Sunni Militants
-
మసీదు విధ్వంసం.. కలకలం!
ఇస్లామాబాద్ : ముస్లిం సోదరులు పవిత్రంగా భావించే మసీదును కొందరు సున్నీ అతివాదులు కూల్చేయడం పాకిస్తాన్లో కలకలం రేపింది. సియాల్కోట్లోని అహ్మదీ సెక్టార్లో గురువారం వేకువజామున ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో మసీదు మూసివేసి ఉండటంతో ప్రాణనష్టం సంభవించలేదు. కానీ ఇలాంటి చర్యలు తగవంటూ ముస్లిం సోదరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమపై సున్నీలు కక్షగట్టారని అందులో భాగంగానే ఈ చర్యకు పాల్పడ్డారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అహ్మదీ సెక్టార్లో నివసించే వారిని ముస్లింలు కాదంటూ పాకిస్తాన్ ప్రభుత్వం 1974లోనే ప్రకటించిన విషయం తెలిసిందే. వివాదం ఏంటంటే.. గతంలో ప్రముఖ మతగురువు మిర్జా గులామ్ అహ్మద్ ఈ మసీదును సందర్శించారు. 19వ శతాబ్దంలో ఆయన మత ప్రచారారాలు నిర్వహించారు. అయితే మెజార్టీ వర్టీయులైన సున్నీలు, అహ్మదీ సెక్టార్ ప్రజలను ముస్లింలుగా భావించలేదు. పాక్లో మైనార్టీగా ఉన్న అహ్మద్ సెక్టార్ వాసులు తమను ముస్లింలుగా భావించాలని చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం తోసిపుచ్చింది. ఈ కారణంగా అహ్మద్ సెక్టార్లోని మసీదును నాలుగు దశాబ్దాల కిందటే మూసివేశారు. అయితే తరచుగా ఈ ప్రాంత ప్రజలపై దాడులకు పాల్పడే సున్నీ మిలిటెంట్లు మసీదు విధ్వంసకాండకు పాల్పడ్డ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
ఇరాక్ లో మరో ప్రధాన నగరం సున్నీల వశం!
బాగ్గాద్: ఇరాక్ లో సున్నీ మిలిటెంట్ల ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. ఎలాంటి తీవ్ర ప్రతిఘటన లేకుండానే ప్రధాన స్థావరాలన్ని సున్నీల వశమవుతున్నట్టు సమాచారం. తాజాగా అంబర్ ప్రాంతంలోని ప్రధాన పట్టణాన్ని సున్నీలు ఆక్రమించుకున్నారని వాయువ్య బాగ్దాద్ మేయర్ తెలిపారు. స్థానిక సైన్యాన్ని, పోలీస్ బలగాలను ఆధిపత్యం కొనసాగించి.. సున్నీ మిలిటెంట్లు తమ ఆధీనంలోకి తెచ్చకున్నారని మేయర్ తెలిపారు. అంబర్ లోని ప్రభుత్వ కార్యాలయాలను, 275 కిలోమీటర్ల యూఫరేట్స్ నదిని మిలిటెంట్లు ఆక్రమించుకున్నట్టు తెలుస్తోంది. -
ఇరాక్ మిలిటెంట్ల చెరలో 40 మంది భారతీయులు
-
ఇరాక్ మిలిటెంట్ల చెరలో 40 మంది భారతీయులు
న్యూఢిల్లీ: సున్ని మిలిటెంట్ల ఆధీనంలో 40 మంది భారతీయులు ఉన్నారని భారత్ ప్రభుత్వ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. సున్ని మిలిటెంట్ల ఆధీనంలో ఉన్న భారతీయులందరూ టర్కిష్ కన్ స్ట్రక్షన్ కంపెనీలో పని చేస్తున్నారని ప్రభుత్వం వివరాలను విదేశాంగ శాఖ అందించింది. సున్నీ మిలిటెంట్ల చెరలో ఉన్న భారతీయులు ఎక్కువ మంది పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారని, వారంతా తారిఖ్ నూర్ అల్ హుడా అనే నిర్మాణ సంస్థలో పనిచేస్తున్నారని విదేశాంగ శాఖ అధికారి సయ్యద్ అక్బరుద్దీన్ వెల్లడించారు. వారంతా కిడ్నాప్ కు గురయ్యారా అనే విషయంపై ఎలాంటి స్పష్టమైన సమాచారం తమ వద్ద లేదని.. వారంత ఎక్కడ ఉన్నారో కూడా తెలియదని వారన్నారు. సున్నీ మిలిటెంట్ల అధీనంలో ఉన్న వారితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు వెల్లడించారు.