sunitha krishan
-
రేప్ వీడియోపై స్పందించిన సుప్రీం
న్యూఢిల్లీ: హైదరాబాద్ సామాజిక కార్యకర్త, ప్రజ్వల సంస్థ నిర్వహిస్తున్నసునీతా కృష్ణన్ పంపిన అత్యాచార వీడియోపై సుప్రీంకోర్టు స్పందించింది. అత్యాచార ఘటనలకు సంబంధించిన వీడియోలపై తక్షణమే చర్యలు చేపట్టాలని కేంద్రానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని కేంద్రానికి సూచించింది. దీంతో పాటు అత్యాచార ఘటనలపై ఓ రిజస్టార్ ను ఏర్పాటు చేయాలంటూ హోంశాఖకు స్పష్టం చేసింది. ఓ మహిళను రేప్ చేస్తున్న వీడియోలను చీఫ్ జస్టిస్ కు సునీత ఒక లేఖ ద్వారా పంపారు. ఆ వీడియో క్లిప్పింగ్స్ ను రెండు పెన్ డ్రైవ్ లలోసుప్రీంకు అందజేశారు. ఓ అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఆ తరువాత బలాత్కారం చేసిన ఐదుగురు దుండగులు ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన సామాజిక కార్యకర్త సునీతాకృష్ణన్... మానవ మృగాలను పట్టుకోండి అంటూ జనాలను విజ్ఞప్తి చేశారు. రేపిస్టులను గుర్తించండి అంటూ యూ ట్యూబ్‌లో వీడియోను పోస్ట్ చేశారు. రేపిస్టుల అంశాన్ని బయటపెట్టిన అనంతరం ఆమెపై దాడి జరిగిన ఘటన కలకలం సృష్టించింది. ఆమెపై దాడికి ప్రయత్నించిన దుండగులు కారు అద్దాలు పగులగొట్టారు. అంతే కాదు, ఓ వైపు ఇంత చర్చ జరుగుతుండగానే.. మరో వైపు హ్యాకర్లు రంగంలోకి దిగారు. క్షణాల్లో పోస్టింగ్‌లను డిలీట్ చేశారు. తన పోస్టింగ్‌లు మాయమయ్యాయని తెలుసుకున్న సునీత నివ్వెర పోయారు. ఓ అన్యాయంపై పోరాటం చేస్తే.. ఇంత ప్రతి దాడిని ఊహించలేకపోయారు. -
వాంటెడ్: ఈ మృగాళ్ళ ఎక్కడ..?
-
ఈ మృగాళ్ళను పట్టించండి..!
-
రేపిస్ట్ లను పట్టుకోమన్నందుకు.. దాడికి యత్నం
హైదరాబాద్ : సామాజిక కార్యకర్త, ప్రజ్వల సంస్థ నిర్వహిస్తున్న సునీతా కృష్ణన్‌పై శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు దాడికి యత్నించారు. ఆమె కారుపై దుండగులు రాళ్లు రువ్వారు. కారు అద్దాలు ధ్వంసం చేశారు. హైదరాబాద్ పాతబస్తీలో ఈ సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఓ అమ్మాయిని అయిదుగురు యువకులు ఎత్తుకెళ్లి అత్యాచారం చేశారు. అన్నా విడిచి పెట్టండని ఆమె వేడుకున్నా అరణ్య రోదనే అయ్యింది. ఆ మృగాలు.. సామూహిక అత్యాచారాన్ని వీడియోలో చిత్రీకరించారు. తాము చేస్తుందేదో ఘనకార్యం అంటూ నవ్వుతూ వీడియోకు ఫోజులు ఇచ్చారు. సుమారు ఆరు నెలల క్రితం ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వాట్సప్‌లో ప్రచారంలో ఉంది. ఆ వీడియో సునీతా కృష్ణన్‌కు కూడా వీడియో చేరింది. దాంతో ఆ దుర్మార్గులు ఎవరు ? ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకునే పనిలో పడ్డారు. ఈ రేపిస్టులను గుర్తించండి అంటూ.. సునీతా కృష్ణన్ యూ ట్యూబ్‌లో ఆ వీడియోను నిన్న పోస్ట్ చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు కృషి చేయాలని కోరారు. రేపిస్టులకు తగిన శిక్ష పడేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ దారుణ ఘటనపై యూ ట్యూబ్‌లో పోస్ట్ చేసిన వెంటనే.... సునీతా కృష్ణన్ వాహనంపై గుర్తు తెలియని దుండగలు దాడి చేశారు. కలకలం రేపిన ఈ ఘటనపై కేంద్ర స్త్రీ, శిశుసంక్షేమ మంత్రిత్వ శాఖ దృష్టి స్పందించింది. బాధ్యులు ఎవరో తెలుసుకునే పనిలో పడింది. సైబర్ క్రైం పోలీసుల సహకారంతో ఎక్కడి నుంచి ఈ ఫుటేజ్ బయటకు వచ్చిందో విచారణ ప్రారంభించారు.