ఈ సిటీ నాకు స్కూల్ : సోనూసూద్ | hyderabad like my school,says Sonu Sood | Sakshi
Sakshi News home page

ఈ సిటీ నాకు స్కూల్ : సోనూసూద్

Published Fri, Nov 14 2014 11:50 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

ఈ సిటీ నాకు స్కూల్ : సోనూసూద్ - Sakshi

ఈ సిటీ నాకు స్కూల్ : సోనూసూద్

నాగ్‌తో సమానంగా ‘సూపర్’ అనిపించినా, అమ్మ బొమ్మాలీ అంటూ అందర్నీ భయపెట్టినా... హీరోలతో సమానమైన రోల్స్ చేస్తున్న ఏకైక విలన్ ఎవరంటే... సోనూసూద్. సిటీలోని గోద్రెజ్ ఇంటీరియో షోరూమ్‌లో  శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన సోనూ హైదరాబాద్ అంటే తనకు స్కూల్‌లాంటిదన్నాడు. ఈ అందాల విలన్‌తో ‘సిటీ ప్లస్’ చిట్‌చాట్...
 
ఇంట్లో నచ్చే ప్లేస్:
నా లివింగ్ రూమ్ చాలా ఇష్టం. అక్కడే ఫ్యామిలీ అంతా కూర్చుని చాలా టైమ్ గడుపుతాం. అక్కడ జరిగేవి ఎన్నో రానురాను చక్కటి మెమరీస్‌గా మిగిలిపోతాయి. చాలా రోజులు ట్రావెలింగ్‌లో గడిపి లాస్ట్ మంత్ పంజాబ్‌లో మా ఇంటికి వెళ్లా. మా సిస్టర్ కూడా అమెరికా నుంచి వచ్చింది. ఇలా ఇల్లంతా ట్రాన్సఫార్మేషన్ జరిగాక అందరూ ఒక చోట కలిసేది లివింగ్ రూమ్‌లోనే.

హైదరాబాద్‌తో: మా వాళ్లంతా నా ఫస్ట్ సిటీ హైదరాబాద్ అంటుంటారు. అది నిజం కూడా. నేనుండేది ముంబైలో అయినా హైదరాబాద్‌లోనే ఎక్కువ టైమ్ గడుపుతా. నా కెరీర్ మొదలైంది ఇక్కడే. ఈ రోజు కెరీర్‌లో, లైఫ్‌లో చెయ్యగలుగుతున్నవన్నీ ఇక్కడ నేర్చుకున్నవే. ఈ నగరం నాకు ఒక స్కూల్ లాంటిది. నా కెరీర్‌లో ప్రతీదీ హైదరాబాద్‌తో ముడిపడి ఉంది. అందుకే ఈ సిటీతో నాది ఎమోషనల్ అటాచ్‌మెంట్. టాలీవుడ్ సినిమాల్లో నేర్చుకున్నదాని వల్లే బాలీవుడ్‌లో చేయగలుగుతున్నా. అందుకే హైదరాబాద్ నా ఫస్ట్ సిటీ అంటా.

అప్పట్లో బాగా షాపింగ్ చేసేవాడిని. ఇప్పుడు అంత టైమ్ ఉండటం లేదు. హైదరాబాదీ బిర్యానీ తిన్నకొద్దీ తినాలని ఉంటుంది. కానీ కుదరడంలేదు. ఇక ఇక్కడి మనుషులు.. ఐ లవ్ హైదరాబాదీస్. చార్మినార్, గోల్కొండ కోటలో షూటింగ్ కోసం చాలా సార్లు వెళ్లా. ఇక్కడి మాన్యుమెంట్స్ మాత్రమే కాదు, సందులు, ఇళ్లు చూస్తున్నప్పుడు ఇంటికి దూరంగా ఉన్నానని అనిపించదు.

ఫిట్‌నెస్: ఈ ఫీల్డ్‌లో సర్వైవ్ అవ్వాలంటే మీరన్నట్టు ఇలా గ్లామర్, ఫిట్‌నెస్ మెయిన్‌టేన్ చెయ్యాలి కదా (నవ్వుతూ). ఇక నా లైఫ్ స్టైల్ గురించి చెప్పాలంటే లేవగానే వర్కవుట్ చేస్తా. ఎక్కడున్నా అందులో తేడా ఉండదు. స్మోకింగ్, డ్రింకింగ్ హ్యాబిట్స్ లేవు. పార్టీలు, నాన్‌వెజ్‌కు దూరం. ఇంతకు మించి నా సీక్రెట్ ఏమీ లేదు. చవరిగా ఓ మాట.. సోనూసూద్ లైఫ్ జర్నీ ఇప్పుడే మొదలైంది. ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement