summar holidays
-
సుప్రీంకోర్టు వేసవి సెలవులు రద్దు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా విపత్తు నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి సెలవులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ. బోబ్డే సెలవులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం మే 18 నుంచి జూన్ 19 వరకూ ఉన్నత న్యాయస్థానానికి వేసవి సెలవులు. అయితే కరోనా వైరస్ నియంత్రణకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో అయిదు వారాల సెలవులలోనూ న్యాయస్థానం పని చేయనుంది. సెలవుల రద్దుతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా లాక్డౌన్ వల్ల ఇప్పటికే పని దినాలను కోల్పోయామని, కాబట్టి వేసవి సెలవులను తగ్గిస్తూ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసులను విచారించాలని జస్టిస్ ఎల్ఎన్ రావుతో కూడిన న్యాయమూర్తుల కమిటీ సిఫారసు చేసిన విషయం తెలిసిందే. దీంతో భారత అత్యున్నత న్యాయస్థానం కేసుల విచారణ కోసం ఐదు వారాల పాటు పని చేయనుంది. అలాగే కరోనా వ్యాప్తి నేపథ్యంలో న్యాయవాదులు, న్యాయమూర్తులు, ఇతర న్యాయ సిబ్బందికి కూడా కొత్త డ్రెస్ కోడ్ అమల్లోకి రానుంది. (సుప్రీంలో తొలిసారి ఏకసభ్య ధర్మాసనాలు) -
వేసవి సెలవులు: టీటీడీ అలర్ట్
సాక్షి, తిరుమల: వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది. ఈ నెల 15 నుంచి జులై 16 వరకు తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు తీసుకుంటున్నట్టు జేఈఓ శ్రీనివాసరాజు తెలిపారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. భక్తులు తాకిడి ఎక్కువగా ఉండే క్రమంలో వారాంతంలో సిఫారసు లేఖలు రద్దు చేస్తున్నట్టు తెలిపారు. శుక్ర, శని, ఆదివారాలలో ప్రొటోకాల్ పరిధిలోని వారికి మాత్రమే వీఐపీ దర్శనాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. అదే విధంగా భక్తులు అధికంగా ఉండే క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి ఉద్యానవనం, ఉచిత వసతిగృహాల వద్ద ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. దర్శన ప్రవేశ మార్గాల్లో టీటీడీ విజిలెన్స్‌తో పాటు, పోలీసులతో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశామన్నారు. భక్తులకు అవసరమైన లడ్డూలు సిద్దంగా ఉంచుతామన్నారు. శ్రీవారి పోటులో నిత్యం 3 లక్షల 50 వేల లడ్డూల తయారీచేస్తున్నట్టు తెలిపారు. వారానికి 127 వేల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. కాగా, అలిపిరి నుంచి మోకాళ్ల మెట్ల వరకు మరో రోడ్డు వేయడానికి టీటీడీ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఎల్అండ్టీ కంపెనీతో సర్వే చేయిస్తోంది. -
పాఠశాలలకు ముందస్తు వేసవి సెలవులు
-
పాఠశాలలకు ముందస్తు వేసవి సెలవులు
► ‘సాక్షి’ కథనంపై స్పందించిన సీఎం కేసీఆర్ ► తక్షణమే సెలవులు ప్రకటించాలని ఆదేశం... ► నేటి నుంచి జూన్ 11 వరకు సెలవులు: విద్యాశాఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ప్రభుత్వం ఈ నెల 20 నుంచి వేసవి సెలవులను ప్రకటించింది. గురువారం నుంచి జూన్ 11 వరకు సెలవులు ఉంటాయని తెలిపింది. మండుటెండల్లో స్కూళ్లను నడుపుతుండటంతో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై ‘సాక్షి’బుధవారం ‘మండుటెండల్లో బాల శిక్ష’పేరిట కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. దీనిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తక్షణమే స్పందించారు. ఎండలతో బయట తిరిగే పరిస్థితి లేదని, విద్యార్థులను బడికి పంపడం శ్రేయస్కరం కాదని పేర్కొన్నారు. బుధవారం నుంచే సెలవులు ప్రకటించాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిని ఆదేశించారు. అయితే అప్పటికే పిల్లలు స్కూళ్లకు వెళ్లడంతో గురువారం నుంచి సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు. మంత్రి ఆదేశాల మేరకు పాఠశాల విద్యాశాఖ గురువారం నుంచి పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్టు వెల్లడించింది. ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు మేనేజ్మెంట్లకు చెందిన పాఠ«శాలలు అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కిషన్ వెల్లడించారు. గురుకుల పాఠశాలల్లోనూ కొనసాగుతున్న తరగతుల నిర్వహణను నిలిపివేయాలని సూచించారు. ఇందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని జిల్లాల్లోని డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్లు కూడా ఈ ఉత్తర్వులు అమలు చేయాలని విద్యాశాఖ పేర్కొంది. వాస్తవానికి షెడ్యూలు ప్రకారం ఈ నెల 22 పాఠశాలలకు ఆఖరు పనిదినం. 23వ తేదీ నుంచి వేసవి సెలవులుగా విద్యాశాఖ పేర్కొంది. అయితే ఎండలు, వడగాల్పుల తీవ్రత అధికంగా ఉండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు పడుతున్న కష్టాలపై ‘సాక్షి’కథనం ప్రచురించడంతో ప్రభుత్వం ముందస్తు సెలవులను ప్రకటించింది. స్కూళ్లు తిరిగి ప్రారంభమయ్యే తేదీలో ఎలాంటి మార్పు ఉండబోదని, జూన్ 12న పాఠశాలలు ప్రారంభమవుతాయని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తే కఠినంగా వ్యహరించనున్నట్లు హైదబారాద్ జిల్లా విద్యాశాఖాధికారి రమేశ్ చెప్పారు. -
రేపటి నుంచి వేసవి సెలవులు
హైదరాబాద్: ఉష్ణోగ్రతలు, వడగాలులు పెరిగిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు రేపటి నుంచే వేసవి సెలవులు ఇస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా విద్యార్థులు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో మూడు రోజుల ముందుగానే సెలవులు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. బుధవారం నుంచే సెలవులు ప్రకటించినా ఈరోజు స్కూల్స్ నిర్వహిస్తుండటంతో గురువారం నుంచి పూర్తిస్థాయి సెలవులు వర్తించనున్నాయి. -
వేసవి భోజనం
సర్కారు స్కూళ్లలో సెలవుల్లోనూ మధ్యాహ్న భోజనం 24వ తేదీ నుంచి అమలు చేయాలని అధికారుల కసరత్తు ఉపాధ్యాయులు లేదా వీఆర్ఏలకు పర్యవేక్షణ బాధ్యతలు తల్లిదండ్రులు వలసవెళ్లిన పిల్లలకు మరింత ప్రయోజనం ఎండల దృష్ట్యా ఉదయం 10గంటలకే పెట్టాలని యోచన మహబూబ్‌నగర్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వేసవి సెలవుల్లోనూ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. దీనిపై కలెక్టర్, ఇతర ఉన్నతస్థాయి అధికారులు, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించి ప్రణాళికలు రూపొందించారు. పాఠశాలల పనివేళల్లో మధ్యాహ్న భోజనం వినియోగించుకుంటున్న వారితో పాటు ఈ వేసవిలో ఎంతమంది విద్యార్థులు వినియోగించుకుంటారనే అంశంపై అంచనా వేస్తున్నారు. ప్రస్తుత కరువు పరిస్థితుల్లో పేద విద్యార్థులకు భోజనం పెట్టడం ద్వారా వచ్చే విద్యాసంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను మరింత పెంచొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇదివరకే పాఠశాలలకు వేసవి సెలవులను ప్రకటించిన నేపథ్యంలో పర్యవేక్షణ బాధ్యతలను వీఆర్ఏ, వీఆర్ఓలకు అప్పగించాలని కలెక్టర్ నిర్ణయించారు. ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటుచేసిన నేపథ్యంలో వారిని భాగస్వాములు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వంటలు చేసే బాధ్యతలను వంట ఏజెన్సీలకే అప్పగించాలని నిర్ణయించారు. 2.50 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి జిల్లాలోని 3800 ప్రభుత్వ పాఠశాలల్లో పనిదినాల్లో 1నుంచి 8వ తరగతి వరకు 3.68లక్షల మంది విద్యార్థులు ప్రతిరోజు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. ప్రస్తుతం వేసవి సెలవుల్లో కేవలం 65శాతం మంది వరకు అంటే సుమారు 2.50లక్షల మంది విద్యార్థులకు లబ్ధిచేకూర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రప్రభుత్వ నిధులతో 1 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించనున్నారు. అలాగే 9, 10 తరగతుల విద్యార్థులకు కూడా పెట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ రెండు తరగతుల్లోనూ సుమారు 69వేల మందికిపైగా విద్యార్థులు లబ్ధిపొందనున్నారు. ఈనెల 24వ తేదీ వేసవిలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇటీవల జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ రాంకిషన్ ఉపాధ్యాయ సంఘాల నేతలతో ఏర్పాటుచేసిన సమావేశంలో తాము భాగస్వాములు అవుతామని ప్రకటించారు. పేద విద్యార్థులకు ఉపశమనం వేసవి సెలవుల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న మ ధ్యాహ్న భోజనం పథకం ద్వారా పేద విద్యార్థులకు కొంత ఉపశమనం కలగనుంది. అదే విధంగా తల్లిదండ్రులు వలసలు వెళ్లి వృద్ధులతో ఉంటున్న చి న్నారులకు ఉపయోగకరంగా ఉంటుంది. వేసవి ఉ ష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఉదయం 10గంటలకే భోజనం పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇంకా స్పష్టత రాలేదు జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వేసవి సెలవుల్లో మధ్యాహ్న భోజనాన్ని అమలుచేయనున్నాం. ఎప్పటినుంచి అమలు చేయాలి.. పర్యవేక్షకులుగా ఎవరిని నియమించాలనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. ప్రభుత్వ నుంచి ఆదేశాలు రాగానే అమలుచేస్తాం. - విజయలక్మీ బాయి, డీఈఓ