బంగారు ఆభరణాల సూట్కేస్ చోరీ
హైదరాబాద్ : బస్టాండ్లో ప్రయాణికుడి వద్ద బంగారు ఆభరణాలు ఉన్న సూట్కేస్ అదృశ్యమైన సంఘటన ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఫీర్జాదీగూడ కృష్ణనగర్కు చెందిన రాము (45) ప్రైవేటు ఉద్యోగి. గుంటూరు నర్సారావుపేటలో వివాహం ఉండగా మూడు సూట్కేసులతో సోమవారం రాత్రి ఎల్బీనగర్ రింగురోడ్డు వద్ద బస్సు ఎక్కేందుకు వచ్చాడు. అందులో దాదాపు రూ.60వేల విలువైన ఆభరణాలు ఉన్న సూట్ కేసును గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లాడు. దీంతో బాధితుడు మంగళవారం ఉదయం ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.