super movie
-
సూపర్ హీరోయిన్ ఏంటి? ఇంతలా మారిపోయింది!
ఆయేషా టకియా అంటే గుర్తుపడతారో లేదో కానీ 'సూపర్' హీరోయిన్ అంటే మాత్రం ఇట్టే కనిపెడతారు. 'సూపర్'తో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అప్పటికే బాలీవుడ్‌లోనూ పలు సినిమాలు చేసింది. 'టార్జాన్: ద వండర్ కార్' సినిమాతో ఫిలింఫేర్ బెస్ట్ డెబ్యూ అవార్డు పట్టేసింది. ఆ తర్వాత 'సోచా న తా', 'సలామ్ ఇ ఇష్క్', 'వాంటెడ్', 'పాఠశాల' వంటి పలు హిట్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైంది. కానీ సరైన కథలు ఎంపిక చేసుకోవడంలో తడబడ్డ ఆయేషా 'షాదీ సే పెహ్లే', 'క్యాష్'.. వంటి కమర్షియల్ ఫ్లాప్ చిత్రాలతో వెనుకబడిపోయింది. 'ఐయామ్ ఎ కాంప్లేన్ గర్ల్..' అంటూ షాహిద్ కపూర్‌తో యాడ్స్‌లో నటించడం దగ్గర నుంచి వెండితెరపై అగ్రకథానాయికగా వెలుగులీనిన ఆమె పెళ్లితో ఇండస్ట్రీకి దూరమైంది. ఆయేషా.. మొదట కమర్షియల్ యాడ్స్‌లో కనిపించింది. తర్వాత మ్యూజిక్ ఆల్బమ్స్‌లో.. అక్కడి నుంచి సినిమాల్లోకి ప్రవేశించింది. ఈ సమయంలో సమాజ్‌వాదీ పార్టీ నేత, వ్యాపారవేత్త ఫర్హాన్ అజ్మీతో ప్రేమలో పడింది. వీరిద్దరూ 2005 నుంచి ప్రేమలో మునిగి తేలారు. కానీ ఎప్పుడూ ఈ విషయాన్ని ధృవీకరించలేదు. తర్వాత 2009 మార్చి 1న ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత ఆమె ఇస్లాం మతంలోకి మారి తన పేరు చివరన అజ్మీ అన్న పదాన్ని చేర్చింది. అయితే ఓసారి తన మామయ్య అబు అజ్మీ చేసిన వ్యాఖ్యలను బాహాటంగానే విమర్శించింది. అత్యాచార బాధితులను కూడా శిక్షించాలని ఆయన వ్యాఖ్యానించగా దాన్ని తీవ్రంగా తప్పుపట్టింది ఆయేషా. కానీ కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ తన కెరీర్‌నే త్యాగం చేయడం గమనార్హం. ఆమె పెళ్లికి సిద్ధమవడానికి ముందు బాలీవుడ్లో మనీషా కొయిరాలా సోదరుడు సిద్దార్థ్ కొయిరాలాతో, అమీషా పటేల్ సోదరుడు అస్మిత్ పటేల్‌తో లవ్వాయణం జరిపినట్లు ఆమధ్య ప్రచారం జరిగింది. ఇక 23 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకున్న ఈ హీరోయిన్‌కు 2013లో మైఖేల్ అనే బాబు జన్మించాడు. ఇకపోతే ఆయేషా మతం మార్చుకోవడంతో కొన్ని ప్రతికూల సంఘటనలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. 2017లో గుర్తు తెలియని వ్యక్తులు ఫర్హాన్ అజ్మీకి ఫోన్ చేసి చంపేస్తామని బెదిరించారు. లవ్ జిహాద్లో భాగంగానే ఆయేషాను పెళ్లి చేసుకున్నావని, మీ కుటుంబం మొత్తాన్ని హత్య చేస్తామని బెదిరించారు. తర్వాత పోలీసులకు సమాచారమివ్వడంతో ఈ వ్యవహారం సద్దుమణిగింది. ఇకపోతే ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆయేషా సోషల్ మీడియాలో మాత్రం అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటోంది. -
ఈ సిటీ నాకు స్కూల్ : సోనూసూద్
నాగ్‌తో సమానంగా ‘సూపర్’ అనిపించినా, అమ్మ బొమ్మాలీ అంటూ అందర్నీ భయపెట్టినా... హీరోలతో సమానమైన రోల్స్ చేస్తున్న ఏకైక విలన్ ఎవరంటే... సోనూసూద్. సిటీలోని గోద్రెజ్ ఇంటీరియో షోరూమ్‌లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన సోనూ హైదరాబాద్ అంటే తనకు స్కూల్లాంటిదన్నాడు. ఈ అందాల విలన్‌తో ‘సిటీ ప్లస్’ చిట్‌చాట్... ఇంట్లో నచ్చే ప్లేస్: నా లివింగ్ రూమ్ చాలా ఇష్టం. అక్కడే ఫ్యామిలీ అంతా కూర్చుని చాలా టైమ్ గడుపుతాం. అక్కడ జరిగేవి ఎన్నో రానురాను చక్కటి మెమరీస్‌గా మిగిలిపోతాయి. చాలా రోజులు ట్రావెలింగ్‌లో గడిపి లాస్ట్ మంత్ పంజాబ్‌లో మా ఇంటికి వెళ్లా. మా సిస్టర్ కూడా అమెరికా నుంచి వచ్చింది. ఇలా ఇల్లంతా ట్రాన్సఫార్మేషన్ జరిగాక అందరూ ఒక చోట కలిసేది లివింగ్ రూమ్‌లోనే. హైదరాబాద్‌తో: మా వాళ్లంతా నా ఫస్ట్ సిటీ హైదరాబాద్ అంటుంటారు. అది నిజం కూడా. నేనుండేది ముంబైలో అయినా హైదరాబాద్‌లోనే ఎక్కువ టైమ్ గడుపుతా. నా కెరీర్ మొదలైంది ఇక్కడే. ఈ రోజు కెరీర్లో, లైఫ్‌లో చెయ్యగలుగుతున్నవన్నీ ఇక్కడ నేర్చుకున్నవే. ఈ నగరం నాకు ఒక స్కూల్ లాంటిది. నా కెరీర్లో ప్రతీదీ హైదరాబాద్‌తో ముడిపడి ఉంది. అందుకే ఈ సిటీతో నాది ఎమోషనల్ అటాచ్మెంట్. టాలీవుడ్ సినిమాల్లో నేర్చుకున్నదాని వల్లే బాలీవుడ్లో చేయగలుగుతున్నా. అందుకే హైదరాబాద్ నా ఫస్ట్ సిటీ అంటా. అప్పట్లో బాగా షాపింగ్ చేసేవాడిని. ఇప్పుడు అంత టైమ్ ఉండటం లేదు. హైదరాబాదీ బిర్యానీ తిన్నకొద్దీ తినాలని ఉంటుంది. కానీ కుదరడంలేదు. ఇక ఇక్కడి మనుషులు.. ఐ లవ్ హైదరాబాదీస్. చార్మినార్, గోల్కొండ కోటలో షూటింగ్ కోసం చాలా సార్లు వెళ్లా. ఇక్కడి మాన్యుమెంట్స్ మాత్రమే కాదు, సందులు, ఇళ్లు చూస్తున్నప్పుడు ఇంటికి దూరంగా ఉన్నానని అనిపించదు. ఫిట్నెస్: ఈ ఫీల్డ్‌లో సర్వైవ్ అవ్వాలంటే మీరన్నట్టు ఇలా గ్లామర్, ఫిట్నెస్ మెయిన్టేన్ చెయ్యాలి కదా (నవ్వుతూ). ఇక నా లైఫ్ స్టైల్ గురించి చెప్పాలంటే లేవగానే వర్కవుట్ చేస్తా. ఎక్కడున్నా అందులో తేడా ఉండదు. స్మోకింగ్, డ్రింకింగ్ హ్యాబిట్స్ లేవు. పార్టీలు, నాన్‌వెజ్‌కు దూరం. ఇంతకు మించి నా సీక్రెట్ ఏమీ లేదు. చవరిగా ఓ మాట.. సోనూసూద్ లైఫ్ జర్నీ ఇప్పుడే మొదలైంది. ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది.