బీజేవైఎం తిరంగయాత్ర ప్రారంభం
ముకరంపుర : బీజేవైఎం ఆధ్వర్యంలో చేపట్టిన తిరంగయాత్ర బైక్ ర్యాలీని గురువారం బీజేపీ కిసాన్‌మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్‌రావు ప్రారంభించారు. ప్రజలు, యువతలో దేశభక్తి, జాతీయవాదం పెంపొందించేందుకు తిరంగయాత్రను చేపట్టినట్లు తెలిపారు. కార్యకర్తలు త్యాగధనుల చరిత్రను భావితరాలకు చాటి చెప్పాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు మీస అర్జున్‌రావు, ఎడవెల్లి విజయేందర్‌రెడ్డి, కొరివి వేణుగోపాల్, గంటల రమణారెడ్డి, సుజాతరెడ్డి, నరేందర్,ప్రసాద్, ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
నేడు మురళీధర్‌రావు రాక
తిరంగయాత్రలో భాగంగా నిర్వహించే కాగడాల ప్రదర్శనకు శుక్రవారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు హాజరుకానున్నారు. ఆర్అండ్బీ విశ్రాంతిభవనం ఎదుట సాయంత్రం 6 గంటలకు యాత్ర ప్రారంభమవుతుందని నాయకులు తెలిపారు.