super-specialty
-
పవన్ కల్యాణ్ అభిమాని శ్రీజ డిశ్చార్జ్
హైదరాబాద్: బ్రెయిన్ ఫీవర్‌తో బాధపడుతూ ఖమ్మం లోని కార్తీక్ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందిన పవన్ కల్యాణ్ అభిమాని శ్రీజను డాక్టర్లు డిశ్చార్జి చేశారు. కుటుంబసభ్యులు ఆమెను పాల్వంచ తీసుకువెళ్లారు. చిన్నారి పరిస్థితిని మీడియా ద్వారా తెలుసుకున్న సినీ హీరో పవన్‌కల్యాణ్ అక్టోబర్ 17న ఆస్పత్రికి వచ్చి పరామర్శించిన విషయం విదితమే. ఆమె కోలుకోవడంతో పవన్ అభిమానులు ఆస్పత్రిలో స్వీట్లు పంచిపెట్టారు. -
సూపర్ స్పెషాలిటీ వైద్య కౌన్సెలింగ్ ప్రారంభం
విజయవాడ: ఈ ఏడాది సూపర్ స్పెషాలిటీ(డీఎం/ఎంసీహెచ్) మెడికల్ కోర్సుల్లో చేరేందుకు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో మంగళవారం నిర్వహించిన కౌన్సెలింగ్ దాదాపు 11 గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో అభ్యర్థులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కలిపి అందుబాటులో ఉన్న మొత్తం 121 సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో 10వ షెడ్యూల్ ప్రకారం ఈ కౌన్సెలింగ్ విధానం యధావిథిగా కొనసాగించడంతో పాటు జూన్ 2 తర్వాత ఎంసీఐ అనుమతి పొంది అందుబాటులోకి వచ్చిన సీట్లు ఆయా రాష్ట్రాల అభ్యర్థులకే(15 శాతం అన్ రిజర్వుడు, 85 శాతం లోకల్) చెందేలా ఇరు రాష్ట్రాల ఒప్పందం మేరకు ఈ నెల 15న జీవో జారీ అయింది. దీని ప్రకారం ఈ సీట్లకు సంబంధించి తయారు చేసిన సీట్ మ్యాట్రిక్స్‌ను 2 రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం కోసం హెల్త్ వర్సిటీ అధికారులు పంపగా, తర్జనభర్జనల మధ్య మంగళవారం మధ్యాహ్నానికి ఆమోదం పొందింది. దీంతో కౌన్సెలింగ్‌కు పరిశీలకులుగా వ్యవహరించిన ఇరు రాష్ట్రాల డీఎంఈలు డాక్టర్ పుట్టా శ్రీనివాసరావు, డాక్టర్ శాంతారామ్ హైదరాబాద్ నుంచి సాయంత్రానికి హుటాహుటిన విజయవాడకు చేరుకున్నారు. రాత్రి 7 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభించారు. తొలి సీటును టాప్ ర్యాంకర్ డాక్టర్ అమన్చంద్ర ఎంసీహెచ్ (యూరాలజీ) ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఆన్‌రిజర్వుడు కోటాలో తీసుకున్నారు. హెల్త్ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ టి. రవిరాజు, తెలంగాణ డీఎంఈ, ఏపీ డీఎంఈల చేతులు మీదుగా అడ్మిషన్ ప్రతాన్ని అమన్చంద్రకు అందజేశారు. కార్డియాలజీలో 11 సీట్లు, న్యూరాలజీలో 11 సీట్లు, న్యూరో సర్జరీలో 18 సీట్లు, కార్డియోథొరాసిక్లో 7 సీట్లు, యూరాలజీలో 13 సీట్లు, నెఫ్రాలజీలో 10 సీట్లు, సర్జికల్ అంకాలజీలో 3 సీట్లు, మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో 11 సీట్లు, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ 2 సీట్లు, నియోనాటాలజీలో 2 సీట్లు, ఎండోక్రైనాలజీలో 6 సీట్లు, పీడియాట్రిక్ సర్జరీలో 13 సీట్లు, ప్లాస్టిక్ సర్జరీలో 14 సీట్లు అందుబాటులో ఉన్నాయి. -
ఆ సిబ్బందిని అక్కడికే పంపండి
నాలుగో తరగతి ఉద్యోగులు కంప్యూటర్ ఆపరేటర్లుగా ఎలా పనిచేస్తారు ప్రిన్సిపాల్‌ను ప్రశ్నించిన డీఎంఈ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరిన సూపరింటెండెంట్ సిద్ధార్థ వైద్య కళాశాల అభివృద్ధి కమిటీ సమావేశం విజయవాడ : సూపర్ స్పెషాలిటీ విభాగాలకు కేటాయించిన సిబ్బంది వైద్య కళాశాలలోఎలా విధులు నిర్వర్తిస్తారని, వారిని ఆ విభాగాలకే పంపించేయాలని రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు(డీఎంఈ) డాక్టర్ శాంతారామ్ అన్నారు. వారిలో ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లున్నారని ప్రిన్సిపాల్ చెప్పడంతో, నాలుగో తరగతి ఉద్యోగులు కంప్యూటర్ ఆపరేటర్స్‌గా ఎలా పనిచేస్తారంటూ డీఎంఈ ప్రశ్నించారు. సిద్ధార్థ వైద్య కళాశాల డెవలప్మెంట్ సొసైటీ సమావేశం శుక్రవారం కళాశాలలోని సెమినార్ హాల్లో జరిగింది. రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ శాంతారామ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ప్రభుత్వాస్పత్రి సూపర్‌స్పెషాలిటీ విభాగాల సిబ్బంది, వైద్య కళాశాలలో పనిచేస్తున్న విషయంలో ఇటీవల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ సూర్యకుమారి డీఎంఈ దృష్టికి తీసుకెళ్లారు. ఏజెండాలోని అంశాలైన వైద్య కళాశాలలో ఇంటర్నల్ఫోన్స్ రిపేరు, కొత్తవి ఏర్పాటు, జిరాక్స్ మెషిన్స్ కొనుగోలు, మైక్రోబయాలజీలో పరికరాల కొనుగోలు, రూ.4లక్షలతో అన్ని డిపార్ట్మెంట్లలో మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. అదే విధంగా ఫర్నిచర్ కొనుగోలు వంటి అంశాలపై సమావేశంలో తీర్మానించారు. అధిక వ్యయం అయ్యే రోడ్లనిర్మాణం, భవనాల మరమ్మతులు, ఇతర విభాగాల్లోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకె ళ్లాలని సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సూర్యకుమారి, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణమూర్తి, రాష్ట్ర వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఈఈ లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్లు డాక్టర్ శివశంకర్, డాక్టర్ శశాంక్ ఏడీ పద్మజ తదితరులు పాల్గొన్నారు. సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకోండి... ప్రభుత్వాస్పత్రిలో ఈసీజీ టెక్నీషియన్స్, సిటీ టెక్నిషియన్ప్ పోస్టులు లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యు.సూర్యకుమారి డీఎంఈ శాంతారామ్ దృష్టికి తీసుకెళ్లారు. రేడియోగ్రాఫర్స్ కొరత తీవ్రంగా ఉందని ఎనిమిది మందికి ఒక్కరే అందుబాటులో ఉన్నారని, డ్రైవర్స్ కొరత ఉందని తెలిపారు. దీంతో వీఐపీలు నగరంలో పర్యటించే సమయంలో ఉన్న వారు కాన్వాయ్‌కు సర్ధుబాటు చేసేందుకు ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. రెండు చోట్ల ఆస్పత్రు ఉండటం, సిబ్బంది తక్కువగా ఉండటంతో నిర్వహణ కష్టంగా ందని తెలిపారు. ఆమె అభ్యర్థనలపై సానుకూలంగా స్పందించిన డీఎంఈ శాంతారామ్ ప్రస్తుతం శాంక్షన్ అయిన పోస్టుల ఖాళీలను భర్తీ చేద్దామని, కొత్త పోస్టుల శాంక్షన్ ఇప్పుడు సాధ్యం కాదని చెప్పినట్లు సమాచారం. తొలుత ఆయన డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయానికి వెళ్లి వైస్ ఛాన్సలర్ డాక్టర్ టి.రవిరాజ్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.బాబూలాల్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారితో చర్చించారు.