సూపర్‌ హీరోయిన్‌ ఏంటి? ఇంతలా మారిపోయింది! | Remember Super Heroine Ayesha Takia, Her Career and Love Story In Telugu | Sakshi
Sakshi News home page

Ayesha Takia: ప్రేమ కోసం కెరీర్‌ త్యాగం చేసిన హీరోయిన్‌, కానీ కుటుంబాన్ని చంపేస్తామని బెదిరింపులు

Published Sun, Mar 5 2023 11:06 AM | Last Updated on Sun, Mar 5 2023 11:31 AM

Remember Super Heroine Ayesha Takia, Her Career and Love Story In Telugu - Sakshi

అత్యాచార బాధితులను కూడా శిక్షించాలని ఆయన వ్యాఖ్యానించగా దాన్ని తీవ్రంగా తప్పుపట్టింది ఆయేషా. కానీ కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ తన కెరీర్‌నే త్యాగం చేసింది. అయితే ఆమె పెళ్లికి సిద్ధమవడానికి ముందు బాలీవుడ్‌లో మనీషా కొయిరాలా సోదరుడు

ఆయేషా టకియా అంటే గుర్తుపడతారో లేదో కానీ 'సూపర్‌' హీరోయిన్‌ అంటే మాత్రం ఇట్టే కనిపెడతారు. 'సూపర్‌'తో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అప్పటికే బాలీవుడ్‌లోనూ పలు సినిమాలు చేసింది. 'టార్జాన్‌: ద వండర్‌ కార్‌' సినిమాతో ఫిలింఫేర్‌ బెస్ట్‌ డెబ్యూ అవార్డు పట్టేసింది. ఆ తర్వాత 'సోచా న తా', 'సలామ్‌ ఇ ఇష్క్‌', 'వాంటెడ్‌', 'పాఠశాల' వంటి పలు హిట్‌ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైంది. కానీ సరైన కథలు ఎంపిక చేసుకోవడంలో తడబడ్డ ఆయేషా 'షాదీ సే పెహ్లే', 'క్యాష్‌'.. వంటి కమర్షియల్‌ ఫ్లాప్‌ చిత్రాలతో వెనుకబడిపోయింది. 'ఐయామ్‌ ఎ కాంప్లేన్‌ గర్ల్‌..' అంటూ షాహిద్‌ కపూర్‌తో యాడ్స్‌లో నటించడం దగ్గర నుంచి వెండితెరపై అగ్రకథానాయికగా వెలుగులీనిన ఆమె పెళ్లితో ఇండస్ట్రీకి దూరమైంది. 

ఆయేషా.. మొదట కమర్షియల్‌ యాడ్స్‌లో కనిపించింది. తర్వాత మ్యూజిక్‌ ఆల్బమ్స్‌లో.. అక్కడి నుంచి సినిమాల్లోకి ప్రవేశించింది. ఈ సమయంలో సమాజ్‌వాదీ పార్టీ నేత, వ్యాపారవేత్త ఫర్హాన్‌ అజ్మీతో ప్రేమలో పడింది. వీరిద్దరూ 2005 నుంచి ప్రేమలో మునిగి తేలారు. కానీ ఎప్పుడూ ఈ విషయాన్ని ధృవీకరించలేదు. తర్వాత 2009 మార్చి 1న ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత ఆమె ఇస్లాం మతంలోకి మారి తన పేరు చివరన అజ్మీ అన్న పదాన్ని చేర్చింది. అయితే ఓసారి తన మామయ్య అబు అజ్మీ చేసిన వ్యాఖ్యలను బాహాటంగానే విమర్శించింది. అత్యాచార బాధితులను కూడా శిక్షించాలని ఆయన వ్యాఖ్యానించగా దాన్ని తీవ్రంగా తప్పుపట్టింది ఆయేషా. కానీ కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ తన కెరీర్‌నే త్యాగం చేయడం గమనార్హం.

ఆమె పెళ్లికి సిద్ధమవడానికి ముందు బాలీవుడ్‌లో మనీషా కొయిరాలా సోదరుడు సిద్దార్థ్‌ కొయిరాలాతో, అమీషా పటేల్‌ సోదరుడు అస్మిత్‌ పటేల్‌తో లవ్వాయణం జరిపినట్లు ఆమధ్య ప్రచారం జరిగింది. ఇక 23 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకున్న ఈ హీరోయిన్‌కు 2013లో మైఖేల్‌ అనే బాబు జన్మించాడు. ఇకపోతే ఆయేషా మతం మార్చుకోవడంతో కొన్ని ప్రతికూల సంఘటనలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. 2017లో గుర్తు తెలియని వ్యక్తులు ఫర్హాన్‌ అజ్మీకి ఫోన్‌ చేసి చంపేస్తామని బెదిరించారు. లవ్‌ జిహాద్‌లో భాగంగానే ఆయేషాను పెళ్లి చేసుకున్నావని, మీ కుటుంబం మొత్తాన్ని హత్య చేస్తామని బెదిరించారు. తర్వాత పోలీసులకు సమాచారమివ్వడంతో ఈ వ్యవహారం సద్దుమణిగింది. ఇకపోతే ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆయేషా సోషల్‌ మీడియాలో మాత్రం అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement