Super Singer
-
ఫుడ్ డెలివరీ బాయ్ టాలెంట్‌కు మెచ్చి సాయం చేసిన రాహుల్ సిప్లిగంజ్
మధురమైన గాత్రాలను వెలికి తీసుకువచ్చే ప్రయత్నమే సింగింగ్ షో. ఇలాంటి సింగింగ్ షోలలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుని, ఎన్నో అద్భుత స్వరాలను పరిచయం చేసిన "సూపర్ సింగర్" స్టార్ మాలో మళ్ళీ ప్రారంభం ప్రారంభమైంది. టాలెంట్ ఉంటే చాలు ఎవరైనా అనుకున్న స్థానానికి వెళ్లడం పెద్ద కష్టమేమి కాదు.. విభిన్నమైన ఆలోచనతో, విలక్షణమైన వాయిస్‌లతో వడపోసిన స్వరాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. తెలుగు రాష్ట్రాల నుంచే కాక అమెరికా, కేరళ నుంచి కూడా వచ్చి ఈ పోటీలలో పాల్గొన్నారు. సంగీతం మీద ఆసక్తితో, తమను తాము నిరూపించుకోవాలన్న ఆకాంక్షతో సుమారు 20 మంది కంటెస్టెంట్స్ ఈ పోటీలో పాల్గొన్నారు. యాంకర్ శ్రీముఖి ఈ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా గాయని శ్వేతా మోహన్, మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, గేయ రచయిత అనంత శ్రీరామ్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా జరిగిన ఎపిసోడ్లో వెంకటేష్ అనే ఓ కంటెస్టెంట్ రాహుల్ సిప్లిగంజ్ను మెప్పించాడు. కృష్ణార్జున యుద్దం సినిమాలోని 'దారి చూడు మామ దుమ్ము చూడు మామ' అనే పాటతో అక్కడ జడ్జీలను మెప్పించాడు. ఆ పాట పాడిన వెంకటేష్ ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తూనే మ్యూజిక్ నేర్చుకుంటున్నట్లు స్టేజీ మీద తన కష్టాలను చెప్పుకున్నాడు. దీంతో రాహుల్ సిప్లిగంజ్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఆ యువకుడి కష్టాన్ని మెచ్చుకున్నాడు. గతంలో తాను కూడా ఒక బార్బర్ షాప్‌లో పని చేస్తూనే పాటలు పాడటం నేర్చుకున్నానని గుర్తు చేసుకున్నాడు.కష్టాలు ఉన్నప్పుడు కూడా వాటిని తట్టుకుని ఇలా ముందుకు రావడం అంత సులభం కాదని రాహుల్ చెప్పాడు. ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ సంగీతం కోసం కష్టపడుతున్న వెంకటేష్‌కు లక్ష రూపాయలు సాయం చేశాడు రాహుల్.వాస్తవంగా ఆ యువకుడిలో కూడ మంచి టాలెంట్ ఉంది.అతను పాడిన పాట కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది. View this post on Instagram A post shared by STAR MAA (@starmaa) -
సూపర్ సింగర్.. ఆరోజే ప్రారంభం!
మధురమైన గాత్రాలను వెలికి తీసుకువచ్చే ప్రయత్నమే సింగింగ్ షో. ఇలాంటి సింగింగ్ షోలలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుని, ఎన్నో అద్భుత స్వరాలను పరిచయం చేసిన "సూపర్ సింగర్" ఇప్పుడు స్టార్ మాలో మరింత వినూత్నంగా మళ్ళీ ప్రారంభం కాబోతోంది. విభిన్నమైన ఆలోచనతో, విలక్షణమైన వాయిస్‌లతో సర్వం సిద్ధం చేసుకుంది. షో కోసం ఆడిషన్స్ నిర్వహించి.. వాటి నుంచి వడపోసిన స్వరాలు ప్రేక్షకులు ఆస్వాదించబోతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాక అమెరికా, కేరళ నుంచి వచ్చి పాటల మీద, సంగీతం మీద ఆసక్తితో, తమను తాము నిరూపించుకోవాలన్న ఆకాంక్షతో కంటెస్టెంట్స్ పాల్గొనేందుకు రావడం ఈ షో ప్రత్యేకత. ప్రముఖ యాంకర్ శ్రీముఖి ఈ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా నలుగురు ప్రతిభావంతులు న్యాయమూర్తులుగా కంటెస్టెంట్స్‌ని తీర్చిదిద్దడంతో పాటు పోటీని మరింత రసవత్తరంగా నడిపించబోతున్నారు. ఇంతకీ ఆ నలుగురు మరెవరో కాదు.. గాయని శ్వేతా మోహన్, మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, గేయ రచయిత అనంత శ్రీరామ్. వీరే ఈ సారి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. 20 మంది కంటెస్టెంట్లతో ప్రారంభం కాబోతున్న ఈ షోలో 16 మందితో అసలైన పోటీ మొదలవుతుంది. ఈ నెల 23 నుంచి.. ప్రతి శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకు "సూపర్ సింగర్" సంగీతాభిమానుల్నే కాదు.. ప్రతి “స్టార్ మా” ప్రేక్షకుల్ని అలరించనుంది. షో నిర్వహణలో ఈ సారి స్టార్ మా ఓ కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. కంటెస్టెంట్స్, వాళ్ళని తీర్చిదిద్దే జడ్జెస్, మార్కులు.. ఇవి మాత్రమే కాకుండా షో ని ఇంకా ఆసక్తిగా మలచబోతున్న ఆ విషయం ఏంటో తెలుసుకోవాలంటే 'స్టార్ మా'లో సూపర్ సింగర్ చూడాల్సిందే. చదవండి: నాకు, నా ఫ్యామిలీకి ఏదైనా జరిగితే ఆ ఐదుగురిదే బాధ్యత!: రైతుబిడ్డ -
శభాష్ భువనేష్... పాఠాలైన, పాటలైనా బ్రెయిలీ లిపిలోనే!
ఎన్నిసార్లైనా ‘శబ్భాష్’ అంటూ మెచ్చుకోవచ్చు భువనేష్ను. ఒకే గొంతుపై ఎంతోమంది గాయకులను తీసుకు వస్తూ తీయని పాటలు వినిపిస్తున్నందుకు, జటిలమైన శ్లోకాలను అలవోకగా వల్లిస్తున్నందుకు, హుషారెత్తేలా గిటార్ వాయిస్తున్నందుకు, మైమరిచిపోయేలా వేణుగానం వినిపిస్తున్నందుకు, వాయిద్యాలతోనే కాదు నోటితో కూడా వాయిద్యాల ధ్వనిని అద్భుతంగా పలికిస్తున్నందుకు, మెరుపు వేగంతో నృత్యాలు చేస్తున్నందుకు, మిమిక్రీ చేస్తూ నవ్విస్తున్నందుకు.... మన భువనేషన్ను ఎన్నిసార్లైనా మెచ్చుకోవచ్చు. స్టార్‌మా రియల్టీ షో సూపర్ సింగర్ జూనియర్లో థర్డ్ ప్లేస్‌లో నిలిచి సంగీతాభిమానులను ఆకట్టుకున్న భువనేష్ విజయనగరంలోని ద్వారకామాయి అంధుల పాఠశాల విద్యార్థి. పాఠాలైన, పాటలైనా బ్రెయిలీ లిపిలో రాసుకుంటాడు. చిన్నప్పుడెప్పుడో ఒక టీవీ సీరియల్ ప్రోమో సాంగ్ విని అచ్చంగా అలా పాడేశాడు. నిజానికి ఆ పాటలో కష్టతరమైన పదాలు ఉన్నాయి. అయితే అవేమీ తనకు కష్టం అనిపించలేదు. అమ్మానాన్నలకు సంగీతం తెలియదు. తనకు సంగీతం నేర్పించే గురువు అంటూ లేరు. యూట్యూబ్‌నే గురువుగా చేసుకొని రకరకాల జానర్స్‌లో పాటలు నేర్చేసుకున్నాడు. విజయనగరం నుంచి హైదరాబాద్‌కు వచ్చి పాడి సామాన్యప్రేక్షకుల నుంచి సంగీత ఉద్దండుల వరకు ఎంతోమంది ప్రశంసలు అందుకున్నాడు. పెద్దల ఆశీర్వాదబలం ఊరకే పోదు. ఆ బలం ఈ సూపర్సింగర్ను మరింత స్పీడ్‌గా ముందుకు తీసుకువెళుతుంది. -
సూపర్ సింగర్ జూనియర్ గ్రాండ్ ఫైనల్, పోటీలో ఐదుగురు!
గాత్రం మీది... వేదిక మాది... వయసుతో పనేముంది? ప్రతిభే కదా ఉండాల్సింది! వందమందిలో అయినా ఆత్మవిశ్వాసంతో పాడగలననే ధైర్యం.. శాస్త్రీయమైనా, సమకాలీనమైనా శృతి తప్పకుండా వినపించనగలననే నమ్మకం... వెరసి, మీరే సూపర్ సింగర్!! ఔత్సాహిక గాయనీగాయకులకు అపూర్వ అవకాశమందిస్తున్న స్టార్‌మా సూపర్ సింగర్ జూనియర్ పోటీలు ముగింపు దశకు వచ్చాయి. గత 13 వారాలుగా బుల్లితెర ప్రేక్షకులను తమ అపూర్వ గాన ప్రతిభతో కట్టిపడేసిన బుల్లి గాయనీగాయకులు ఇప్పుడు టైటిల్ పోరుకు సిద్ధమయ్యారు. తెలుగు టెలివిజన్ రంగ చరిత్రలో ఎంతోమంది సూపర్ సింగర్స్‌ను వెలుగులోకి తీసుకువచ్చిన స్టార్ మా సూపర్ సింగర్ జూనియర్ పోటీల ఫైనల్స్‌ను ఈ ఆదివారం (ఆగస్టు 28) మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించబోతున్నారు. పదమూడు వారాలు... 14 మంది అపూర్వ గాయనీ గాయకులతో రసవత్తరంగా జరిగిన పోటీల ఫైనల్స్‌లో ఐదుగురు పోటీపడబోతున్నారు. ఈ ఎపిసోడ్‌కు ముఖ్య అతిథులుగా అక్కినేని నాగార్జున, బ్రహ్మానందంతో పాటు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రబృందం కృతీశెట్టి, సుధీర్ బాబు, ఇంద్రగంటి మోషన కృష్ణ విచ్చేయనున్నారు. హాట్‌స్టార్‌లోనూ ప్రసారం కాబోయే ఫైనల్స్‌కు గాయకులు చిత్ర, మనో, హేమచంద్ర, రనీనా రెడ్డి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. అనసూయ, సుధీర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. చదవండి: వేరే అమ్మాయితో నా మాజీ బాయ్‌ఫ్రెండ్, గుండె పగిలింది: సింగర్ నెట్టింట వైరల్ అవుతున్న ‘అర్జున్‌రెడ్డి’ డిలీటెడ్ సీన్ -
వయసులో తన కంటే చిన్నవాడిని పెళ్లాడిన సూపర్ సింగర్!
Super Singer Fame Maalavika Gets Married With Ashwin Kashyap Raghuraman: సూపర్ సింగర్ ఫేమ్ మాళవిక సుందర్ వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. ఎంటర్ప్రెన్యూర్ అశ్విన్ కశ్యప్ రఘురామన్‌తో ఏడడుగులు నడిచింది. ఇతడు వయసులో మాళవిక కంటే చిన్నవాడు కావడం గమనార్హం. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. మూడు ముళ్లతో కొత్త జీవితం ప్రారంభించిన మాళవికకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా మాళవిక.. తమిళ సూపర్ సింగర్ షోలో ప్లే బ్యాక్ సింగర్‌గా అలరించింది. ఈ షోలో తనేంటో ప్రూవ్ చేసుకున్న మాళవికు తమిళంతో పాటు తెలుగులోనూ అనేక అవకాశాలు వచ్చాయి. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మాళవిక ఇప్పటివరకు తెలుగులో 200 పైచిలుకు పాటలు పాడింది. తనకంటే వయసులో చిన్నవాడిని పెళ్లి చేసుకోబోతున్నానని ఈ మధ్యే ఫ్యాన్స్‌కు హింటిచ్చిన గాయని.. పెళ్లికి వయసుతో పని లేదని, ఇద్దరం ఒకరినొకరిని అర్థం చేసుకుని, గౌరవించుకుంటే అంతే చాలని చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by priya (@cinitime) View this post on Instagram A post shared by Positive vibes (@positivevibes1201) View this post on Instagram A post shared by Positive vibes (@positivevibes1201) View this post on Instagram A post shared by Maalavika Sundar (@sundarmaalavika) -
రాంగ్ గైస్!
కావాలనుకుని... ఆపై కాదనుకుని... అన్నీ అయిపోయాక ఏదో జరిగిపోయిందని బాధపడుతోంది హాలీవుడ్ కలల రాణి జెన్నిఫర్ లోపెజ్. ఇప్పటి వరకూ తాను ‘రాంగ్ గైస్’తోనే సహజీవనం చేశానని తెగ మథనపడిపోతోంది. నలభై ఐదేళ్ల తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానంది. ‘నేను ఓ మంచి గాళ్‌ఫ్రెండ్‌గా, ఒకరికి భార్యగా చేయాల్సినవన్నీ చేశాను. అయినా నాకు ఎదురైన మగవాళ్లందరూ తప్పుడు మనుషులే’ అంటూ వాపోయింది. గత ఏడాది వచ్చిన లోపెజ్ జ్ఞాపకాల ‘ట్రూ లవ్’లో ఆవేదనంతా వెళ్లగక్కింది ఈ సూపర్ సింగర్. మార్క్ యాంథోనీతో విడాకుల ఎపిసోడ్, వేధింపుల జీవితం... సహజీవనం, సంసారంలో అనురాగమే లేక ఎంతగా మనోవేదన అనుభవించిందీ గుర్తు చేసుకుంది జెన్నిఫర్. -
డబుల్ టెంపరేచర్!
సూపర్ సింగర్ జస్టిన్ బీబర్, మెగా మోడల్ లారా స్టోన్ అభిమానులకు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. కాల్విన్ క్లెయిన్ కొత్త యాడ్‌లో ఇద్దరూ టెంపరేచర్ రైజ్ చేసే పనిలో పడ్డారు. ఈ ప్రకటన కోసం టాప్‌లెస్‌గా నటించి షాకిచ్చారు. ఫుల్‌గా టాటూలతో నిండిపోయిన బీబర్ బాడీని చుట్టేసిన లారా పిక్చర్‌ను చూస్తుంటే పురుష పుంగవుల టెంపరేచర్లు రైజవుతున్నాయన్నది ‘డైలీ మెయిల్’ కథనం. రీసెంట్గా ఈ పిక్చర్ ఒకటి బయటకు వచ్చింది. ఇప్పటి వరకూ బీబర్ అండర్ వేర్ యాడేదో చేస్తున్నాడని రూమర్లు షికార్లు చేశాయి. తాజా ఫొటోతో అందరి ఊహాగానాలకు తెరపడింది.