sunkamma
-
మధ్యాహ్న భోజన ఏజెన్సీ కోసం టీడీపీ నేతల దౌర్జన్యం
వజ్రకరూరు: అధికారం అండగా టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. అంతా తాము చెప్పినట్టే జరగాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇదే క్రమంలో అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం ఛాయాపురంలో మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకురాలిపై టీడీపీ నేతలు దౌర్జ్యనం చేశారు. దీంతో ఆమె క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాల్లోకి వెళితే.. ఛాయాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో గత 23 ఏళ్లుగా మధ్యాహ్న భోజన ఏజెన్సీని బోయ సుంకమ్మ నిర్వహిస్తున్నారు. ఆమెకు సహాయకురాళ్లుగా ఆమె కుమార్తెలు రాధ, లక్ష్మి ఉన్నారు. ఇన్నేళ్లలో వారిపై చిన్న ఫిర్యాదు కూడా అందలేదు. కానీ గత కొన్ని రోజులుగా టీడీపీ నేతలు ఏజెన్సీ కోసం బోయ సుంకమ్మను బెదిరింపులకు గురిచేస్తున్నారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిందని, మధ్యాహ్న భోజన ఏజెన్సీ కూడా తమ పార్టీ కార్యకర్తలే చూసుకుంటారని అందువల్ల స్వచ్ఛందంగా తప్పుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు. కానీ అధికారికంగా తనకు ఎవరూ ఏజెన్సీ నిర్వహించవద్దని చెప్పకపోవడంతో బోయ సుంకమ్మ ఎప్పటిలాగే చిన్నారులకు మధ్యాహ్న భోజనం వండుతోంది. ఈ క్రమంలో గురువారం పాఠశాల వద్దకు వెళ్లిన కొందరు టీడీపీ నాయకులు సుంకమ్మపై మరోసారి దౌర్జన్యానికి దిగారు. చెబితే వినవా... ‘ఒక్కసారి చెబితే నువ్వు వినవా.. ఏజెన్సీ నుంచి తప్పుకోకపోతే నీ అంతు చూస్తాం’ అంటూ హెచ్చరించారు. దీంతో సుంకమ్మ అది చెప్పేందుకు మీరెవరని ప్రశ్నించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన టీడీపీ నేతలు వంట గదిలోని సామగ్రి, కూరగాయలు తీసుకువచ్చి రోడ్డుపై పడేశారు. అడ్డుకోబోయిన సుంకమ్మ కూతురు రాధ, మనుమడు దొరబాబు, మనుమరాలిని పక్కకు నెట్టివేశారు. దీంతో మనస్తాపం చెందిన సుంకమ్మ వంటగదిలోకి వెళ్లి క్రిమి సంహారక మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీన్ని గమనించిన కుటుంబీకులు వెంటనే ఆమెను 108లో గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వజ్రకరూరు ఎస్ఐ నరేష్ ఆస్పత్రికి వెళ్లి సుంకమ్మ నుంచి వివరాలు నమోదు చేసుకున్నారు. అలాగే మండల విద్యాధికారి తిమ్మప్ప కూడా ఆమెను పరామర్శించి వివరాలు సేకరించారు. కాగా అదే పాఠశాలలో పనిచేస్తున్న స్వీపర్ మహేశ్వరిని కూడా టీడీపీ నేతలు బెదిరించారు. ఉద్యోగం వదిలేసి వెళ్లిపోవాలంటూ టీడీపీ నాయకులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్టు స్వీపర్ మాముడూరు మహేశ్వరి కన్నీటి పర్యంతమయ్యారు. ఉద్యోగం వదిలేస్తే తన కుటుంబ పోషణ భారమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. -
‘ఫ్యాను’కు ఓటేసిందని తల్లిని చంపేశాడు
కంబదూరు/పెదవేగి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో అండగా నిలవడంతో అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు సోమవారం జరిగిన ఎన్నికల పోలింగ్లో స్వచ్ఛందంగా తరలివచ్చి ఓటు వేశారు. ఈ క్రమంలో తన మాట వినకుండా వైఎస్సార్సీపీకి ఓటు వేసిందన్న అక్కసుతో కన్నతల్లినే ఓ దుర్మార్గుడు సుత్తితో కొట్టి చంపాడు. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. వైసీపల్లికి చెందిన సుంకమ్మ (52) సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా వైఎస్సార్సీపీ వర్గీయుల ఆటోలో వెళ్లి ఓటు వేసి వచ్చి0ది. దీంతో ‘ఫ్యాను’ గుర్తుకు ఓటు వేసి ఉంటుందన్న ఉద్దేశంతో సుంకమ్మ కుమారుడు వెంకటేశులు మంగళవారం తల్లితో గొడవపడ్డాడు. తనకు తెలియకుండా వైఎస్సార్సీపీకి ఓటు ఎందుకు వేశావని సుత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానిక టీడీపీ నాయకుల ప్రోద్బలంతోనే అతడు ఈ దుర్మార్గానికి ఒడిగట్టినట్లు గ్రామస్తులు చెప్పారు. ఘటనపై కంబదూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులపై ఇనుపరాడ్డుతో దాడి వైఎస్సార్సీపీకి ఓటేశారని తల్లిదండ్రులపై వారి కుమారుడే ఇనుప రాడ్డుతో దాడి చేసిన దారుణ ఘటన ఏలూరు జిల్లా పెదవేగి మండలంలోని విజ యరాయిలో చోటుచేసుకుంది. బాధితుడు ముంగమూరి పెంటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పెంటయ్య కుమారుడు వంశీ టీడీపీ కార్యకర్త. మంగళవారం రాత్రి అతడు కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేశారని ప్రశి్నంచాడు. దీంతో వంశీ తండ్రి పెంటయ్య, మిగిలిన కుటుంబ సభ్యులు వైఎస్సార్సీపీకి వేశామని బదులిచ్చారు. దీంతో ఒక్కసారిగా వంశీ పిచ్చి పట్టినవాడిలా ఊగిపోతూ ఆ పార్టీకి ఓటెందుకు వేశారంటూ.. సమీపంలోని ఇనుప రాడ్డుతో తండ్రి పెంటయ్యపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిని ఆపే ప్రయత్నం చేసిన తల్లిని, చెల్లిని కూడా చితకబాదాడు. ఈ క్రమంలో దెబ్బలకు తాళలేక వారు స్థానిక వైఎస్సార్సీపీ నేతల వద్దకు పరుగులు తీశారు. తాను వైఎస్సార్సీపీ వీరాభిమానినని, తనకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఉందని పెంటయ్య చెప్పాడు. అందుకే ఫ్యాన్ గుర్తుకు ఓటేశానని, అయితే తన కుమారుడు తండ్రిని అని కూడా చూడకుండా తనను చావబాదాడని కన్నీటి పర్యంతమయ్యాడు. -
ఈ అవ్వకు 102 ఏళ్లు!
హాయ్ ఫ్రెండ్స్... ఇక్కడ మీరు చూస్తున్న ఫొటోలోని అవ్వ పేరు బోయ సుంకమ్మ. కూడేరు మండలం అంతరగంగ గ్రామానికి చెందిన ఈమె వయసు ఎంతనుకున్నారు... 102 ఏళ్లు! అబ్బో అని ఆశ్చరపోతున్నారా? నిజమేనండీ బాబూ.. ఆ గ్రామస్తులు చెబుతున్నదానిని బట్టి చూస్తే అవ్వకు 102 ఏళ్లు అనేది స్పష్టంగా తెలిసిపోతోంది. ఇంత వయసు వచ్చిన ఇంకా ఆరోగ్యంగానే ఉన్న ఈ అవ్వకు తోడుగా ఓ మనవడు ఉన్నాడు. అతను కూడా ఉద్యోగరీత్య మరో ప్రాంతానికి వెళ్లి వస్తుంటాడు. ఇక అవ్వకు బీపీ లేదు.. షుగరూ లేదు! ఇక కంటి చూపు సమస్యలంటరా? కళ్లకు అద్దాలు పెట్టుకున్న సందర్భాన్ని తామెన్నడూ చూడలేదని స్థానికులు అంటున్నారు. ఇంటి, వంట పనులూ అవ్వనే చేస్తుంటుంది. ఒకరి సాయం లేకుండా నడుస్తుంది. ఇక అవ్వ దగ్గర బోలెడు కథలు వినేందుకు పిల్లలతో పాటు పెద్దలూ ఆసక్తి చూపుతుంటారు. ఇంతకు అవ్వ ఆరోగ్య రహస్యమేమిటంటారా? అయితే ఈ విషయంగా అవ్వనే అడిగితే.. ‘కొర్ర అన్నం, రాగిముద్ద, జొన్న రొట్టెలు ఆహారంగా తీసుకోవడంతో పాటు వయసు పైబడే వరకూ నిరంతర వ్యవసాయ పనులు చేయడమేనని చెబుతున్నారు. ఔరా! భలే అవ్వరా!! అని కితాబునిస్తున్నారా.. అయితే ఓకే. - కూడేరు (ఉరవకొండ)