వసతిగృహాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బయోమెట్రిక్ విధానంపై ఆరా
విద్యార్థుల భోజనం పరిశీలన
వికారాబాద్ : కలెక్టర్ రఘునందన్‌రావు వికారాబాద్‌లోని ఎస్సీ నంబర్-1 వసతిగృహాన్ని బుధవారం సాయంత్రం ఆకస్మిక తనిఖీ చేశారు. వసతిగృహాంలో విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం బమోమెట్రిక్ విధానాన్ని పరిశీలించారు. బయోమెట్రిక్ మిషన్ పనిచేయకపోవడంతో వార్డెన్‌ను అడిగి తెలుసుకున్నారు. వారం రోజులుగా మిషన్ పనిచేయడం లేదడంతో కలెక్టర్ స్వయంగా విద్యార్థులతో బయోమెట్రిక్ మిషన్ పనిచేస్తుందా లేదా అని పరిశీలించారు. హాస్టల్ పిల్లలు వివరాలను కంప్యూటర్లో పరిశీలించి వివరాలు సరిగ్గా పొందుపరుస్తున్నారో లేదో తెలుసుకున్నారు. అనంతరం వసతి గృహాం గదులను పరిశీలించారు. పిల్లలు అందించే భోజనాన్ని పరిశీలించారు.
విద్యార్థులతో మాట్లాడి వసతిగృహాంపై ఆరా తీశారు. అనంతరం వసతిగృహం ఆవరణలో నాటిన 150 మొక్కలు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ర్ట ప్రభుత్వం పేద విద్యార్థులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. కష్టపడి చదువకుని ల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని సూచించారు. సమయం వృథా చేసుకోకుండా కష్టపడి చదివి ప్రయోజకులు కావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. చిన్నప్పటి నుంచి ఒక లక్ష్యాన్ని ఏర్పర్చుకుని దానికి అనుగుణంగా ముందకు సాగాలన్నారు. వసతిగృహాల్లో ఉండి ఈ రోజు ఉన్నత స్థానాల్లో చాలామంది ఉన్నారని, విద్యకు అనువైన స్థలాలు వసతిగృహాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ శృతిఓజా, డీఎస్డబ్లూ ్య మోహన్‌రెడ్డి, ఏఎస్‌డబ్ల్యు శ్వేత, హస్టల్ వార్డెన్ నసీయోద్దీన్ ఉన్నారు.