమోదు చేసుకున్న వారిలో ఇప్పటివరకు 62.3శాతం మందికి మాత్రమే కార్డులు వచ్చాయి. కార్డులందని వారు యూఐడీఏఐ వెబ్సైట్ నుంచిడౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు చెబుతున్నప్పటికీ.. ‘అండర్ ప్రాసెస్’ అంటూ సమాధానం రావడంతో పౌరసరఫరాల శాఖ అధికారులను సం ప్రదిస్తున్నారు. కార్డుల ప్రక్రియ తమ పరిధిలో లేదంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారు. ఖాతాల ‘వెతలు’ ఆధార్ కార్డులు పొందిన లబ్ధిదారులకు బ్యాంకు ఖాతా తెరవడం సమస్యగా మారింది. ఈ విషయంలో బ్యాంకర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో లబ్ధిదారులు రోజుల తరబడి ఖాతాల కోసం పలుమార్లు తిరగాల్సివస్తోంది. నగదు బదిలీలో భాగంగా ప్రతి లబ్ధిదారుడు బ్యాంకు ఖాతా తెరవాల్సి ఉంటుంది. జిల్లాలో 13,59,834 గ్యాస్ కనెక్షన్లున్నాయి. వీరిలో ఇప్పటివరకు కేవలం 2,97,053 మంది మాత్రమే బ్యాంకు ఖాతాలు తెరవగా 1,97,204 మంది మాత్రమే ఆధార్ కార్డు సంఖ్యను బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేసి వివరాలను గ్యాస్ డీలర్లకు అందించారు. ఖాతాలు తెరిచే ప్రక్రియ జిల్లాలో వెనకబడి ఉంది. మరో పదిహేను రోజుల్లో గడువు ముగుస్తున్నప్పటికీ ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం లేదు. ఖాతాలు తెరిచేందుకు ప్రత్యేకంగా బ్యాంకుల్లో కౌంటర్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా బ్యాంకర్లు మాత్రం మొక్కుబడి చర్యలు చేపట్టడంతో లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. ఖాతా తెరిచేందుకు దాదాపు వారం రోజులకు పైగా ఇబ్రహీంపట్నం ఎస్బీహెచ్ చుట్టూ తిరుగుతున్నానంటూ ఓ లబ్ధిదారుడు ‘సాక్షి’తో ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో మొత్తం గ్యాస్ కనెక్షన్ల సంఖ్య : 13,59,834 ఈఐడీ సంఖ్యతో గ్యాస్ వివరాల అనుసంధానం : 1,53,521 యూఏడీ సంఖ్యతో గాస్ వివరాల అనుసంధానం : 8,48,370 బ్యాంకు ఖాతాలున్న గ్యాస్ లబ్ధిదారులు : 2,97,053 గ్యాస్, ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలతో అనుసంధానం :1,97,204