పెట్రోల్ బంక్ యజమానుల సమ్మె విరమణ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ బంకు యజమానులు బంద్ విరమించుకున్నారు. దీంతో గురువారం రాత్రి నుంచి బంక్ లు తిరిగి పనిచేయనున్నాయి. వ్యాట్ తొలగింపు పై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వచ్చాక నిర్ణయం తీసుకుంటామని ఏపీ రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు వారికి హామీ ఇచ్చారు. పెట్రోల్ బంకు యజమానుల సంఘం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడుతో భేటీ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.