
తనకంటే వయసులో చిన్నవాడిని పెళ్లి చేసుకోబోతున్నానని ఈ మధ్యే ఫ్యాన్స్‌కు హింటిచ్చిన గాయని.. పెళ్లికి వయసుతో పని లేదని, ఇద్దరం ఒకరినొకరిని అర్థం చేసుకుని, గౌరవించుకుంటే అంతే చాలని చెప్పుకొచ్చింది..
Super Singer Fame Maalavika Gets Married With Ashwin Kashyap Raghuraman: సూపర్ సింగర్ ఫేమ్ మాళవిక సుందర్ వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. ఎంటర్‌ప్రెన్యూర్ అశ్విన్ కశ్యప్ రఘురామన్‌తో ఏడడుగులు నడిచింది. ఇతడు వయసులో మాళవిక కంటే చిన్నవాడు కావడం గమనార్హం. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. మూడు ముళ్లతో కొత్త జీవితం ప్రారంభించిన మాళవికకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కాగా మాళవిక.. తమిళ సూపర్ సింగర్ షోలో ప్లే బ్యాక్ సింగర్‌గా అలరించింది. ఈ షోలో తనేంటో ప్రూవ్ చేసుకున్న మాళవికు తమిళంతో పాటు తెలుగులోనూ అనేక అవకాశాలు వచ్చాయి. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మాళవిక ఇప్పటివరకు తెలుగులో 200 పైచిలుకు పాటలు పాడింది. తనకంటే వయసులో చిన్నవాడిని పెళ్లి చేసుకోబోతున్నానని ఈ మధ్యే ఫ్యాన్స్‌కు హింటిచ్చిన గాయని.. పెళ్లికి వయసుతో పని లేదని, ఇద్దరం ఒకరినొకరిని అర్థం చేసుకుని, గౌరవించుకుంటే అంతే చాలని చెప్పుకొచ్చింది.