Sunitareddy
-
ఉత్తమ భోదన అందించాలి
జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి శంకర్పల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు గుణాత్మకమైన విద్యను భోదించాలని జెడ్పీ చైర్పర్సన్ సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని కొండకల్ జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో రాజీవ్ విద్యా మిషన్ ద్వారా నిర్మించి అదనపు గదులను ఆదివారం ప్రారంభించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల పనితీరు చాలావరకు మార్చుకోవాలని గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభోదన బాగుందని పట్టణ ప్రాంతానికి దగ్గరలో బోధన సరిగా లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని నిరుటికంటే ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో చాలామంది చేరారన్నారు. ప్రతి పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం బోధన జరుగుతుందని, ప్రైవేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధన అందించాలని ఆమె సూచించారు. అనంతరం పాఠశాలలో నెలకొన్న సమస్యలను ప్రధానోపాధ్యాయుడు విద్యాకర్ చైర్పర్సన్ దృష్టికి తీసుకొచ్చారు. పాఠశాలలో తాగునీటి సమస్య ఉందని కొత్తబోరు వేయించి మోటర్ బిగించాలని, పాఠశాలలో 11 కంప్యూటర్లు ఉన్నా శిక్షకుడిని నియమించాలని, వంట గదికి నిధులు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ నర్సింలు, సర్పంచ్ యాదమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు జ్యోతి, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్‌చైర్మన్ ఒగ్గుమల్లేష్ యాదవ్, దండు రాజేశ్వర్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు విఠలయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి వెంకట్‌రెడ్డి, వాసుదేవ్ కన్నా, విద్యాకమిటీ చైర్మన్ రాజు, నాయకులు గోవింద్‌రెడ్డి, అయిలయ్య, శేరి అనంత్‌రెడ్డి డి.గోవర్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హామీలు విస్మరించిన కేసీఆర్‌కు బుద్ధి చెప్పండి
రామాయంపేట/ చిన్నశంకరంపేట : ఏ ఒక్క ఎన్నికల హామీ నెరవేర్చని కేసీఆర్‌కు మెదక్ ఉప ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ నాయకుడు వి.హన్మంతరావు అన్నారు. ఆదివారం ఆయన చిన్నశంకరంపేట మండలం జప్తిశివునూర్ గ్రామ శివారులో ఉన్న అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ పట్ల ప్రజలు విశ్వాసంతో ఉన్నారన్నారు. ఈ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీతారెడ్డి గెలుపు ఖాయమని, గ్రామాల్లో తమ ప్రచారానికి మంచి స్పందన వస్తుందన్నారు.ప్రస్తుతం పోటీలో ఉన్న ముగ్గురు అభ్యర్థుల్లో సునీతారెడ్డి మాత్రమే మచ్చలేని మహిళగా వెలుగొందుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ ఇచ్చిన రుణమాఫీతోపాటు విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, పింఛన్ల పెంపుదల, తాత్కాలిక ఉద్యోగులను క్రమబద్దీకరించడం వంటి హామీలన్నీ ప్రకటనలకే పరిమితమయ్యాయని ఆయన ఆరోపించారు. ఇక బీజేపీకి అభ్యర్థులు దొరక్క జగ్గారెడ్డిని అరువు తెచ్చుకున్నారని, ఈ చర్య ఆపార్టీ దిగజారుడుతనానికి నిదర్శన మన్నారు. రెండు, మూడో స్థానం కోసమే బీజేపీ, కాంగ్రెస్‌లు పోటీపడుతున్నాయని టీఆర్ఎస్ నేతలు ప్రకటించడం వారి అహంకారానికి నిదర్శనమన్నారు. వీహెచ్ వెంట పార్టీ జిల్లా నాయకుడు తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు అమరసేనారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రామచందర్‌గౌడ్, నాయకులు అహ్మద్, చింతల యాదగిరి, మెట్టుగంగారాం తదితరులు ఉన్నారు. నార్సింగిలో పొన్నాల లక్ష్మయ్య రోడ్ షో చేగుంట: ప్రభుత్వం ఏర్పాటై మూడు నెలలు దాటినా హామీలు నెరవేర్చని టీఆర్ఎస్కు ప్రజలు ఉప ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి తరఫున ఆదివారం నార్సింగిలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ.. మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న సునీతాలక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరారు. కేసీఆర్ హామీల్లో మొదటిదైన దళిత ముఖ్యమంత్రి, బలహీనవర్గాలకు ఇళ్ల నిర్మాణం, ఎస్సీ ఎస్టీలకు 3 ఎకరాల భూపంపిణీ హామీలు ఇంతవరకూ అమలుకు నోచుకోవడం లేదని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లోనే 160 మంది రైతులు ఆత్మ హత్యలు చేసుకున్నా ప్రభుత్వం స్పందించకపోగా కరెంటు కోసం రోడ్డెక్కిన అన్నదాతలను లాఠీలతో కొట్టించిందని ఆరోపించారు. చెయ్యి గుర్తుకు ఓటేసి సోనియా రుణం తీర్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి రాంచందర్ కుంతియా, ఎంపీ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి, రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్, సమన్వయకర్త డాక్టర్ శ్రవణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే కిష్టారెడ్డి, మండల ఇన్చార్జ్ కత్తి వెంకటస్వామి, మండల శాఖ అధ్యక్షుడు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ వ్యూహాత్మక ప్రచారం
సంగారెడ్డి మున్సిపాలిటీ : మెదక్ ఉప ఎన్నికలను మాజీ డిప్యూటీ సీఎం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి సునీతారెడ్డిని ఎలాగైనా గెలిపించాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా సంగారెడ్డి నియోజక వర్గ ప్రచార బాధ్యత దామోదర పైనే ఉంచడంతో ఆయన మరింత బాధ్యతగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు సంగారెడ్డి నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేయడంతో పాటు బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేస్తుండడంతో దామోదర సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రచారం ముమ్మరం చేశారు. అయితే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గ్రామ స్థాయిలో కార్యకర్త్తలున్నా, నాయకులు లేకపోవడంతో ప్రచారం ఆశించిన స్థాయిలో జరగడం లేదు. దీంతో రంగంలోకి దిగిన దామోదర రాజనర్సింహ జగ్గారెడ్డి వ్యవహార శైలి నచ్చక కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన వారిని మళ్లీ దగ్గరకు తీస్తున్నారు. సంగారెడ్డితో పాటు సదాశివపేట మండల, పట్టణ సీనియర్ నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారు తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చేలా చేయడంలో సఫలీకృతులయ్యారు. సదాశివపేటలో పార్టీకి ప్రజలకు సన్నిహిత సంబంధాలున్న మాజీ మున్సిపల్ చైర్మన్ మునిపల్లి సత్యనారాయణతో పాటు రామాగౌడ్లను పార్టీలో చేర్చుకొని పార్టీకి దూరమైన వారిని చే రదీశారు. ఇదే వ్యూహంతో సంగారెడ్డిలో సైతం కాంగ్రెస్‌కు మెజార్టీ ఓట్లు వచ్చేలా ప్రయత్నాలను ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ముఖ్య అనుచరుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ గోవర్దన్ నాయక్ బీజేపీలో చేరకుండా కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చేలా దామోదర ఒప్పించారు. మైనార్టీ వర్గాల ఓట్లపై ప్రభావం చూపే పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ సాబెర్ కూడా కాంగ్రెస్‌ను వీడకుండా బుజ్జగించారు. ఇలా నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడంతో పాటు అదే స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. కార్యకర్తల కోరిక మేరకు ఇంటింటి ప్రచారం, పాదయాత్రలు వంటి వాటిలో పాల్గొంటూ వారిని ఉత్తేజపరుస్తున్నారు. ఇప్పటికి సంగారెడ్డి మండలంతో పాటు మున్సిపల్ పరిధిలోని మెజార్టీ వార్డులలో ప్రచారం పూర్తిచేశారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూ తనే అభ్యర్థి అనే భావంతో కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. మొత్తంగా నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు మెజార్టీ ఓట్లు సాధించాలనే పట్టుదలతో దామోదర అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌తో పాటు పార్టీ రాష్ట్ర నాయకులతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. అలాగే ప్రతిరోజు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకుని వారికి మార్గనిర్దేశం చేస్తున్నారు. ఈ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి సునీతారెడ్డిని ఎలాగైనా గెలిపించాలని కేడర్‌కు నూరిపోస్తున్నారు. -
విద్యార్థులకు ‘ఇన్స్పిరేషన్’
తాండూరు: తాండూరులో మూడు రోజులపాటు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇన్స్పైర్ వైజ్ఞానిక ప్రదర్శన బుధవారంనాటితో ముగిసిం ది. వికారాబాద్ డివిజన్ పరిధిలోని వివి ధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెంది న విద్యార్థినీ, విద్యార్థుల పలు అంశాలపై ప్రయోగ ప్రదర్శనలను అందరినీ ఆకట్టుకున్నాయి. ఎంతో ఆలోజింపచేశాయి. ఈ ప్రదర్శనలో పాల్గొన్న పాఠశాలల నుంచి 25 పాఠశాలు రానున్న సె ప్టెంబర్ చివరిలో జరుగనున్న రాష్ర్టస్థా యి వైజ్ఞానిక ప్రదర్శకు ఎంపికయ్యాయి. రాష్ట్రస్థాయికి ఎంపిక పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులను జెడ్పీ చైర్పర్సన్ సునీ తారెడ్డి, డీఈఓ రమేష్ సన్మానించారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన పాఠశాలలు.. అగ్గనూర్ జెడ్పీహెచ్ఎస్ (నవీన్), తాండూరు గంగోత్రి (రాజశ్రీ సర్దార్/శ్రేయారెడ్డి), మల్రెడ్డిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల (నగేష్), మోత్కుపల్లి జెడ్పీహెచ్ఎస్ (శ్రీకాంత్), వికారాబాద్ జెడ్పీహెచ్ఎస్ (దివ్య), కరన్‌కోట్ జెడ్పీహెచ్ఎస్ (మమత), వెల్చల్ జెడ్పీహెచ్ఎస్ (స్వర్ణలత), ఎన్కతల జెడ్పీహెచ్ఎస్ (కృష్ణవేణి), గోటిగకుర్ధు జెడ్పీహెచ్ఎస్ (శివకుమార్), మద్గుల్ చిట్టంపల్లి (శివలక్ష్మి), సెయింట్ ఆంటోని హైస్కూల్ (భవాని), మోమిన్‌పేట్ జెడ్పీహెచ్ఎస్ (అస్మబే గం), సెయింట్ మేరీ హైస్కూల్ (రోహి త్‌రాజ్), జెడ్పీహెచ్ఎస్ కరన్‌కోట్ (కా వ్య), ప్రతిభా రెసిడెన్షియల్ స్కూల్ (స్వాతికారెడ్డి), జెడ్పీహెచ్ఎస్ గొట్టిముకుల (శివరామరాజు), శ్రీసరస్వతీ శిశుమందిర్ (పవన్‌కళ్యాణ్), యూపీఎస్ పీలా రం (నరేష్కుమార్), ఏపీ మోడల్ స్కూ ల్ (మణిప్రభ), జెడ్పీహెచ్ఎస్ కోత్లాపూర్ (స్వాతి), జెడ్పీహెచ్ఎస్ కోలుకుందా న్యూ (అశ్వంత్), కోటబాస్పల్లి కేరళ మోడల్ హైస్కూల్ (సుజాత), యూపీఎస్ నాగులపల్లి (నర్సింహులు), సెయింట్ మార్క్స్ హైస్కూల్ (శివాని), యూపీఎస్ తిమ్మాయిపల్లి (గీత) పాఠశాలలు, విద్యార్థులు రాష్ర్టస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికయ్యారు.