రేపటి నుంచి వేసవి సెలవులు
హైదరాబాద్: ఉష్ణోగ్రతలు, వడగాలులు పెరిగిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు రేపటి నుంచే వేసవి సెలవులు ఇస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా విద్యార్థులు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో మూడు రోజుల ముందుగానే సెలవులు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. బుధవారం నుంచే సెలవులు ప్రకటించినా ఈరోజు స్కూల్స్ నిర్వహిస్తుండటంతో గురువారం నుంచి పూర్తిస్థాయి సెలవులు వర్తించనున్నాయి.